Amit Sha and JaganAmit Sha and Jagan

అమిత్‌ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం
హాజరు కానున్న దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు
అపరిష్కృత అంశాలను త్వరగా తేల్చాలని కోరనున్న ఏపీ ప్రభుత్వం
పోలవరం, విద్యుత్‌ బకాయిలు, రెవెన్యూ లోటు భర్తీపై చర్చించే అవకాశం
పటిష్ట ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తిరుపతిలో (Tirupati) కేంద్ర హోంమంత్రి (Central Home Minister) అమిత్‌ షా (Amit Sha) అధ్యక్షతన 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ (Southern Zonal Council) సమావేశం నేడు జరుగుతున్నది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు (Chief Ministers), కేంద్ర పాలిత ప్రాతాల లెఫ్టినెంట్ గవర్నర్’లు (Lieutenant Governors) హాజరు కానున్నారు. ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రాల వద్ద అపరిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాల్సిందిగా సమావేశంలో కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3వ తేదీన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆరుకు పైగా అంశాలనుఈ సమావేశంలో ప్రస్తావించేందుకు అజెండా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, వివిధ పెండింగ్‌ సమస్యలను (Pending Issues) ప్రస్తావించి త్వరగా పరిష్కరించాలని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్రవిభజన చట్టంలోని (State Division act) హమీలతో పాటు అపరిష్కృత అంశాలను, పెండింగ్‌ బకాయిలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తున్నది. ఈ సమావేశంలో రాష్ట్రానికి మేలు చేకూరేలా ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారు.

ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) సహా కేరళ (Kerala), తెలంగాణ (Telangana), తమిళనాడు (Tamilnadu), కర్ణాటక (Karnataka), పాండిచ్చేరి (Pondicherry)  రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్‌–నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ హాజరు కానున్నారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య