రథసప్తమి సందర్భంగా శనివారం ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు శనివారం ఉదయం నగరంలోని పలు దేవాలయాలను సందర్శించారు. స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు.
ముందుగా ఏలూరు నగరంలోని పవర్ పేటలో శ్రీ సూర్య భగవాన్ దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం ఆర్ఆర్ పేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించారు.
ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు