Bro movie reviewBro movie review

శివతత్వము

పరమేశ్వరుడి (Parameswar) సహధర్మచారిణి సతీదేవి (Sati) దక్షయజ్ఞానికి (Daksha Yagna) వెళితే దహనం అయిపోతుంది అని ఆ కాలరూపుడు అయిన ఆ మహాదేవుడికి తెలుసు. సతి పతి మాట పెడచెవిని పట్టి దక్షయజ్ఞానికి వెళ్లి అగ్నిలో దహనం అయిపోతుంది.

“ఓ కాలరూపా! మహాదేవా! సతీదేవి మరణం గురించి నీకు ముందే తెలుసు. నీ భార్య అయిన సతీదేవిని కాపాడుకోలేవా” అని పక్కనే ఉన్న నంది, మహాదేవుడిని ప్రశ్నిస్తాడు. “కాలం మా అందరికంటే బలమైనది. కాలాన్ని మార్చడం ఎవ్వరి తరం కాదు. కాలానికి వ్యతిరేకంగా నడవడం ఎవ్వరికీ సాధ్యం కాదు” అని ఆ మహాదేవుడు నందికి చెప్పిన మాటలను నేటి తరానికి చెప్పడం కోసమే బ్రో సినిమా తీసారా అనిపిస్తున్నది.

విష్ణుతత్వము

“సాక్షాత్తు విష్ణుమూర్తి (Vishnu) సహధర్మచారిణి లక్ష్మి దేవి (Lakshmi) ఎడబాటుని ఎదుర్కొనే ప్రయత్నాలు చేయలేవా ఓ కాలరూపా! నారాయణా” అని నారద మహర్షి విష్ణువుని ప్రశ్నించినప్పుడు “కాలం తన ఘటనలను తాను ఎప్పుడో రాసేసికొని ఉంటుంది. దాన్ని మార్చడం ఎవ్వరి తరమూ కాదు. కానీ పరిస్కారం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని ఆచరించడంలో భక్తితో కాలం ఎత్తుగడలము కొంతకాలం మాత్రం ఎదుర్కొవచ్చు. కానీ కాలాన్ని ఆపలేం” అన్న విష్ణుమూర్తి మాటలను నేటి తరానికి చెప్పడం కోసమే బ్రో సినిమా తీసారా అనిపిస్తున్నది.

బ్రహ్మతత్వము

అందరి తలరాతలను బ్రహ్మ (Brahma) రాస్తాడు అని అందరికీ తెలిసింది. అలానే తన కొడుకు అయిన దక్ష ప్రజాపతి తలరాతను కూడా తన తండ్రి అయిన బ్రహ్మనే రాసాడు. కానీ దక్ష ప్రజాపతి మూర్ఖపు పాలనకు విముక్తి కోసం శివుడు దక్షుడిని సంహరిస్తాడు. “కాలం బలమైనది. దాన్ని ఎవ్వరు మార్చలేరు. దక్షుడి ప్రవర్తన కాలానికి వ్యతిరేకంగా ఉంది. అందుకే కాలం దక్షుడిని శిక్షించింది” అన్న బ్రహ్మ దేవుని నాటి మాటలను నేటి తరానికి చెప్పడం కోసమే బ్రో సినిమా తీసారా అనిపిస్తున్నది.

కురుక్షేత్రం

కురుక్షేత్ర (Kurukshetram) సంగ్రామంలో తన భర్తలు ఐదుగురు తప్ప సమస్తం నాశనం అవుతుంది అని ఆ శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ముందే చెబుతాడు. అయినా అభిమన్యుడు అంటే కృష్ణుని ముద్దుల మేనల్లుడు కదా? కృష్ణుడే అభిమన్యుని కాపాడతాడు అని ద్రౌపది ధైర్యంతో ఉంటుంది. కానీ అభిమన్యుడు చనిపోతాడు. ఉపపాండవులు బతుకుతారు (ఆ తరువాత ఉపపాండవులు కూడా చనిపోతారు. అది వేరు సబ్జెక్టు). కృష్ణా నీ మేనల్లుడిని కూడా నువ్వు కాపాడుకోలేవా అని ద్రౌపది విష్ణు అవతారమైన కృష్ణుడిని ప్రశ్నించినప్పుడు కృష్ణుడు ఏమంటాడు అంటే…

“కాలం ఘటనా ఘటనలు ముందే లిఖితమై ఉంటాయి. దాన్ని మార్చడం ఆ త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదు. తాడిని తన్నేవాడి తల మీద,  వాడి తలని తన్న గలిగే మరొకడ్ని కాలమే కూర్చోబెట్టి ఉంచుతుంది” అని ద్రౌపదితితో కృష్ణుడు అన్న మాటలను నేటి తరానికి చెప్పడం కోసమే బ్రో సినిమా తీసారా అని అనిపిస్తున్నది.

భగవత్గీత

“ఫలితం ఆశించకుండా నీ పని నువ్వు చేసికిపో. నువ్వు ఆ పని చేసినా చెయ్యక పోయినా ఆ పని ఆగదు. కానీ నీ ధర్మాన్ని నిజాయితీగా నువ్వు పూర్తి చేస్తే ఆ దేవుడు నిన్ను సృష్టించిన లక్ష్యం నెరవేరుతుంది. అప్పుడు ఆ దేవుడే నిన్ని హత్తుకొంటాడు” అన్న భగవత్గీత (Bhagavad Gita) సారాన్ని నేటి తరానికి చెప్పడం కోసమే బ్రో సినిమా తీసారా అనిపిస్తున్నది.

బ్రో సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ & టీంకి ఎన్ని కోట్లు వస్తాయో, రావో అక్షర సత్యానికి తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో ఒక అత్యుత్తమ మెసేజ్ ఉన్న సినిమాగా ఈ బ్రో మిగిలిపోతుంది. కాలం ప్రాతని పవన్ కళ్యాణ్, భూమి మీద ఉన్న మిగిలిన అతిధి పాత్రల్లో మిగిలిన నటులు అందరూ జీవించి నటించారు అని చెప్పాలి. జీవిత రహస్యాన్ని, చావు విలువను నేటి/రేపటి తరాలకు చాలా సులభమైన భాషలో చెప్పారు. అది అందరికీ అర్ధమయ్యే విధంగా సినిమాటిక్ గా చెప్పడంలో బ్రో టీం సక్సెస్ అయ్యింది. భావితరాలకు అవసరమైన ఒక చక్కటి సినిమాను బ్రో టీం అందించింది.

ప్రతీ జీవి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తెలిసికోకుండా మనం ప్రవర్తిస్తే కాలం ఏమి చేస్తుంది అనేది తెలిసికోవడం కోసం ప్రతీ ఒక్కరూ బ్రో సినిమా చూడాలి. ప్రతీ తల్లితండ్రులు తమ బిడ్డలకు, మనుమలుకు బ్రో సినిమా చూపించాలి. ఒక్కసారి చుస్తే నేటి తరానికి ఈ బ్రో సినిమా అర్ధం కాకపోవచ్చు. అర్థం అయ్యే వరకు చూస్తే కాలపురుషుడి విలువ ఏమిటో తెలుస్తుంది.

ఆలోచించండి… మేము పాలించడం కోసమే ఆ కాలపురుషుడు మా పులిఅన్నని పుట్టించాడు అనే రాక్షస మూకలకు బ్రో సినిమా పరమార్థం అర్ధం కాకపోవచ్చు. నా విశ్లేషణ కూడా అర్ధం కాకపోవచ్చు. అయినా తాడిని తన్నేవాడి తలను తాన్నడానికి, వాడి తలను తన్నే వాడిని వాడి పక్కనే పవనాల రూపంలో ఈ కాలం పెడుతుంది అనేది మాత్రం మర్చిపోకండి (It’s from Akshara Satyam)

(త్రిమూర్తులు కాలరూపులు. కాలం తన విధిని తాను నిర్వర్తించే విధంగా నడుచుకోవడమే ఈ కాలరూపులు విధి అని నమ్మి ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది అని అర్ధం చేసికోగలరు)

జగన్ రెడ్డి నువ్వు ఏమి పీక్కుంటావో పీక్కో అంటున్న పవన్ కళ్యాణ్