Mamatha Benarjee

జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ (Third Front) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతున్నది. తృతీయ ఫ్రంట్’ని పశ్చిమబెంగాల్‌ (West bengal) సీఎం మమతా బెనర్జీ (Mamatha Banerjee) సారథ్యంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేతలను ఏకం చేసే బాధ్యతను శరద్‌ పవార్‌ (Sharad pawar) తీసికున్నట్లు తెలుస్తున్నది. శరద్ పవర్ నివాసంలో నేడు (మంగళవారం) ఆయా పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ సమావేశానికి రావాల్సిందిగా దాదాపు 15 పార్టీల నేతలను, మేధావులు, కళాకారులను పవార్‌ ఆవహ్యానించినట్లు తెలుస్తున్నది.

కొద్ది రోజుల క్రితం ముంబైలో శరద్‌ పవార్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కలిశారు. నిన్న సోమవారం ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ మరోసారి శరద్ పవర్’ని కలిశారు. అనంతరం పవార్‌ తన కార్యాచరణ ముమ్మరం చేసినట్లు తెలుస్తున్నది.