ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 పెంపు
పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 80 పైసలు పెంపు
లోక్‌సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్
రాజ్యసభలోను నిరసన సెగ
పెరుతుతున్న పెట్రో ధరలపై (Petrol Prices) పార్లమెంటులో (Parliament) తీవ్ర నిరసలు వ్యక్తం అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రో ఉత్పత్తులపై ధరలు పెంచుతూ బాదుడు మొదలైంది. సామాన్యులపై ఈ పెరిగిన ధరల ప్రభావం ఉండబోతుంది. కొద్ది రోజులుగా దేశంలో స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలకూ రెక్కలు రావడం మొదలు అయ్యింది.
చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్‌పై (LPG Cylinder) రూ.50 పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో (Delhi), వాణిజ్య రాజధాని ముంబైలో 14.2 కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.949.50 వరకు చేరింది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.1002 వరకు చేరింది.
ప్రభుత్వరంగ చమురు సంస్థలు (Petroleum Organizations) పెట్రో లు, డీజిల్‌పై లీటరుకు 80 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.96.21కు, డీజిల్ రూ.87.47కు చేరు కున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో (Hyderabad) లీటరు పెట్రోలు ధర రూ.109.10, డీజిల్ ధర రూ.95.50 వరకు చేరుకుంది.
పారిశ్రామిక వినియోగదారులు బల్క్‌గా తీసుకునే డీజిల్ ధరనులీటరుకు రూ.25 చొప్పున ఇప్పటికే పెంచింది. నాలుగున్నర నెలలుగా అంతర్జాతీయ పెట్రో ధరలు అధికంగా ఉన్నప్పటికీ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచలేదని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. చమురు సంస్థలు ఈ నష్టాన్ని అంతటినీ ఒకేసారి పూడ్చుకోవాలని చూడడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో ధరలు పెంచేశారని మండిపడ్డారు. ఈ అంశంపై చర్చించాలని పట్టుపట్టారు. అయినప్పటికీ ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్ సభ్యులను వారించారు.
రాజ్యసభలో (Rajya Sabha) కూడా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. గత కొద్దీ రోజులుగా పార్లమెంట్ నిరాటంకంగా కోనసాగింది. అయితే మంగళవారం విపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.