Janasena పార్టీని విమర్శ చేసే వాళ్ళు మూడు రకాలు
1. జనసేన ముసుగులో ఉంటూ వైసీపీ కోసం మాట్లాడుతూ ఉంటారు. వీరు వైసీపీ (YCP) అధికారంలోకి రావాలి అనుకొనే వారు. వీరు టీడీపీలో కలవకుండా పోటీ చెయ్యాలి అంటారు. నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) లాంటివాళ్లు ఉండకూడదు అంటారు.
2. జనసేన ముసుగులో ఉంటూ టీడీపీ కోసం మాట్లాడుతూ ఉంటారు. వీరు టీడీపీతో కలిపి అధికారంలోకి రావాలి అనుకొంటూ ఉంటారు. టీడీపీతో (TDP) కలిపి పోటీ చెయ్యాలి. బాబుని సీఎం చెయ్యాలి అని వీళ్ళు అంటూ ఉంటారు.
3. కమ్మ వ్యతిరేకతతో, రెడ్డి వ్యతిరేకతతో ఉంటారు. అందులో భాగంగానే జనసేన (Janasena) ఒంటరిగా వెళ్ళాలి అని వీరు అంటుంటారు. రాజ్యాధికారం అనే తపన తప్పఅది ఎలా సాధించాలి అనే తంత్రాలు వీరికి తెలీవు. ఎవ్వరినీ కలుపుకోవడంలేదు. ఎవ్వరినీ కలవనివ్వడం లేదు అనే మనోవేదనతో రగిలిపోతూ ఉంటారు. మనమే సీఎం అవ్వాలి. ఒంటరిగా పోటీ చెయ్యాలి అంటారు. కానీ తన ఇంటిలోని వారిని కూడా ఎదిరించి పొరాడలేరు. రాజ్యాధికారం రావాలి అనే ఆరాటంలో పోరాట ఎత్తుగడలు తెలుసుకోలేరు. పార్టీ పటిష్టతలో సేనాని వ్యూహాలు, తంత్రాలను వీరు అర్ధం చేసికోలేరు.
ఈ మూడో వర్గంలో మరల రెండు మూడు రకాలు ఉంటారు. కొందరు బీజేపీకి (BJP) అనుకూలంగా ఉండాలి అంటారు. మరికొందరు ఎవ్వరి అవసరం అక్కరలేదు అంటూ అంటారు.
జనసేన పార్టీకి ఈ ముగ్గురి వల్లనూ ప్రమాదమే. ఇదే అక్షర సత్యం. ఛత్రపతి శివాజీ ఛత్రపతి అవ్వడంకోసం ఎన్ని పోరాటాలు చేసాడు. ఎన్నిసార్లు లొంగిపోయినట్లు నటించాడు. ఎన్నిసార్లు బానిసగా ఉండాలిసివచ్చింది అనేది తెలిస్తేగాని యుద్ధంలో పోరాటం చేయడం కష్టం. నాయకుని వ్యూహాలు అర్ధం చేసికోలేని కార్యకర్త వల్ల మార్పు అసాధ్యం.
సేనాని అభిప్రాయం కూడా ఇదే. మనిషిని చూస్తే చాలు అతను ఎటువంటి వాడు అనేది జనసేనాని పసిగట్ట గలరు. అయితే సేనానిలో ఉండే ఈ గొప్ప గుణమే జనసేన కొంప ముంచుతున్నది. జనసేనానిలో ఉన్న ఈ అతి భయమే మనోహర బంధనాల నుండి జనసేనని బయటకి రానివ్వకుండా చేస్తున్నది.
జనసేనాని యుద్ధ తంత్రం…
ఇది మనోహర బంధనం కాదు. ఇది ఒక జనసేనాని యుద్ధ తంత్రం. ఒక రాజకీయ ఎత్తుగడ అనేది సామాన్యులకు కూడా అర్థం అయ్యే వరకు జనసేనను పై ముగ్గురూ విమర్శలు చేస్తూనే ఉంటారు. వారి పబ్బాలు వారు గడుపుకొంటునే ఉంటారు.
నాయకుని వ్యూహాలు అర్ధం చేసికోలేని కార్యకర్త వల్ల పార్టీకి ఎంత నష్టమో రాజ్య కాంక్ష లేని నాయకుడు వల్ల కూడా అంతే నష్టం. సేనానిలో రాజ్య కాంక్ష లేక పోయి ఉండవచ్చు. కానీ రాజకీయ పరిజ్ఞానం మెండుగా ఉన్న రాజకీయ దురందురుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అని మాత్రం చెప్పగలం.
సూచన: మనోహర బంధనం అనేది యుద్ధ తంత్రమే అయితే తప్పులేదు. కానీ అది నిజంగానే “మనోహర బంధనమే” అయితే భావితరాలు మనల్ని క్షమించవు. దశాబ్దాల నిరీక్షణ అడవి కాచిన వెన్నెలే అవుతుందేమో?
ఆలోచించండి… మనోహర బంధనాలు అనేది అక్షర సత్యం ఆరోపణ కాదు. జనాభిప్రాయం అని గమనించండి. (It’s from Akshara Satyam)