Pawan kalyanPawan kalyan

పవనాలు రూపంలో వస్తున్నవి చిరు గాలులు (Chiranjeevi) కాదు. ప్రచండ పవనాలు అని కుల మీడియాకి (Media) తెలియాలి. తెలిసే విధంగా పవన్ (Pawan Kalyan) విధానాలు ఉండాలి. దొరల గజ్జి కుక్కకి జలుబు చేస్తే సమస్త మానవాళి తుమ్మడము మొదలు పెట్టాలి అని దొరల మీడియా ఆదేశిస్తుంది. దొరలూ ఏ పాపిష్టి పనిచేసిన అది ప్రజా సంక్షేమము కోసమే అని కుల మీడియా డబ్బాలు కొడుతోంది. అటువంటి కుల మీడియాకి అణచివేయబడ్డ వర్గాలు విశాఖ సాగర తీరములో కవాతు రూపములో చేసిన “సింహనాదము” కనపడ లేదా లేక వినపడలేదా?

ఓట్లు బానిసలవి, సీట్లు దొరల వర్గాలకు

చలిచీమలు (Ants) అన్నీ కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయము గురించి విశాఖ సాగర తీరములో కవాతు నిర్వహిస్తే కనీస ప్రచారము కూడా ఇవ్వరా? ఈ కుల మీడియా  వివక్షత ఇంకెన్నాళ్లు? సొమ్ములు బానిస వర్గాలవి, ప్రచారాలు దొరల పార్టీలకా? ఓట్లు బానిసలవి, సీట్లు దొరల వర్గాలకు, దొరల గుమ్మాల దగ్గర కాపలా కాసే అరుపు దళాలకా? అగచాట్లు అణచివేయబడ్డ వర్గాలవి, పదవులన్నీ దొరలవా?

“విడాకులు అతనే ఇచ్చాడు” అంట అని మీడియా చెడుగా రాయగలిగింది. అలానే జనసేనుడు రాష్ట్రానికి ద్రోహము చేసాడు అని ఎవరో “బుద్ధిలేని వెలకన్నా” అన్నదానికి కూడా ప్రచారము  మీడియా ప్రచారం కల్పించింది. కానీ రాష్ట్ర హక్కుల సాధన కోసము జనసేనుడు తన సైనికులతో సాగర తీరంలో చేసిన సింహనాదం అనే భారీ కవాతుకు ప్రచారం కల్పించ లేదు.

పార్టీ అధినాయకులు తమ కోటల్లో ఉండి రైళ్లను, పట్టాలను ద్వంసము చేయమని ప్రజలని రెచ్చగొట్టడము కాదు. అధినాయకులు కదలిరండి. రైలురోకో చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేద్దాం అన్న జనసేనుడి మాటల్లో ఉన్న నిజాయితీని కమ్మని మీడియా అణచివేస్తూ పోతుంటే ఎంత కాలము చూస్తూ ఊరుకోవాలి?

ఎన్నాళ్లీ అబల రాజకీయాలు

దొరల కుటుంబాల్లో జరుగుతున్న అబలల ఆర్తనాదాలని దొరల మీడియా తెరలతో దాచేస్తూ ఉన్నారు. కానీ అణచివేయబడ్డ వర్గాల కుటుంబాల్లో చిచ్చులు పెట్టి, అలజడులు సృష్టించి, వీధిలోకి లాగుతూ దొరల మీడియా చేస్తున్నది. ఇది జర్నలిజమా లేక బ్రోకరిజమా?

నిత్యమూ, తిట్టుకొంటూ, కొట్టుకొంటూ, వీధిపాలు అవ్వుతూ, ఆప్యాయతలు లేకుండా కలిసి ఉన్న దాంపత్య జీవితాలు కోకొల్లలు. కానీ విధి విలాపము వల్ల విడిపోయి కూడా ఒకరిమీద ఒకరికి ఉన్న అభిమానముతో, గౌరవముతో, పిల్లలపై ఉన్న బాధ్యతలతో వారు ఇద్దరు ఉంటున్నారు. కానీ  ఒకరినొకరిని పల్లెత్తు మాటకూడా అనుకోవడము లేదు. అటువంటి ఎన్నో కుటుంబాలను కక్షతో ఈ మీడియా వీధిపాలు చేస్తూ “అబల” రాజకీయాలు చేస్తున్నది.

యుద్ధనీతి, రాజనీతి, మానవ ధర్మాలను పక్కన పట్టి “అబల నీతి”ని మాత్రమే పట్టుకొని దొరల మీడియా వత్తాసు పలకడము బ్రోకరిజము కాదా? రాజ్యము దొరల భోజ్యమా? దొరలు, దొరల మీడియా పెట్టే మానసిక హింసకి భయపడి పారిపోవడానికి వస్తున్నవి “చిరు” గాలులు కాదు.

నేడు వస్తున్నది పెను పవనాలు. ప్రచండ రూపములో వస్తున్నాయి. దొరల మీడియా కోటలు, ఆ కోటలు చుట్టూ ఉన్న దొరల అవినీతి వృక్షాలను కూకటి వేళ్ళతో పెకలించడానికి ప్రచండ పవనాలై జనసేనుని రధచక్రాలు వస్తున్నాయి.

మీడియా తన అరచేతితో సూర్యుడిని ఆపగలదా? మార్పు తధ్యం. ఇష్టం ఉన్న లేకున్నా కమ్మని-దొడ్డ మనసుతో ఆ మార్పుకి స్వాగతము పలుకుతారా? లేక మార్పుని అబల నీతితో అడ్డుకొని జర్నలిజాన్ని బ్రోకరిజంగా చరిత్రలో ఉండే విధంగా చేస్తారా?

ఆలోచించండి!!! తరాలు మారుతున్నా తలరాతలు మారవా? ఇంకెన్నాళ్లు పల్లకీ మోత?