Narendra ModiNarendra Modi

కేంద్రం తెస్తున్న వ్యవసాయ బిల్లులు (Agri bills) రైతుల (Farmers) కోసమా లేక రైతులను పీడించుకు తింటున్న ప్రైవేట్ వ్యాపార సంస్థల (middlemen) కోసమా అనేది నేడు పెద్ద చర్చనీయాంశం.

ప్రస్తుతం రైతులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల (Agri Products) అమ్మకాలు ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే (Agriculture Market yards) జరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసికొస్తున్న కొత్త వ్యవసాయ బిల్లుతో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు/కొనుగోళ్ల స్వరూపం దీనికి భిన్నంగా ఉండబోతున్నది అని కొత్త బిల్లు/చట్టం (New Agriculture acts) చెబుతున్నది. కార్పొరేట్ కంపెనీలు ప్రత్యక్షంగా రైతులతో ఒప్పందం చేసికోబోతున్నాయి. రైతులు ప్రభుత్వానికే తమ ఉత్పత్తులను అమ్మాలన్న నిబంధన ఏమీ ఇకపై ఉండబోతు. అయితే ప్రైవేట్ కంపెనీలు క్రమక్రమంగా వ్యవసాయ రంగంపై ఆధిపత్యం సాధించడం మొదలు పెడితే, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిస్కారం ఏమిటి? అసలు ఈ బిల్లు రైతుల పాలిట వరమా శాపమా అనేది ఒక్కసారి చూద్దాం.

కేంద్రం తెస్తున్న ఈ బిల్లు ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు/కొనుగోళ్లకు రైతులకు ప్రైవేట్ వ్యాపారులకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. రైతులు మార్కెట్ యార్డుల్లో కాకుండా ఏ ప్రైవేట్ వ్యాపారికైనా తమ పంట ఉత్పత్తులను ఇష్టం వచ్చినట్లు అమ్ముకోవచ్చు. కాబట్టి మార్కెట్ యార్డులకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం రైతులకు లేదు. రైతులు కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ధరల నియంత్రణ రైతులు/ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. రైతులకు, కొనుగాలుదారులకు మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండబోదు. కొత్త చట్టంతో ప్రైవేట్ వ్యాపారులే రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు కాబట్టి రైతులకి మార్కెటింగ్/రవాణా ఖర్చులు, ఇబ్బందులు ఉండవు. అంతరాష్ట్ర వ్యవసాయ సంభందిత వాణిజ్యం మరింత సులభతరం అవుతుంది.

కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం

కేంద్రం తెస్తున్న ఈ కొత్త బిల్లు ప్రకారం భవిష్యత్తులో పండించబోయే పంటకు కూడా ముందుగానే రైతులు ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొనవచ్చును. దీనినే కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం అని కూడా అంటారు. రైతులు ప్రైవేట్ వ్యాపారులతో నిర్ణీత కాల వ్యవధికి సంబంధించి ఒప్పందం కుదుర్చు కోవాలి. ఆ ఒప్పందానికి అనుగుణంగా తమ పంటలను ఉత్పత్తి చేస్తారు. వ్యాపార కంపెనీలు రైతులు పండించిన ఆ పంటను కొనుగోలు చేస్తాయి. రైతులు ఎవ్వరికైనా తమను పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. వ్యవసాయ రంగంలో సాంకేతికతకు కూడా ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రభుత్వం వివరిస్తున్నది. ప్రైవేట్ వ్యాపారులతో కాంట్రాక్ట్ విధానం ద్వారా 5 హెక్టార్ల లోపు సాగు భూమి ఉంటే చాలు. అటువంటి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఈ బిల్లు ద్వారా లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.

నేటి కేంద్ర వ్యవసాయ ఈ బిల్లు ప్రకారం ధాన్యం, నేనే గింజలు, ఉల్లి గడ్డలు లాంటి వాటిని నిత్యావసర వస్తువుల జాబితా నుండి తొలగిస్తారు. అందువల్ల వీటిని భారీ మొత్తంలో నిల్వ  చేస్తారు. తరువాత ధరలు పెంచి అమ్ముకొనే పెద్ద కంపెనీల గుప్తాధిపత్యానికి అవకాశం ఉండదు. అలానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా ఈ బిల్లులో అవకాశం ఉంటున్నది. తద్వారా పోటీ వాతావరణం ఏర్పడి రైతులకు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పనకు అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం చెబుతున్నది.

రైతులు ఈ బిల్లుపై వ్యతిరేకత చూపడానికి కారణం?

కేంద్రప్రభుత్వం తీసికొచ్చిన ఈ బిల్లుపై దేశంలోని అనేక రాష్ట్రాల నుండి వ్యతిరేకత ఎక్కువగా వస్తున్నది. ఈ బిల్లు చట్టంగా మారితే రైతులు కార్పొరేట్ కంపెనీల దయా దాక్షిణ్యాల మీద వ్యవసాయ రంగం ఆధార పడాలిసిన పరిస్థితులు వస్తాయి. అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధరను నిర్ణయించడం చేయక పోవచ్చు. అప్పుడు ప్రైవేట్ కంపెనీలు నిర్ణయించే ధరకే రైతులు అమ్మాలిసిన పరిస్థితులు రావచ్చు. అదే జరిగితే కనీస మద్దతు ధర కూడా దక్కక రైతులు మోసపోవాలిసి వస్తుంది. రైతుల్లో ఎక్కువ మంది కాంట్రాక్టులు చదివే చదువు సంధ్యలు ఉన్నవారు కాదు. అందువల్ల ఈ బిల్లు వల్ల రైతులు మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, రైతులు ఆందోళన చేస్తున్నాయి.

రైతులు మార్కెట్ యార్డుల ద్వారా కాకుండా ప్రైవేట్ కంపెనీలకే అమ్ముకొంటుంటే, అప్పుడు మార్కెట్ యార్డుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు రావాలిసిన ఆదాయం తగ్గి పోతుంది. వ్యవసాయ రంగంపై కూడా రాష్ట్ర ప్రభుత్వాలకంటే కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ అజమాయిషీ ఉండబోతున్నది అని రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళన చెందుతున్నాయి.

కేంద్ర వ్యవసాయ బిల్లుపై నేటికీ మిగిలివున్న శేష ప్రశ్నలు?

రైతులు, ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థ బలపడితే వ్యవసాయ రంగ సంక్షేమం/అభివృద్ధి గురించి ప్రభుత్వాలు పట్టించుకొంటాయా? ఒకవేళ రైతులు కష్టాల్లో ఉంటే వారికి తక్కువ వడ్డీలకి రుణాలు ఇచ్చి వారిని ఆడుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయా? రాష్టాలు నేడు చేస్తున్న రైతు భరోసా, రైతు బంధు లాంటి పథకాలతో రేపటి రోజున కూడా ప్రభుత్వాలు ఆదుకొంటాయా? పౌర సరఫరాలు శాఖపై నేటి బిల్లు ప్రభావం ఎలా ఉండబోతున్నది? చౌక ధరలకు ప్రభుత్వాలు ఇచ్చే పధకాలు రేపటి రోజున ఏమి అవుతాయి? ఏవి అన్నీ కూడా సమాదానాలు దొరకని శేష ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.

నిత్యం పీకల్లోతు అప్పుల్లో మునిగి తేలుతున్న రైతన్న, తాను పండించిన పంటని తన రుణదాతలకే తమ పొలాల్లోనే ధార బోస్తున్నాడే గాని ధర వచ్చినప్పుడే అమ్ముకోవాలి అనే ఆలోచన కూడా చేయలేక పోతున్నాడు. మరి అటువంటి అప్పుడు పక్క రాష్ట్రాల్లోకి పట్టుకెళ్లి ఎలా అమ్ముకోగలడు? పనికి ఆహారం పధకం, సంక్షేమ పధకాలతో వస్తున్న కూలీల లేమి సమస్య వెంటాడుతున్నది. ఇంకా రైతుల రుణ సమస్య లాంటి చిరకాల సమస్యలను ఈ బిల్లు ఎలా పరిస్కరిస్తున్నది అనేది కూడా జబాబు లేని ప్రశ్నలే?

మరొక పక్కన కేంద్రం తీసికొస్తున్న ఈ చట్టం ద్వారా అమలు కాబోతున్న కాంట్రాక్టు వ్యవసాయం రైతుల పాలిట వరంగా మారబోతున్నదా లేక శాపంగా మారబోతున్నదా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్ననే? పై ప్రశ్నలకి సరిఅయిన సమాధానాలు లేకపోతే ఎలా? అప్పుడు వ్యాపారుల పాలిట మాత్రమే ఈ చట్టం వరంగా మారే అవకాశాలే ఎక్కువగా అన్నాయి అనే ఆరోపణలు నిజం కావచ్చు. ఆలోచించండి 

Spread the love
One thought on “కేంద్రం తెస్తున్న వ్యవసాయ బిల్లు రైతుల కోసమేనా?<br> <br>బిల్లుపై రైతులు ఎందుకు భగ్గుమంటున్నారు?”
  1. Labhalala tho patu nastalu vunnayi .. mukyam gaa raithulu carporrte vyaparula guttadipatyam loki velli pramadam vundi.. appudu dalarula kante ekkuva darunalu chestaru vaallu.. ee bill pai punarsameeksha avasaram emo..

Comments are closed.