వెల్లడించిన ఆలయ చైర్మన్ రాజాన
శ్రీశ్రీశ్రీ నూకలమ్మ అమ్మవారి ఆలయానికి కుభేరా చిట్ ఛైర్మన్ అలమండ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అమ్మవారి ఆలయ అభివృద్ధికి 1,01,116/లు విరాళంగా ఇచ్చారు. అలమండ సన్యాసిరావు, జోగమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి మనవడు ఇచ్చిన ఈ విరాళాన్ని వస్త్ర అలంకరణ, పుష్పాలంకరణ ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికీ ఉపయోగిస్తారని ఆలయ ఈఓ తెలిపారు.
నూకాలమ్మ అమ్మవారి ఆలయం పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉంది. అమ్మవారిని ఇలవేల్పు దేవతగా ఉత్తరాన కొలువై ఉండి భక్తులకు కొంగుబంగారంగా పిలిస్తే పలికే అమ్మగా పేరుగాంచినది. శ్రీశ్రీశ్రీ నూకలమ్మ అమ్మవారి దివ్యసన్నిధిలో శుక్రవారం నాడు అమ్మ వారికి నిత్య పూజా కైంకర్యాలు సాయం సంధ్యా హారతి పూజలు మరియు నిత్య నైవేద్యములు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు.
ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడతూ స్ధానిక దాతలకు అమ్మ వారి దివ్య దర్శనం మరియు ప్రత్యేక కుంకుమ పూజలు జరిపించారు. వేద మంత్రాలతో ఆశీర్వదించి, అమ్మ వారి శేష వస్త్రాన్ని, చిత్ర పటాన్ని ఇచ్చి, దాతలను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవాబృందం సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆలయ కమిటీ చైర్మన్ అన్నారు.
— జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు