Current charges hikedCurrent charges hiked

ఫ్యాన్’కి ఓటేసినందుకు-ఫ్యాన్ వేసికోలేని పరిస్థితి?

ఏపీలో (AP) విద్యుత్తు చార్జీల (Electricity Charges) బాదుడు మోరోసారి మొదలు అయ్యింది. విద్యుత్తు చార్జీల పెంపు అనేది జగనన్న (Jagananna) పేద ప్రజలకు ఇస్తున్న ఉగాది (Ugadi) కానుకగా సోషల్ మీడియాలో (Social Media) పదే పదే ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో (Opposition) ఉన్నపుడు బాదుడే బాదుడు అంటూ ఊరూరా ప్రచారం చేసిన జగన్ (Jagan) నేడు ముఖ్యమంత్రిగా చార్జీలను, పన్నులను పెంచుకొంటూ పోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు.

బాదుడే బాదుడు అన్న జగన్ మాటలను జగన్ ధరలు తగ్గిస్తాడు ప్రజలు నమ్మారు. తమ తమ ఓట్లను గుద్దుడే గుద్దుడు. కానీ నేడు జగన్ ప్రభుత్వం (Jagan Government) పెంచుతున్న ధరలను చూసు ఓట్లు వేసి గెలిపించిన ఆ ప్రజలే నేడు అవాక్కు అవుతున్నారు. ఔరా అంటూ ముక్కున వెలిసికొంటున్నారు.

ఏపీలో నేడు అంతా రివర్స్‌ విధానాలను అర్ధం చేసికోలేకపోతున్నారు. ఇసుక రేట్లు బాదుడు, మద్యం రేట్లు బాదుడు, పెట్రోలుపై పన్నుల బాదుడు, చెత్తపన్ను బాదుడు, ఆస్తి పన్ను బాదుడు, పాత ఇళ్లపై కొత్తగా ఓటీఎస్‌ అనే బాదుడు. ఎక్కడ చూసినా బాదుడే బాదుడు అనే ప్రచారాలతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఉగాది కానుక అన్నట్లుగా నేడు మరోసారి విద్యుత్‌ చార్జీల బాదుడు అనేది గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు ఉంది.

పేదోళ్ళకి జగనన్న కరెంటు షాక్‌ (Jagananna Current shock)!

పేద, మధ్య తరగతి వాడే విద్యుత్తుపై భారీ వడ్డన వేశారు.

యూనిట్‌కు 45 పైసల నుంచి రూ.1.57 పెంపు జరిగింది.
30 యూనిట్లలోపు యూనిట్‌ ధర రూ.1.౯౦
76 -125 యూనిట్లకు రూ.4.౫౦
400 యూనిట్లు దాటితే రూ. 9.౭౫
అన్ని కేటగిరీల్లోనూ చార్జీల మోత మోగింది.

విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచి పేద, మధ్యతరగతి వర్గాలపై మోయలేనంత భారం వేసింది. కనీస వినియోగ పరిమితిని 50 యూనిట్ల నుంచి 30 యూనిట్లకు కుదించింది. దీనితోపాటు ఈ 30 యూనిట్ల ధరను కూడా యూనిట్‌ రూ.1.90కు పెంచింది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త విద్యుత్‌ టారిఫ్’ని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం తిరుపతిలో ప్రకటించారు.

75 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగిస్తే మొదటి 30 యూనిట్లకు యూనిట్‌ రూ.1.90 చొప్పున వసూలు చేస్తారు. 31-75 యూనిట్లలోపు యూనిట్‌కు రూ.3 చొప్పున వసూలు చేయాలని డిస్కమ్‌లను ఆదేశించింది. 76-125 యూనిట్లలోపు వాడితే యూనిట్‌కు రూ.4.50 వసూలు చేస్తారు. 226-400 యూనిట్ల లోపు రూ.8.75.. ఆపైన వినియోగిస్తే రూ.9.75 చొప్పున వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ పెంచిన పన్నులను శుక్రవారం (ఏప్రిల్‌ 1) నుంచే అమలు చేయాలని తేల్చి చెప్పింది.

ప్రతిపక్షాల విమర్శల మధ్య, పేదోళ్ల ప్రతిఘటనల మధ్య కొత్త సంవత్సరంలో కొత్త విద్యుత్తు ధరల పెంపు అమలు కాబోతున్నది అని చెప్పాలి.

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన నేడే

Spread the love