JanasenaniJanasenani

పార్టీ నాయకుడు ముందు ఉంటేనే విజయం అనే?
క్యాడర్ మనోవేదనను అర్ధం చేసికోగలడా?

చంద్రబాబు (Chandra Babu) నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (Telugu Desam) పాలనకు ప్రజలు విసిగి వేసారారు. నాడు మార్పు కోసం ఎదురు చూసారు. దాన్ని అంది పూర్చుకోవడంలో జనసేన పార్టీ (Janasena Party) వెనకపడి పోయింది. అయితే జగన్ నాయకత్వంలోని (Jagan Leadership) వైసీపీ (YCP) దీన్ని అందిపుచ్చుకొంది. తెలుగుదేశం పాలన కంటే మెరుగైన పాలన అందిస్తాను అని ఆంధ్ర ప్రజలను జగన్ పార్టీ నమ్మించింది. ప్రజలు కూడా ఇది నమ్మి జగన్ మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. జనసేనానికి రావాల్సిన అధికారం జగన్ దక్కించుకున్నాడు. దానికి కారణం పవన్ నిష్క్రియాపర్వం. జగన్ ప్రచార ఆర్భాటం అని చెప్పాలి?

వైసీపీ పాలనపై కూడా ప్రజలకు విసుగు పుట్టింది?

అత్యధిక స్థానాలతో అధికారం చేపట్టిన వైసీపీ పాలనపై (YCP Government) ప్రజలకు నేడు విసుగు పుట్టింది. తెలుగుదేశం పాలనలో ఉన్న అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దోపిడీ విధానాలు నేటి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి అని ప్రజలు భావించడం మొదలు పెట్టారు. నేటి ప్రభుత్వంలో సామాన్యుడుకి స్థానం లేదు. అణగారిన వర్గాలకు అస్సలు విలువ లేదు అని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రము అప్పుల కుప్పగా (Debt Trap) మారింది అని ప్రజలు తలుస్తున్నారు.

అధికారంలో మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పాలనను చూసాం. వైసీపీ పాలనను కూడా చూస్తున్నాం. రేపటి ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేయాలని ప్రజలు భావించడం మొదలు పెట్టారు. జనసేనవైపు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాయకత్వపై ప్రజలు ఆశగా చూడడం మొదలు పెట్టారు.

ప్రజలు చూపు జనసేన వైపు-మరి జనసేనాని చూపు ఎటువైపు?

మరి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనే స్థితిలో నేడు జనసేన (Janasena) ఉన్నదా? ప్రజల ఆలోచనలను ఓట్లుగా మలచుకునే యంత్రాంగాన్ని జనసేనాని ఏర్పరచుకొన్నాడా? ప్రజల్లో నమ్మకాన్ని జనసేన నెలకొల్పగలుగుతుందా అనే ఆత్మావలోకనం (Introspection) జనసేనాని తక్షణమే చేసికోవాలి? అప్పుడే జనసేన రేపటి ఎన్నికల్లో విజయ దుందుభి మోగించగలదు. లేని యడల జనసేన స్థానాన్ని తెలుగుదేశం ఆక్రమించగలదు.

ఎక్కడ గొంగళి అక్కడే అన్న చందాన జనసేన!

జనసేనపార్టీని పెట్టి ఏడు సంవత్సరాలు దాటింది. సంస్థాగత ఎన్నికలు ఇప్పటికీ పూర్తి కాలేదు. చాలా నియోజక వర్గాలకు ఇంచార్జిలు ఇప్పటికీ లేరు. నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అధ్యక్షుల పర్యటనలు నేటికీ ప్రారంభం కాలేదు. ఇక పార్టీ ఎట్లా అధికారం సాధన వైపు పరుగు పెడుతుంది అని ప్రజలు మదన పడుతున్నారు.

గతంలో కేంద్ర బీజేపీ పెద్దలు (BJP Leaders) జనసేనకు మద్దతు నివ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఆ అవకాశాన్ని పవన్ ఉపయోగించు కోలేదు.

కేవలం సినిమా చేసి జనసేనాని డబ్బులు సంపాదించాలని… ఆ డబ్బుతోనే జనసేన పార్టీ నడపాలని చూస్తే పార్టీ ముందుకు సాగడం సాధ్యమేనా?  రాజకీయంగా పూర్తిస్థాయిలో పవన్ ప్రజల్లో ఉన్నప్పుడే జనసేనకు అధికారం దక్కుతుంది. అయినా పొలిట్ బ్యూరో (Politburo) ద్వారా వచ్చిన సలహాలను వినే స్థితిలో జనసేన లేదు. మేధోమధనం జరిపి వాటిని తీసుకునే వాళ్ళు జనసేన పార్టీలో లేరు. ఆచరించే వారు అస్సలు లేరు అనే అంతర్మధనంలో (Antharmadhanam) ప్రజలు ఉన్నారు.

రాజకీయ పరిస్థితులపై అవగాహన…?

నేటి దిగజారిన రాజకీయ పరిస్థితులపై జనసేనానికి (Janasenani) ఇప్పటికీ అవగాహన ఉన్నట్లు కనిపించదు.. ఎందుకంటే ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నజగన్ (Jagan) పదేళ్ళపాటు పోరాడితే గానీ సీఎం కాలేకపోయాడు. కేవలం అభిమానంతో పనులు జరగవు. పార్టీ క్యాడర్ (Party Cadre) మొత్తం నిరంతం ప్రజల్లో ఉండాలి. అప్పుడే ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని తెలిసికోవాలి. ముందుగా సేనాని జనసేన పార్టీని బలోపేతం చేయాలి. మంచి వాయిస్ ఉన్న ప్రజా ప్రతినిధులు సరి అయిన సంఖ్యలో పార్టీలో లేనే లేరు. పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయే నాయకులు కూడా తగిన సంఖ్యలో లేరు. ముఖ్యంగా మెగా కుటుంబం (Mega Family) పార్టీకి సపోర్ట్ లేదు అని కూడా ప్రజలు భావిస్తున్నారు.

మిగిలిన పార్టీలతో పోల్చితే పవన్ కళ్యాణ్ పార్టీకి మంచి విజయావకాశాలు ఉన్నప్పటికీ  వాటిని అందిపుచ్చుకోవడాని పార్టీ నాయకులూ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయడం లేదు. దీని కోసం పార్టీ అధినాయకుడుతో, సహా యావత్తు పార్టీ క్యాడర్ కష్టపడాలి. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీస్తున్నప్పుడు అందుకు మంచి డైరెక్టర్, మంచి హీరోయిన్, మంచి సంగీతం, మంచి ఫైట్ మాస్టర్, మంచి మంచి లోకేషన్స్ ఇలా అన్ని మంచిగా సెలెక్ట్ చేసుకుంటేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.

అలాగే జనసేన పార్టీ రాష్ట్రంలో విజయం సాధించాలంటే అన్ని రంగాల వారు, అన్ని వర్గాల వారు పార్టీలో ఉండాలి. మేధావులను (Intellectuals) కలుపు కోవాలి. అధ్యక్షుడు ముందుండి పార్టీని నడపాలి. అప్పుడే విజయం. అధ్యక్షుడు సినిమాలు తీసుకుంటూ పోతే… పార్టీని నడిపేందుకు ఒక పవర్ఫుల్ దిగువ స్థాయి నాయకుడిని ఎంపిక చేసుకోవాలి. వీరికి తోడు  మేధావులు, చదువుకున్న వాళ్ళు అన్ని రంగాలవారు సహాయకులుగా ఉండాలి. ముఖ్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోతే పవన్ సీఎం కాలేడు. ప్రతీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలి. రాజకీయం అంటేనే రాజకీయం చేయాలి. అంతే కానీ నేను నిజాయితీగా ఉంటాను స్వచ్ఛంగా ఉంటాను అంటే నేటి రాజకీయాల్లో కుదరదు.

ఎత్తుకి పైఎత్తులు వేయగలగాలి?

సినిమాలో డాన్సులు చేయాలి. డైలాగులు చెప్పాలి. ఫైట్లు చేయాలి. అలానే రాజకీయాల్లో కూడా అన్నిటిలో ఆరితేరి ఉండాలి. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు అప్పటికి అప్పుడు వేయగలగాలి. అప్పుడే రాజకీయం నడుస్తుంది. లేదంటే లేదు. పవన్ కళ్యాణ్ పార్టీని నమ్ముకుని చాలామంది కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారికి పార్టీ అధ్యక్షుడు గానీ పార్టీలో ముఖ్య నాయకులు గానీ ఎవరూ కూడా సహకరించడం లేదు.  వారిని ఉపయోగించుకోవడానికి పార్టీ ప్రయత్నం చేయడం లేదు. జనసేన పార్టీ అంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే పార్టీ అధ్యక్షులతో నేరుగా మాట్లాడేందుకు వారికి అవకాశాలు లేవు. అవకాశాలు ఎప్పటినుండో రావడం లేదు అని విచారం చెందుతున్నారు.

కింకర్తవ్యం ఏమిటి?

ఇక నియోజకవర్గాలలో పార్టీలోకి రావడానికి కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రారు అనే దానివల్ల  భయపడుతున్నారు. ఎవరైనాగాని పార్టీతో మమేకమై పార్టీ బలంగా ఉందని సర్వే చేసుకొని పార్టీలోకి వస్తారు. అయినా జనసేనానిపై నమ్మకంతో కొంతమంది పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి నాయకులను పార్టీలోకి చేర్చుకొనే యంత్రాంగమే జనసేన పార్టీలో కరువైనది అని చెప్పాలి.

అలానే ముందు పార్టీ బలంగా ఉందో లేదో కూడా జనసేనాని గమనించాలి. పార్టీని పటిష్టం చేయాలి. అధినాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలి. నాయకత్వ లక్షణాలు లేని వారిని తొలగించాలి. కొత్తవారికి అవకాశం ఇస్తూనే అనుభవం ఉన్న నాయకులను చేర్చుకోవాలి. తెలుగుదేశానికీ, అధికార వైసీపీకి ప్రత్యామ్న్యాయం జనసేన పార్టీనే అనే ధీమా ప్రజల్లో, నాయకుల్లో కలిగించాలి. జనసేనాని నిరంతరం ప్రజల్లో తిరిగే విధంగా ప్రజాళికలు రచించాలి. పార్టీ యంత్రాంగం పని తీరుపై నిరంతరం రివ్యూలు జరిగే విధంగా సేనాని వ్యూహాలు ఉండాలి.

జనసేనాని వీటిని తక్షణమే పరిగణలోనికి తీసికోవాలి. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముమ్మర యత్నాలు చేయాలి. తెలుగుదేశం, వైసీపీ చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టే విధంగా పార్టీ అధికార ప్రతినిధులను తయారు చేయాలి. అప్పుడే జనసేన అధికారాన్ని దక్కించుకోగలదు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారాన్ని (Rajyadhikaram) అందించగలదు.

జనసేనాని అలా చేయగలిగిన రోజునే, రేపటి రోజు అధికారం దక్కని వర్గాలది అవుతుంది. వారి కల నిజమవుతుంది. జనసేనాని!!! శుభం భూయాత్ (Shubham Bhuyat).

కైకాల సత్యనారాయణ పద్మ అవార్డుకు అర్హులు కారా?

One thought on “జనసేనాని విజయావకాశాలపై ఆత్మావలోకనం!”
  1. చక్కటి విశ్లేషణ. పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఒకరిద్దరి నాయకులను తోడు పెట్టుకుని తిరుగుతుంటే ప్రజల్లో నమ్మకం ప్రభలదు. ప్రజాంగీకారం గల ప్రముఖ నాయకులను కలుపుకోవాలి. అధ్యక్షుడు సినిమాలని ఇక ప్రక్కన పెట్టి పూర్తి సమయం పార్టీ బలోపేతానికి పని చేయాలి. మాజీ జెడి లక్ష్మినారాయణ గారిని వదులుకోవడం తప్పిదం అనుకుంటున్నాను. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి గెలుపు స్తోమత గల అభ్యర్థులను గుర్తించి వారు వారి నియోజకవర్గమంతటా చురుగ్గా తిరుగుతూ ప్రజల్లో మమేకమవులాగున చేయాలి. BJP తో కలిసి ప్రణాలికలు రచించుకోవాలి.

Comments are closed.