Konidela NagababuKonidela Nagababu

భీమవరంలో శుద్ధమైన త్రాగునీరు కూడా అందివ్వలేని ప్రభుత్వం
అబద్ధపు హామీలతో వ్యవస్థలను నిర్వీర్యం
దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల దాహార్తి తీర్చడంలో లేదు
భీమవరం “వర్చువల్” సమావేశంలో కొణెదల నాగబాబు

జనసేన ప్రభుత్వం (Janasena Government) వస్తుంది. జనసేన ప్రభుత్వంలో ప్రతీ పైసా కూడా ప్రజా ప్రయోజనాలకే ఉపయోగిస్తామని కొణెదల నాగబాబు (Konidela Nagababu) గారు స్పష్టం చేశారు. భీమవరం (Bheemavaram) నియోజకవర్గంలో ప్రజలకు వైసీపీ (YCP Government) అసత్యపు హామీలు ఇచ్చింది. ఆ అబద్దపు హామీలిచ్చిన నాయకులు కనీసం శుద్ధమైన త్రాగునీరు, వ్యవసాయానికి సరైన సాగునీరు కూడా అందించలేక పోతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. భీమవరం నియోజకవర్గం జనసేన కార్యవర్గంతో సోమవారం “వర్చువల్” సమావేశం ద్వారా కొణెదల నాగబాబు మాట్లాడారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం బాధ్యులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) నేతృత్వంలో నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, క్రియాశీలక కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

త్రాగునీరు, సాగునీటి కొరత, ముందుకు సాగని మంచినీటి పథకాలు, నెరవేరని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, డంపింగ్ యార్డు సమస్య, డ్రెయినేజీలు మురుగుకూపం లాంటివి భీమవరం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు. ఇంకా 100 పడకల ఆసుపత్రి కడతామని హామీ ఇచ్చారు. నెరవేర్చని ఆ ఇచ్చిన హామీలను, సమస్యలను జనసేన కార్యవర్గం నాగబాబు దృష్టికి తీసుకు వచ్చారు.

ఆయా సమస్యలపై నాగబాబు స్పందించారు. వైసీపీ నాయకులకు దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల దాహార్తి తీర్చడంలో లేదు. అబద్ధపు హామీలతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టే పరిస్థితుల్లో లేరని నాగబాబు అన్నారు. రాష్ట్రంలో మద్యం సరఫరా చేస్తున్నంత సులువుగా మంచినీరు అందించలేక పోతున్నారని కొణెదల నాగబాబు చెప్పారు.

వచ్చేది జనసేన ప్రభుత్వమే:ఎట్టకేలకు స్పష్టత నిచ్చిన నాదెండ్ల