Draught AreaDraught Area

వ్యవసాయం అంటే ఏమిటి? రైతే రాజు అంటూనే – ఆ రైతుని కూలీని చేయడమేనా? చట్టాలు అన్నదాతా సుఖీభవ అంటున్నాయి. కానీ అన్నదాతలు మాత్రం పుట్టెడు దుఃఖంలో మగ్గుతున్నారు? ఇంతకీ వ్యవసాయం అంటే ఏమిటి?

అన్నదాతా సుఖీభవ?

వ్యవసాయం అంటే, జీను ప్యాంటు లేదా ఫారిన్ డిజైనర్ సారీ మడత పెట్టీ,  ఫోటోలు కోసం రెండు ఆకు కట్టలు వేసేది కాదు. లేక నాలుగు వరి నాట్లు నాటుతున్నట్లు ఫోటోలు తీసుకునేది కాదు. రైతు తన యావత్తు కష్టాలను బరిస్తూ వచ్చిన పంట ఫలాలను కన్నీటితో దళారులకు దార పోసేదే వ్యవసాయం.

వ్యవసాయం అంటే రైతే రాజు అనే ఎన్నికల స్లోగన్ కాదు. పంట వెయ్యక ముందు రైతే రాజు అంటారు. కానీ ఆ పంట చేతికి వచ్చిన తరువాత దళారుల గుమ్మాల ముందు బికారిగా తిరిగే వ్యక్తే నేటి రైతన్న.

రైతన్న అంటే రుణ మాఫీ అంటూ పాలకులు వేసే బిస్కెట్ల బిక్షము కోసం ఎదురు చూసే వాడు కాదు. తన బిడ్డలకు తినడానికి తిండి గింజలు లేకున్నా గాని, తన పంటలను దళారులకు దార పోస్తూ/ అమ్ముకుంటూ ప్రజలందరికీ అన్నదానం చేస్తున్న ఆ అన్నపూర్నేశ్వరి బిడ్డలే రైతన్నలు.

ఏరువాక అంటే అమాత్యులు నుండి, గల్లీ నాయకుడు వరకు ఫోటోలకు ఫోజులిచ్చి, వరి నాట్లు వేసేది కాదు. రైతుకు వేరే దిక్కు లేక, అన్నదాత తన పొట్ట నింపుకోవడానికి చేసేది నేటి వ్యవసాయం. రైతు తన రక్తాన్ని మండిస్తూ, పంట పండిస్తూ మనకి అన్నం అనే  బిక్ష పెడుతున్నాడు. కానీ మనం- మన ప్రభుత్వాలు అన్నదాతకు ఏమి చేస్తున్నాయి? అదే రైతులు అప్పుల ఊబిలోకి  దిగుతున్నారు. మట్టిని నమ్ముకొని చేస్తున్న ఆ వ్యవసాయమే వారి పాలిట శాపంగా మారుతున్నది. మట్టికొట్టుకు పోయేలా చేస్తున్నది.

రైతుకి సాయం అందక పోయినా గాని తన స్వేదాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నాడు. బక్క చిక్కిన ఆ రైతు చేస్తున్న ఆ వ్యవసాయంలో రైతుకి యాగాని కూడా మిగలడం లేదు.  రైతు అలసి సొలసి, తమ యావన్మంది సభ్యుల కన్నీటితో సేద్యం చేసి పాందించిన ఆ  పంటలను మూడు యాగానిలకు దళారులకు అమ్ముకొంటున్నాడు.  తానూ పండించిన పంటను అప్పులిచ్చిన వాడికి ధారా పోస్తున్నది. అదే రైతు  చివరకు ప్రభుత్వాలు ఇచ్చే కిలో రెండు రూపాయల బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. పట్టెడన్నం కోసం అలా ఎదురు చూసే  భూమాత అయాయకపు బిడ్డలే నేటి రైతన్నలు. మన అన్నదాతలు.

అన్నం పెట్టె అన్నదాత అర్ధాకలితో అలమటిస్తున్నాడా?

రైతే రాజు అనే ప్రతీ రాజకీయ నాయకుడు రారాజులు అవుతున్నారు. చివరకు వారి కష్టార్జితాన్ని కొనుక్కొనే దళారులు కూడా కోట్లకు పడగ లెత్తుతున్నారు. కానీ భూమిని నమ్ముకొన్న రైతన్నలు మాత్రం కూలీ నాలీ చేసికొని బ్రతికే బికారిగా మారి పోతున్నారు.

పాపం అనే వారు కూడా అన్నదాతల వెనుక లేరు. దీనికి కారణం ఈ  రైతన్నలకు ఐక్యత లేక పోవడమే అని నా బికారి రైతన్నలు తెలిసి కోలేరు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ వీధుల వెంట పడితే, రైతు పొలాన్ని చూసుకొనే వాడి ఏడి??? రైతు కూలీ సంఘము ఐక్యత వర్ధిల్లాలని అంటే రైతుల కుటుంబానికి పోషణ ఎలా జారుతుగుంది?

రైతు అప్పు తీర్చకపోతే తక్షణమే వాడి పరువుతో అందరూ “ఆడుకుంటారు”. అన్నదాత ఇంటిలో ఉన్న కంచాలు, మంచాలను వీధిలో వేస్తారు. అలా  వారి పరువుని నడి వీధిలో వేలం వేస్తారు. అదే పారిశ్రామిక వేత్త అప్పు తీర్చలేకపోతే ఉద్దీపన పథకాలతో ఆ వ్యాపార వేత్తని “ఆదుకుంటారు”?  మనం, మన ప్రభుత్వాలు రైతు కష్టాన్ని, అన్నదాతల ఆక్రందనలను వినలేక పోతున్నాం. రైతు వెన్నెముకపై వ్యాపారం చేసే పాలకులు ఉన్నంత వరకు అలానే, ఆ వ్యాపారవేత్తల కోసం పాటు పడే పాలకులు ఉన్నంత వరకు అన్నదాతలు తమ కన్నీటితో కరిగి “పైకి” పోవాలిసినదేనా?  “రైతే రాజు” అనేది ఎన్నికల స్లోగన్ గానే మిగిలి పోతోంది. రైతు మాత్రం రోజు రోజుకి కృంగి “పోతూనే” ఉంటాడు.

ధాన్యం బస్తా 30 వేలు ఉండాలి అంతే మేము బియ్యం ఎలా కొనుక్కోవాలి అని సమాజం  ఆందోళన పడుతున్నది. కానీ 30 వెల రూపాయిల ధాన్యం బస్తాని, రైతు కేవలం 1800 కి అమ్ముకొంటున్నాడు. దీని వల్ల అన్నదాత ఎంత నష్టపోతున్నాడు అని మాత్రం ఆలోచించం. అందరికీ అన్నం పెట్టె అన్నదాత అర్ధాకలితో అలమటిస్తున్నాడా అని మాత్రం ఆలోచించం? ఇదీ నీటి స్థితి. ఇదే అక్షర సత్యం.

నా వ్యాఖ్యానాలు తప్పు అయితే మన్నించండి. ఒప్పు అయితే “రైతే రాజు” అనేది ఎన్నికల స్లోగన్ కాదు అని ఎలుగెత్తి చాటండి. రైతు అన్నదాతనే గాని “అన్నీ అమ్ముకుంటూ వ్యవసాయం చేసే ఒక అమాయకుడు కాదు” అని గుర్తించండి.

ఆలోచించండి…. శ్రామిక సంఘాలు, పెట్టుబడి దారుల సంఘాలు, దళారుల సంఘాలు వస్తున్నాయి.  కానీ వీరి అందరికీ అన్నం పెడుతున్న రైతన్నకు మాత్రం సంఘాలు రావడం లేదు. అదే రైతు దౌర్భాగ్యం అనుకుంటా?

దేశంలో కార్యకర్తలకు అండగా ఉండే ఏకైకపార్టీ జనసేననే

అక్టోబర్ 15 నుండి సినిమా థియేటర్లకు అనుమతి