అడుగడుగునా ఆంక్షలు.. రహదారుల దిగ్బంధం
గలాటాలో పలువురికి గాయాలు
ప్రశాంతంగా సాగుతున్న అమరావతి (Amaravathi) రైతుల (Rythu) మహాపాదయాత్ర (Maha Padayatra) పోలీసు (Police) నిర్బంధాలతో (Conditions) రణరంగంగా మారింది. గురువారం రోజున సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించడం, జనం ఎదురుతిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కఠిన ఆంక్షలు, నిర్బంధాల్నీ ఎదుర్కొంటూ పరిసర గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు.
ప్రకాశం జిల్లా (Prakasam District) నాగులుప్పలపాడు (Nagulapadu) నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాల్ని పోలీసులు మోహరించారు. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు. చెక్‌పోస్టులు పెట్టి వాహనాల్ని దారి మళ్లించారు. పాదయాత్రకు వెళ్లేందుకు వీల్లేదని చెప్పారు. హెచ్చరికల్ని కాదని ముందుకు వచ్చినవారిని అడ్డుకొన్నారు. వందల మంది పోలీసులు రోప్‌పార్టీలతో (Road party) ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు (Public) ఎదురుతిరిగి రైతుల దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు (Police) ఒక్కసారిగా లాఠీలు ఝళిపించల్సిన పరిస్థితి ఏర్పడింది. లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు. ఒకరి చెయ్యి విరిగింది అని తెలుస్తున్నది. నిబంధనలకు లోబడి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రకు కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ పేరుతో కావాలనే ఆంక్షలు సృష్టిస్తున్నారని రైతులు, ఐకాస నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.