Vande Bharat ExpressVande Bharat Express

సికింద్రాబాద్ -వరంగల్ -ఖమ్మం-విజయవాడ-రాజమండ్రి-విశాఖపట్టణంలో హాల్టులు

సికింద్రాబాద్ నుండి విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌’ను (Vande Bharat Express) విశాఖపట్నం వరకు నడపాలని భారత రైల్వే శాఖ (Indian Railways) నిర్ణయం తీసుకుంది. ఈ వందే భరత్ ఎక్సప్రెస్’ను ప్రధాని మోడీ (Narendra Modi) చేతుల మీదుగా ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానున్నది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి కేటాయించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కొంత జాప్యం అయ్యే అవకాశం ఉన్న కారణంగా రైల్వే శాఖా ఈ నిర్ణయం తీసికోంది.

రైల్వే శాఖ తెలంగాణలో సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు కేటాయించిన ఎక్స్‌ప్రెస్‌’ని విశాఖపట్నం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏఏ స్టేషన్ లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఆగుతుందంతే

ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్న ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్ లలో ఆగుతుందని చివరకు వైజాగ్ చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే విషయాన్ని టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా వెల్లడించారు. జనవరి 12 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించడంతో పాటు, మరో మూడు ప్రాజెక్టులను మోడీ జాతికి అంకితం చేస్తారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి-వరంగల్ -ఖమ్మం-విజయవాడ-రాజమండ్రి-విశాఖపట్టణం చేరుకుంటుంది.

టి వి గోవిందరావు, హైకోర్టు అడ్వకేట్

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపుకు జగన్ అనుమతి