ముచ్చింతల్’లోని (Muchintal) రామానుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి (Rastrapati) రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) పాల్గొన్నారు. 120 కిలలోల స్వర్ణ రామానుజ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి (President) మాట్లాడుతూ కీలక సందేశాన్ని ఇచ్చారు. రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి (China Jiyar Swamy) గొప్ప చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. రామానుజ సహస్రాబ్ది సమరొహం సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పీడిత వర్గాల కోసం (Suppressed Classes) రామానుజాచార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారని అయన అన్నారు. మహాత్మ గాంధీపై రామనుజాచార్యుల ప్రభావం ఎంతో ఉందని రాష్ట్రపతి ప్రస్తావించారు.
రామానుజాచార్యుల శిష్యులల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారే ఉండేవారు. రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగములో కనిపిస్తాయని రాష్ట్రపతి వివరించారు. సమతా మూర్తి (Samatha Murthy) విగ్రహ స్పూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని అయన పిలుపు నిచ్చారు. భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే రామానుజాచార్యులు నిరూపించారని రాష్ట్రపతి పేర్కొన్నారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని నిర్ధేశించిన వ్యక్తి రామానుజాచార్యులు అని అయన అన్నారు.
రామానుజుల స్వర్ణమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లోకార్పణం చేశారు. స్వర్ణ రామానుజుల విగ్రహానికి రాష్ట్రపతి తొలిపూజ చేశారు. రామానుజాచార్యులు విగ్రహ ఆవిష్కరణపై రాష్ట్రపతికి చినజీయర్ స్వామి వివరించారు.
అంతకుముందు రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో రాష్ట్రపతి దంపతులు పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి బేగంపేట ఎయిర్‌పోర్టుకు (Begumpet Airport) చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జీయర్ ఆశ్రమానికి వెళ్లారు. తెలంగాణ సీఎం కెసిఆర్ రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు.