ఏపీ ప్రభుత్వం (AP Government) జారీచేసిన జీవోలపై ఉద్యోగులు (AP State employees) సమ్మెకు (Strike) సిద్ధమవుతున్నారు. పీఆర్సీపై (PRC) ఏకపక్ష జీవోలు జారీ చేసిన సర్కారుకు ఉద్యోగ సంఘాలు (Employee Unions) సమ్మె నోటీసు (Strike notice) అందచేశాయి. ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమ్మె నోటీసు అందచేసింది. సీఎస్ తరపున జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కు సమ్మె నోటీసు అందచేశారు.
ఉద్యోగ సంఘాల నేతలు కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు వచ్చిన నష్టం, పీఆర్సీ జీవోలపై పెద్ద ఎత్తున వస్తున్న అసంతృప్తి దృష్ట్యా సమ్మె బాట పట్టనున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని పీఆర్సీ సాధన కమిటీ ప్రటకించింది. ఈ పీఆర్సీతో ప్రతి ఉద్యోగికీ నష్టమే కలుగుతుంది కావున దీనికి అంగీకరించేది లేదు అని పీఆర్సీ సాధన సమితి తేల్చి చెప్పింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, సచివాలయ, ఎన్‌ఎంఆర్, ప్రజా రవాణాతోపాటు ఇతర అన్ని విభాగాల, శాఖల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్లు వీరు తెలిపారు.