Babu CryingBabu Crying

అవమానభారంతో కన్నీరు మున్నీరైన పెద్దాయన

శాసనసభలో (Assembly) నిన్న జరిగిన అవమాన భారంతో చంద్రబాబు (Chandra Babu) ఎక్కి ఎక్కి కన్నీరు కార్చారు. సభలో జరిగిన అవమానాలకు చలించిపోయిన తెదేపా (TDP) అధినేత President) చంద్రబాబు బోరున విలపించారు. శాసనసభ ఆయనకు కొత్తకాదు. సభలో ఆవేశకావేశాలు, రాజకీయ విమర్శలు, ఉద్విగ్న, ఉద్రిక్త పరిస్థితులూ కూడా కొత్తేమీకాదు. చెన్నారెడ్డి (Chenna Reddy), కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (Kotla Vijaya Bhaskar Reddy), నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి (Neduramalli Janardhan Reddy), వైఎస్‌ రాజశేఖరరెడ్డి ( YS Rajashekar Reddy) వంటి ఎందరో నాయకులతో ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాడారు. ఎంతో దీటుగా నిలబడ్డారు. కానీ నిండుసభలో… వైకాపా ఎమ్మెల్యేలు తన భార్యపై వ్యక్తిత్వ హననానికి పాల్పడం బాబు తట్టుకోలేక పోయారు. ఆమెను కించపరిచేలా అత్యంత అవమానకరంగా, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయి ఉంటారు. అందుకేనేమో బాబు తీవ్రంగా కుంగిపోయారు.

ఆవేదనతో కృంగిపోయిన బాబు

అధికార పార్టీ ఎమ్మెల్యేల (Ruling Party MLAs) అనుచిత వ్యాఖ్యలపై సభలో వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంలో స్పీకర్‌ (Speaker) సభను వాయిదా వేయడంతో చంద్రబాబు (Chandra babu) తన ఛాంబర్‌లోకి వచ్చి కూర్చున్నారు. ఆప్పటికే ఆయన ముఖం అవమానభారంతో ఎరుపెక్కింది. అప్పటికీ ఉబికివస్తున్న దుఃఖాన్ని నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించారు. పార్టీ సహచరుల్ని చూశాక చంద్రబాబు అంతరంగంలో బాధ ఆపుకోలేక పోయారు. వారి ముందే భోరున విలపించారు. సభలోనే తన ఆవేదన వెల్లడించి… బయటకు వచ్చేయాలన్న ఉద్దేశంతో మళ్లీ సభలోకి వెళ్లారు. స్పీకర్‌ (Speaker) మైక్‌ (Mike) ఇచ్చారు. చంద్రబాబు తన ఆవేదన తెలియజేయడం మొదలు పెట్టారు. అప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పూర్తిగా మాట్లాడక ముందే… స్పీకర్‌ మైక్‌ కట్‌ చేయడంతో, ఆయన తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి అవమానభారంతో నేరుగా పార్టీ కార్యాలయానికి (Party Office) చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకొన్నారు. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక పదేపదే భోరున విలపించారు. ఎక్కి ఎక్కి ఏడ్చారు.

Mega Karna Chiranjeevi Donated

Spread the love