ఒకడు రాజులధ్వనిని (Rajadhani), అభివృద్ధిని (Development) గ్రాఫిక్స్’లో (Graphics) చూపించి మురిపించాడు. పబ్బం గడుపుకొన్నాడు. నేడు పక్కకు తప్పుకున్నాడు.
మరొకడు దానిని గొడ్డళ్లతో మూడు ముక్కలుగా నరికేసి (3 Capitals) తన సొంత పొలాలు ఉన్నచోటకి లేపుకు బోయాడు. నరకగా కారిన రక్తపు మరకల్లో పడి తిట్టుకు చస్తున్నామే గాని నిజాల్ని తెలిసికోలేక పోతున్నాం.
“రాజులధ్వని” అనేది పాలకుల అవసరాల కోసం మాటిమాటికి మారకూడదు. మూడు ముక్కలు కాకూడదు. ఎక్కడైనాగాని ఒక్కటిగా ఉంచాలి అని సామాన్యుడు (Common Man) కోరుకొంటున్నాడు. కానీ సంక్షోభ పథకాల (Sankhobha padhakalu) మత్తులో అడగలేక పోతున్నాడు.
పెద్దోళ్ల దోపీడి తన్నాని బయటపెట్టాల్సిన మీడియా గొట్టాలు (Media Gottalu) భాదిత వర్గాలను (Suppressed Classes) రచ్చకి ఈడుస్తూ తమ మీడియా (Media) గొట్టాలను నడిపించు కొస్తున్నారు. ఆ విషపు గొట్టాలను నమ్మి బాధితులు బలైపోతున్నారు. కానీ అక్షర సత్యాలు (Akshara satyalu) చెప్పే “అక్షర సత్యాలను” నమ్మలేక పోతున్నారు.
అలానే బీదలు (Poor people) మాత్రం నా కిలో బియ్యం నాకు ఇస్తే చాలు మీరు ఏమిచేసికొన్నా పరవాలేదు. ఏమి అమ్మేసి కొన్నా పరవాలేదు అనుకొంటూ 10 రూపాయిల సర్కారీ మందుని వందకి కొని అయినా తాగి వూగుతున్నారు. చీఫ్ లిక్కర్ మత్తులో నిజాలు చిత్తై పోతున్నాయి అని తెలిసికోలేక పోతున్నారు.
మేధావులు (Intellectuals), కుల నాయకులూ (Caste Leaders), కుల మీడియాలు (Kula Media) మాత్రం తన తమ యాజమాన్య పార్టీలకు (Ruling Parties), సూట్ కేసులు (Suite Cases) అందజేసిన వాల్లకి బాకాలు ఊదుతున్నారు? జీ హుజూర్ అంటూ నిజాలను తమ కోటు జేబులో పెట్టి పాతేస్తున్నారు. తమ నల్ల కోటు జేబుల్లో, తెల్ల నోట్ల క్రింద పడి నిజం నుజ్జు నుజ్జయి పోతున్నదా?
గొర్రె కసాయినే నమ్ముతాది గాని
గొర్రె కసాయినే నమ్ముతాది గాని మార్పు కోసం వచ్చే వాడిని నమ్మదు అంటూ భాదిత యువత నిర్వేదంలో ఉంటున్నది. వాడు వెధవ వీడు వెధవ అంటూ తిడుతూ పిచ్చి ఆనందాన్ని పొందుతున్నది. కానీ ఆ గొర్రెలు కసాయిని ఎందుకు నమ్ము తున్నాయి? మార్పు కోసం వచ్చిన పార్టీ ఈ గొర్రెలకు ఎందుకు సేద నివ్వడం లేదు. అసలు పవనాలు చైనా గోడలను ధాటి బయటకు ఎప్పుడు వస్తాయి అని అడగలేక పోతున్నారు.
పేదోడి రాజ్యాన్ని (Pedodi rajyam) పెద్దోళ్ళు పంచుకొని తింటున్నారు. బాధిత వర్గాల జీవితాలను నిన్నటివరకు గెద్దలు పీక్కొని తిన్నాయి? నేడు రాబోంధులు (Rabondhulu) పొడుచుకొని తింటున్నాయి? పొడుచుకొని తినే రాబోంధుల కంటే పీక్కొని తినే గెద్దలే నయం అంటూ గెద్దల వంక దీన చూపులు మొదలు పెట్టేస్తున్నాము? ఈ రెండూ మన స్వేదాన్ని కదా అమ్ముకొని తింటున్నాయి అనే ఆవేదన సోషల్ మీడియా (Social Media) గోడలు దాటి వీధులలోకి రావడం లేదు.
ఆలోచించండి… తరతరాలుగా పల్లకీలు మోస్తున్నాగాని ఎన్నాళ్లీ గెద్దల గోల.. రాబొందులు రొద? ఎన్నాళ్లీ గెద్దలు-రాబొందులు చేస్తున్న మరణ మృదంగ ధ్వనులు (Marana Mrudhanga Dwanulu)? ఇంకానా? ఇంకెన్నాళ్లు?
(సూటిగా సుత్తి లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే మీ Akshara Satyam)