Kandhula DurgeshKandhula Durgesh

కాపుల్ని అమ్ముడుపోతారంటూ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం
సభను బహిష్కరించాల్సిన కాపు ప్రజా ప్రతినిధులు చప్పట్లు కొడతారా?
కాపులకు వైసీపీ ప్రభుత్వం చేసిన న్యాయమేంటో శ్వేతపత్రం ద్వారా చెప్పాలి
కాపుల్ని అడ్డంగా మోసం చేసిన పార్టీ వైసీపీ
ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు దక్కకుండా చేశారు
తూర్పు గోదావరి జిల్లాలో అన్ని కులాలు జనసేన వైపు చూస్తున్నాయి
మీడియా సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్

కాపులను (Kapu) మోసం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party). కాపు కార్పోరేషన్’ను (Kapu Corporation) పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే (YCP Government) దక్కుతుందని జనసేన పార్టీ (Janasena Party) కి చెందిన కందుల దుర్గేష్ (Kandula Durgesh) స్పష్టం చేశారు. జగన్ రెడ్డికి (Jagan Reddy) చిత్తశుద్ది ఉంటే కాపులకు ఏ మేరకు న్యాయం చేశారో చెబుతూ శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) అధ్యక్షులు కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు.

కాపు కార్పోరేషన్ (Kapu Corporation) ద్వారా ఏటా ఇస్తానన్న రూ. 2 వేల కోట్లు ఏమయ్యాయని దుర్గేష్ ప్రశ్నించారు. కాపుల్ని అమ్ముడుపోయే వస్తువుగా చిత్రిస్తూ ముఖ్యమంత్రి (Chief Minister) వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతుంటే సభను బహిష్కరించాల్సిన కాపు ప్రజా ప్రతినిధులు (Kapu Representatives) చప్పట్లు కొడుతూ కూర్చోవడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం రాజమండ్రిలో (Rajahmundry) పార్టీ నాయకులతో కలసి కందుల దుర్గేష్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ “గొల్లప్రోలు (Gollaprolu) లో కాపునేస్తం (Kapu nestham) పథకం ద్వారా బటన్ నొక్కడానికి వచ్చిన బటన్ రెడ్డికి (Button reddy) ప్రత్యేక అభినందనలు. ఆయన పాలన చేయలేరు.. బటన్ మాత్రమే నొక్కుతారు. కాపు నేస్తం వేదిక సాక్షిగా ఆయన ప్రసంగం, చెప్పిన అవాస్తవాలు వింటే ఈ ముఖ్యమంత్రి మయసభలో పరాభవానికి లోనైన దుర్యోధనుడి (Duryodhana) మాదిరి ఏకపాత్రాభినయం చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోగా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నానని చెప్పడం సిగ్గు చేటు అని దుర్గేష్ ఆరోపించారు.

జగన్ ప్రభుత్వం (Jagan Government) చేసిన మోసాలు ఏమిటంటే?

ఇదే జిల్లా.. ఇదే ప్రాంతంలో కాపు రిజర్వేషన్లు (Kapu Reservations) అమలు చేయడాన్ని ఖండించిన మాట వాస్తవం కాదా? కాపు కార్పోరేషన్ ద్వారా విదేశీ విద్యోన్నతి పథకానికి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఎన్ని కోట్ల రూపాయిల రుణాలు ఇచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లలో (EBC Reservations) గత ప్రభుత్వం 5 శాతం కాపులకు (Kapulu) కేటాయిస్తే ఆ 5 శాతం తీసేసి ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా?

కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు (Kapu) ఇవ్వాల్సి ఉండగా దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు.

కాపు రిజర్వేషన్లు అమలు చేయనని నిస్సిగ్గుగా చెప్పిన మీరు ఏ అర్హతతో కాపుల గురించి మాట్లాడుతున్నారు.

కాపు కార్పోరేషన్ ద్వారా ఏటా రూ. 2 వేల కోట్లు ఇస్తామన్న మీరు గడచిన మూడేళ్లలో కాపుల అభ్యున్నతికి ఎన్ని కోట్లు కేటాయించారు.

కాపు కార్పోరేషన్ ద్వారా విదేశీ విద్యోన్నతి పథకానికి, ఇతరత్ర రుణాలకు ఎన్ని కోట్లు ఇచ్చారో శ్వేతపత్రం ద్వారా కాపు నేస్తం విడుదల చేయాలని కాపునేస్తం లబ్దిదారుల తరఫున జనసేన పార్టీ డిమాండ్ చేసింది.

సంక్షేమ పథకాల (Welfare Schemes) ద్వారా ఇచ్చిన మొత్తం కలుసుకుని రూ. 33 వేల కోట్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్దం. ఎన్నికల ముందు కాపు అక్కాచెల్లెళ్లకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్లలో రూ 75 వేలు ఇస్తామని, కాపు కార్పోరేషన్ కి రూ. 2 వేల కోట్లు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా? ఈ ఏడాది అన్ని సంక్షేమ పథకాలకు కలపి రూ. 1,497 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు.

ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఇప్పుడు చెబుతున్న అంకెలకీ తేడా తెలియాలంటే ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాలి అని కందుల దుర్గేష్ డిమాండ్ చేసారు.

మేనిఫెస్టోలో (Manifesto) చెప్పినది ఏంటి ఇప్పుడు అమలు చేస్తున్నది ఏమిటి?

ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ (Bible), ఖురాన్ (Khuran), భగవద్గీత (Bhagvad geeta) అని చెప్పిన మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏంటి ఇప్పుడు అమలు చేస్తుందేంటో చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని దుర్గేష్ అన్నారు.

కులాలను విడగొట్టి ఓట్లు దండుకునేందుకు 56 కార్పోరేషన్లు పెట్టిన మీ ప్రయత్నాన్ని ఆ కులాలే ఎగతాళి చేస్తున్న పరిస్థితి. కార్పోరేషన్లు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఆ కార్పోరేషన్ ఛైర్మన్ కూర్చోవడానికి ఒక్క కుర్చీలేదు. ఒక్క కార్పోరేషన్ కి పట్టుమని రూ. 10 వేల ఫండ్ లేదు. పేరుకే ఛైర్మన్లు, డైరెక్టర్లు ఆయా కులాల అభివృద్దికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేని పరిస్థితి.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాపులతోపాటు అన్ని కులాలు జనసేన పార్టీ (Janasena Party)కి ఆకర్షితులవుతున్న విషయాన్ని గమనించి ముఖ్యమంత్రి పదే పదే జిల్లాకు వస్తున్నారు. ఈ రోజు అంబాజీపేట మండలంలో 150 మంది పార్టీలో చేరితో 120 మంది శెట్టిబలిజలు, మిగిలిన వారు దళిత సోదరులు ఉండడమే అందుకు నిదర్శనం.

దాడిశెట్టి రాజా అసలు కాపులకు చేసింది ఏమిటి?

పవన్ కళ్యాణ్’ని విమర్శిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా (Dadisetty Raja) ప్రజా ప్రతినిధిగా కాపులకు చేసిన న్యాయం ఏంటి? మీ మీద ఉన్న ఆరోపణలన్నీ వాస్తవాలు కాదా? కాపులకు న్యాయం చేసింది లేకపోగా మీ ముఖ్యమంత్రి కాపులు అమ్ముడుపోతున్నారని చెబుతుంటే రాజీనామా చేయాల్సింది పోయి వేదిక మీద చప్పట్లు కొడుతూ కూర్చున్నారు. పరామర్శల్లో సానుభూతి చూపాల్సింది పోయి పళ్ళు ఇకిలిస్తున్న బటన్ రెడ్డి గురించి అంతా పుంఖానుపుంఖాలుగా చెప్పుకుంటున్నారు. జనసేన పార్టీ తరఫున వినతిపత్రం ఇస్తామంటే తీసుకోవడానికి సమయం లేదు. కాపు ఆడపడుచులను పోలీసులతో అణచివేసిన మీరు కాపు అక్కాచెల్లెళ్లకు చాలా చేసేశానని చెప్పడానికి మించిన దారుణం ఏముంది అని కందుల దుర్గేష్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు?

పవన్ కళ్యాణ్’ని (Pawan Kalyan) దత్తపుత్రుడు (Dathaputhrudu) అని పదే పదే సంబోధించడానికే నెలకోసారి తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) నుంచి ముఖ్యమంత్రి (Chief Minister) బయటకు వస్తున్నారు. మీరు సీబీఐ దత్తపుత్రుడు అని చెప్పడానికి మీ మీద ఉన్న కేసులు, సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. జైలు రెడ్డి (Jail Reddy) చెప్పే మాటల్లో మాత్రం ఏ మాత్రం ఔచిత్యం లేదని కందుల దుర్గేష్ అన్నారు.

మీడియా సమావేశంలో పార్టీ నాయకులు మేడా గురుదత్ ప్రసాద్, అత్తి సత్యనారాయణ, మరెడ్డి శ్రీనివాస్, వై.శ్రీనివాస్, జిల్లా, నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love