దుల్హన్ పథకానికి డబ్బులు లేవని చెప్పడం సిగ్గుచేటు
అమలు కానీ హామీలతో మైనార్టీలను మోసం చేసింది
ముస్లిం సమాజానికి సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి
జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్,
ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్
ముస్లింల సంక్షేమాన్ని (Welfare of muslims) వైసీపీ ప్రభుత్వం (YCP Government) గాలి కొదిలేసిందని జనసేన పార్టీ (Janasena Party) ఆరోపించింది. ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్ విమర్శించారు. దుల్హన్ పథకానికి (Dulhan Scheme) రూ.50 వేలు కాదు లక్ష ఇస్తామని చెప్పి.. ఇప్పుడు పూర్తిగా నిలిపి వేయడం ముస్లింలను (Muslims) దగా చేయడమే అని అన్నారు.
అమలుకాని హామీలు ఇచ్చి ముస్లిం సమాజాన్ని ముఖ్యమంత్రి (CM Jagan) మోసం చేసారు. దేనికి సీఎం వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అరాంఖాన్ డిమాండ్ చేశారు. దుల్హన్ పథకం అమలుకి నిధులు లేవని హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం (AP Government) చెప్పడంపై జనసేన (Janasena) మైనార్టీ నాయకులు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో స్పందించారు.
ఈ సందర్భంగా అర్హం ఖాన్ మాట్లాడుతూ “ముస్లిమ్ మైనారిటీల కష్టాలు దూరం చేసి, వారిని అన్ని విధాల ఆదుకుంటామని జగన్ రెడ్డి (Jagan Reddy) చెప్పారు. కానీ ఇవాళ ఈ బాధ్యతల నుంచి సీఎం తప్పించుకున్నారు. మేనిఫెస్టోలో (Manifesto) చేసిన వాగ్ధానాలు విస్మరించి ముస్లిం సమాజాన్ని సీఎం (CM) మోసం చేశారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అందజేస్తామన్న విద్యా పథకాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని” అర్హంఖాన్ విమర్శించారు.
నిలదీయకపోతే ద్రోహం చేసినట్లే: షేక్ రియాజ్
పార్టీ ప్రకాశం జిల్లా (Prakasam District) అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ “వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది. పాదయాత్ర సమయంలో (Jagan Padayatra) ముస్లింలకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా జగన్ రెడ్డి (Jagan Reddy) నెరవేర్చలేదు. పేద మైనార్టీ వివాహాలకు అందజేస్తున్న దుల్హన్ పథకాన్ని ఈ ప్రభుత్వం నిలిపి వేసింది. గత ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చింది… మేము అధికారంలోకి వస్తే రూ లక్ష ఇస్తామని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ముస్లిం నిరుద్యోగ యువత తమ కాళ్ల మీద తాము నిలబడటానికి రూ. 5 లక్షలు రుణం ఇస్తామన్నారు.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షల బీమా ఇస్తామన్నారు? ఈ మూడేళ్లలో ఏ ఒక్కరికైనా అందించారా? ఇమాంలకు, మౌల్వీలకు ఇళ్లు కట్టిస్తామని, రూ. 15 వేలు జీతం ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికైనా ఇళ్లు కట్టించారా? ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అతీగతీ లేదు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిందని హైకోర్టులో (High Court) ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి పిల్ వేసింది. కానీ మా దగ్గర డబ్బులు లేవు, అందుకే పథకాలను అమలు చేయడం లేదని కోర్టుకి చెప్పారు. ఇది యావత్తు ముస్లిం సమాజాన్ని మోసం చేయడమే. ఇది ప్రభుత్వానికి సిగ్గు చేటు. ఇప్పటికైనా వైసీపీలో ఉన్న మైనార్టీ నాయకులు (Minority Leaders) బయటకు వచ్చి ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రిని నిలదీయాలి. అలా నిలదీయని పక్షంలో ముస్లిం సమాజానికి ద్రోహం చేసిన వాళ్లవుతారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేసిన ఈ ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణలు (apology) చెప్పాల”ని షేక్ రియాజ్ డిమాండ్ చేశారు.