GoodmorningCMSir-1GoodmorningCMSir-1

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ (Janasena Party) మూడు రోజులపాటు తలపెట్టిన #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్’కి (Digital Campaign) కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో (Social Media) విస్తృత ప్రాచుర్యంలో ఉంది.

ట్విట్టర్లో 1, 2 స్థానాల్లో కొనసాగుతోంది. క్యాంపెయిన్ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే 1.66 లక్షల ట్విట్లు రావడం విశేషం. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ఫోటోలు, వీడియోల ద్వారా #GoodmorningCMSir హ్యాష్ ట్యాగ్’తో (Hashtag) ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా కృషి చేస్తున్నారు. ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల మీదా ట్రెండింగ్ జోరు కనిపిస్తోంది.

ఛిద్రమైన రహదారి వీడియో… ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని జనసేన (Janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ చేసారు.

రాష్ట్రంలో రహదారులు అధ్వాన్న స్థితిలో ఉన్న విషయమై ముఖ్యమంత్రిని మేల్కొలిపే #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 8 గం.కు పవన్ కళ్యాణ్ రావులపాలెం (Ravulapalem) నుంచి అమలాపురం (Amalapuram) వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను (Video) ట్విటర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి తెలుస్తోంది. ఈ వీడియోను పోస్టు చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు.

రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్

రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్ని (Cartoon) పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. హెలికాప్టర్’లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారిని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఆ కార్టూన్ (Cartoon) తెలియచేస్తుంది.

మున్సిపల్ కార్మికుల సమస్యలకు పరిస్కారం ఏది: శేషు కుమారి