జనసేనకు స్వచ్చంద విరాళాలు అందిద్దాం
జనసేన పిఏసీ సభ్యులు కొణెదల నాగబాబు గారు
కుల, మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు (Public Welfare) కోసం, ప్రజల పక్షాన నిలబడి పని చేస్తోన్న జనసేనకు (Janasena) అండగా నిలబడాలి. జనసేనకు అండగా నిలిచేందుకు ‘నా సేన కోసం నా వంతు’ (Na Sena Kosam Na vanthu) కార్యక్రమంలో భాగస్వాములై జనసేనకు స్వచ్చంద విరాళాలు (Donatains) అందించండి. అటువంటి వారికి మనమంతా అవగాహన కల్పించాలని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు (Konidala Naga Babu) చేశారు.
గురువారం జనసేన కేంద్ర కార్యాలయంలో (Janasena Central Office) నాగబాబు 7288040505 @icici అనే UPI ఐడికి స్వచ్ఛందంగా విరాళం అందించి ‘నా సేన కోసం నా వంతు’ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడారు. స్వశక్తినే నమ్ముకుని జనసేన (Janasena) పార్టీ స్థాపించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటి వరకూ తమ స్వార్జితంతోనే పార్టీని నడిపిస్తున్నారు. స్వచ్ఛంద విరాళాల (Voluntary Donations) ద్వారా తోడ్పాటు అందిస్తే పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగకరం అవుతుంది అని నాగబాబు అన్నారు.
ఇది పార్టీకి అండగా మన వంతుగా బాధ్యతగా విరాళాలు అందించేందుకు రూపొందించిన కార్యక్రమమని తెలిపారు. ప్రతీ జన సైనికుడిని (Jana Sainik), వీర మహిళను (Veera Mahila) కుటుంబ సభ్యులుగా భావించే పవన్ కళ్యాణ్’ని మనమూ కుటుంబ సభ్యుడిగా భావించి అండగా నిలబడదామని వెల్లడించారు. భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం పనిచేస్తున్న జనసేనకు స్వచ్ఛందగా విరాళాలు ఇచ్చి ప్రోత్సాహిద్దామని కొణెదల నాగబాబు అన్నారు.
నా సేన కోసం నా వంతు ప్రత్యేక కమిటీ
నా సేన కోసం నా వంతు కార్యక్రమం నిర్వహణ కోసం 32 మందితో కూడిన కమిటీని నాగబాబు గురువారం ప్రకటించారు. కమిటీ చైర్మన్ గా బొంగునూరి మహేందర్ రెడ్డి, కన్వీనర్ గా తాళ్లూరి రామ్, కో కన్వీనర్లుగా శ్రీమతి రుక్మిణీ కోట, టి.సి.వరుణ్, కో ఆర్డినేషన్ కమిటీలో సోషల్ మీడియా విభాగం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఐ.టీ. విభాగం నుంచి పసుపులేటి సంజీవ్, మరికొందరు ఎన్.అర్.ఐ. భాస్కర్, సాయి రాజ్ కె., సతీశ్ రెడ్డి, క్రాంతి కిరణ్, పవన్ కిషోర్, గిరిధర్, రవి కుమార్, ఏరియా కో ఆర్డినేటర్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముఖ్యమైన సభ్యులు ఉంటారని నాగబాబు చెప్పారు.
క్షేత్రస్థాయిలో (Field Level) పార్టీ కోసం పనిచేస్తున్న అందరితో మమేకమై ఈ కార్యక్రమం నిర్వహించాలని కమిటీ సభ్యులకు నాగబాబు సూచించారు. 3.5 లక్షల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, ఐటీ విభాగం, స్వచ్ఛందంగా పని చేస్తున్న సోషల్ మీడియా విభాగం, జనసేన ఎన్.అర్.ఐ. విభాగం, జిల్లా, అసెంబ్లీ, మండల, వార్డు ఇంఛార్జిలు, జనసేన పార్టీ వివిధ అనుబంధ విభాగాలు, వైద్యులు, వ్యాపారస్తులు, వీరమహిళా విభాగం, గృహిణులు, మహిళా ఉద్యోగులు, యువత, విద్యార్థులు, జనసేన పార్టీ శతగ్ని, పార్టీ అధికార ప్రతినిధులు తదితర విభాగాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండరు అని నాగబాబు అన్నారు.
జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు (Bank account) అనుసంధానం అయిన 7288040505 @icici అనే UPI ఐడి (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్) ప్రక్రియ ద్వారా చాలా సులభంగా కనీసం రూ.10 నుంచి ఎంత మొత్తాన్నైనా పార్టీకి విరాళంగా అందించవచ్చని కొణెదల నాగబాబు వెల్లడించారు.