PK and Harish ShankarPK and Harish Shankar

భవదీయుడు భగత్ సింగ్’పై (Bhavadeyudu Bhagat Singh) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టత నిచ్చారు. పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలలో భవదీయుడు భగత్ సింగ్ ఆగిపోయిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో (Social Meida) వార్తలు వస్తున్నాయి. పవన్ చేస్తున్న సినిమాలు ఆలస్యంగా షూటింగ్ జరుగుతుండడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ సినిమా మొదలు అవుతుంది అని పవన్ కళ్యాణ్ స్పష్టత నిచ్చారు.

ఆయన ఒక పక్క రాజకీయాలు మరొక పక్కన సినిమాలు చేస్తూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు అనే విమర్శలు ఎదురుక్కొంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రేక్షకులకోసం సినిమాలు చేస్తూనే ప్రజలకోసం రాజకీయాలపైనా నిరంతరం కష్టపడుతున్నారు.

ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో (Director Krish) పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) షూటింగ్ ఆగిపోయినాట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పటికే వీరమల్లు చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువచ్చి విమర్శలకు పవన్ సమాధానం చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో మొదలవ్వాల్సిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా విషయంలో నెట్టింట చక్కర్లు కొడుతున్న గాలి వార్తలపై స్పష్టత నివ్వడం జరిగింది.

నాని హీరోగా నటించిన సినిమా అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ విచ్చేసారు.

కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే: పవన్ కళ్యాణ్