ChintalapudiChintalapudi

పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) చింతలపూడి (Chintalapudi)లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) 33వ వర్ధంతి (Death Anniversary) కార్యక్రమం ఘనంగా జరిగింది. వంగవీటి మోహన్ రంగా విగ్రహ నిర్మాణం, అభివృద్ధి ఫౌండర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ (Hyderabad) వనస్థలిపురం (Vanasthalipuram) కాపు సంఘం (Kapu Sangham) మాజీ అధ్యక్షులు తూము నాగభూషణం పాల్గొన్నారు.

ఈ సంఘర్భంగా అయన మాట్లాడుతూ రంగా  (Ranga) చేసిన ఎన్నో మంచి పనుల గురించి, ఆయన చేసిన సేవలు గురించి కొనియాడారు. రంగా జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాలకు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడేవారు అని అన్నారు. కులమతాలకు అతీతంగా సేవ చేసినటువంటి నిస్వార్థమైన వ్యక్తిగా రంగా చరిత్ర సృష్టించారని కూడా
తూము నాగభూషణం అన్నారు.

అనంతరం చింతలపూడి పాత బస్టాండ్ లో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహన రంగా విగ్రహ నిర్మాణంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తోట శివ నాగరాజు (నాని) ఉపాధ్యక్షులు తూము విజయ్ కుమార్ సెక్రటరీ ముత్యాల శ్రీనివాస్ (చిన్ని) ట్రెజరర్ మంచినపల్లి రాఘవేంద్ర రావు సభ్యులు కొత్త శ్రీనివాసరావు, దాసి రెడ్డి సురేష్, పట్టణ బీసీ నాయకులు పామర్తి కొండ, పట్టణ కాపు నాయకులు (Kapu Leaders) పాల్గొన్నారు.

–Garuvu Babu Rao from Jangareddygudem

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి