చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వని మోదీ, అమిత్ షా
రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వటంతోనే సరి
ఎదురు చూపుల తర్వాత తిరుగుముఖం?
చంద్రబాబుని కనికరించని ఢిల్లీ పెద్దలు! డీలాపడ్డ పచ్చ లాబీయింగ్. ఇదీ నేటి పరిస్థితి. ప్రధాని, హోం మంత్రి అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు రెండ్రోజులు పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనితో ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు చుక్క ఎదురైనట్లు అనిపిస్తున్నది. డ్రగ్స్‌కు ఏపీ కేంద్రంగా మారిందని ప్రచారం చేయడానికి దేశ రాజధానికి చంద్రబాబు వెళ్లారు. దీనికి కేంద్ర పెద్దల నుంచి స్పందన కరువైంది. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్ కోసం రెండ్రోజులపాటు పడిగాపులు కాసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. తనకు ఎలాగైనా అపాయింట్‌మెంట్ సంపాదించాలని పచ్చ పార్టీ అభిమానులు అందరూ లాబీయింగ్ చేయించాని వినికిడి. అయినప్పటికీ హోంమంత్రి అమిత్ షా.. చంద్రబాబును కలిసేందుకు ఇష్టపడలేదని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మంగళవారం రాత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి.
చంద్రబాబు నిరాశతో తిరుగుముఖం పట్టడంతో ఇక పచ్చ మీడియాలో చేసే ప్రచారం ఎలా ఉండబోతున్నదో అని ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.