Venkatesh from DarsiVenkatesh from Darsi

వైసీపీ విధ్వంస గుర్తులను చెరిపేయాలంటే ఆ సమయం అవసరం
వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు
జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేసే అధికారులే
ముస్లింలు ప్రధాన నాయకత్వ బాధ్యతను తీసుకోవాలి
మైనార్టీలకు అన్యాయం జరిగితే పోరాడేందుకు ముందు ఉంటాను
అధికారంలోకి వస్తే ప్రకాశం జిల్లాకు వైభవం తీసుకొస్తాం
జనసేన పార్టీని బలంగా నమ్మి, ఆశీర్వదించండి
జనసేన పార్టీలో చేరికల సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ (Janasena Party) గెలుపే లక్ష్యంగా జనసేన నాయకులు (Janasena Leaders), కార్యకర్త్యలు అందరూ పనిచేయాలి. వైసీపీ విద్వంశ (YCP Government) గుర్తులు పోవాలంటే జనసేన – టీడీపీల పొత్తు (Janasena-TDP alliance) ఒక దశాబ్దం పాటు ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేసారు. ‘రాష్ట్ర విభజన గాయాలు… వైసీపీ విధ్వంసకర పాలన గుర్తులు పోవాలి. చెరిగిపోయి సుస్థిరమైన, సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ గా మళ్లీ కళకళలాడాలంటే జనసేన- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలి. ఈ సంకీర్ణ ప్రభుత్వం దశాబ్ద కాలంపాటు కొనసాగాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.

గురువారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నం నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్ డా. మహ్మద్ సాధిక్, ప్రకాశం జిల్లా దర్శి నుంచి గరికపాటి వెంకట్ లు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారిరువురికీ  పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఉన్నతి కోసం నిస్వార్థంగా కష్టపడాలని సూచించారు. 2024లో జనసేన- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. పదేళ్లపాటు అధికారంలో నిలిచి అద్భుతమైన ఆంధ్రాను తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

వైసీపీ గూండా నాయకులను బలంగా

ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “దశాబ్ద కాలంగా వైసీపీ గూండా నాయకులను బలంగా ఎదుర్కోగలుగుతున్నామంటే యువత, మహిళలే మన ప్రధాన బలం. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దిక్కు లేకుండా అయిపోయింది. రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు కుక్కలు చింపిన విస్తరి చేశారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు పునరుజ్జీవం తీసుకురావాలి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. రాబోతున్న జనసేన – తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారులు ప్రజల కష్టాలు తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి పని చేస్తారు.

సినిమా టికెట్ల కోసం తహశీల్దార్ నుంచి సీఎస్ వరకు పని చేసే రోజులు పోతాయి. ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా జనసేన పార్టీని బలంగా నమ్మండి. అందరికీ అవకాశం ఇచ్చారు. ప్రజల కోసం అధికారంలో లేకపోయినా పనిచేసిన జనసేన పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చి చూడండి. ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించి రాష్ట్రం బాధ్యతను నేను తీసుకుంటాను.

ముస్లింలు ప్రధాన నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి

మైనార్టీలుగా ముస్లింలను పిలవడం ఇప్పటికీ నాకు ఇష్టం ఉండదు. వారు సమాజంలో ప్రధాన భాగం కావాలి. అలాగే నాయకత్వ బాధ్యతలను తీసుకోవాలి. ముస్లింలు వారి సంప్రదాయాలు అంటే నాకు అమిత గౌరవం. బహిరంగ సభలు సాగతుండగా ఎప్పుడైనా అజాన్ వినిపిస్తే ప్రసంగం ఆపి వారి మత సంప్రదాయాన్ని గౌరవిస్తాను. మతం అంటే దేవుడిని ప్రార్థించే విధానం. సామరస్యంగా ముందుకు వెళ్లే సాధనం అని నమ్ముతాను. నేను అన్ని మతాలను, కులాలను పూర్తి స్థాయిలో గౌరవిస్తాను.

మానవత్వాన్ని నమ్మినవాడిని. ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. మీరు జనసేనను మనస్ఫూర్తిగా నమ్మండి. ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంకుగా చూడను. మీరు మెచ్చేటట్లు, మీకు నచ్చేటట్లు మాట్లాడి ఓట్ల కోసం రకరకాల మాటలు చెప్పేవాడిని కాదు. ఒక మాట ఇవ్వాలంటే చాలా ఆలోచించిన తరువాత ఇస్తాను. దాని కోసం చివరి వరకు నిలబడతాను. ముస్లిం ప్రాంతాల అభివృద్ధి, ముస్లిం కుటుంబాల ఉన్నతి కోసం అన్ని రకాలుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. మైనార్టీల రక్షణ, అభివృద్ధి అనేవి కీలకం. వాటికి పూర్తి ప్రాధాన్యత ఇస్తాం.

బీజేపీకి మద్దతు ఇచ్చానని భయపడొద్దు

చాలా మంది ముస్లింలు నన్ను పూర్తి స్థాయిలో నమ్మినప్పటికీ నేను బీజేపీతో కలిశాననే కారణంతో ముందుకు రావడానికి సంశయిస్తున్నారని తెలిసింది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర విభజన తరువాత బీజేపీకి మద్దతుగా నిలబడ్డాం. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉండే ఏదో ఒక జాతీయ పార్టీతో ఉండక తప్పదు. నేను బీజేపీతో ఉన్నా సరే ముస్లింలకు ఏ విషయంలో అన్యాయం జరిగినా నేను మీ పక్షం తీసుకుంటాను. మీ వైపు మాత్రమే పవన్ కళ్యాణ్ ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో మతాల పొరపొచ్చాలు లేవు. సామరస్యంగా అన్నదమ్ముల మాదిరిగానే కలసిమెలసి ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాలు, మన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్తాం.

ప్రకాశంలో నాయకులే లాభపడ్డారు

ఫ్లోరైడ్ నీళ్లు, యువత వలసలతో ప్రకాశం తన రూపు కోల్పోయింది. మరో వైపు మైనింగ్ మాఫియాతో ప్రకాశం జిల్లా పూర్తి స్థాయిలో కొందరి నాయకుల చేతిలో చిక్కుకుపోయింది. రూ.150 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు చేసే నాయకులు ఉమ్మడి ప్రకాశంలో ఉన్నారు. రూ. 10 వేల నెలవారీ వేతనం కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్లే యువతను జిల్లా నాయకులు ఆపలేకపోయారు. ప్రకాశం జిల్లాలో నాయకులు బాగుపడ్డారు తప్పితే అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు తీరలేదు. మహిళలు, యువత, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఫ్లోరైడ్ నీళ్లు, నిరుద్యోగం లేని ప్రకాశాన్ని చూడాలి అనేది నా కల. ఉద్దానం తరువాత ప్రమాదకరమైన ఫ్లోరైడ్ నీళ్లు తాగే దుస్థితి ప్రకాశం జిల్లాకు ఉంది. వచ్చే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాకు వైభవం తీసుకురావాలి. పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాను వైసీపీ విముక్త జిల్లాగా చేయాల్సిన బాధ్యత ఇరు పార్టీల నాయకత్వంపై ఉంది. దీని కోసం బలంగా పని చేయాలి” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

బాబూ! ముఖ్యమంత్రి ఎవరు: హరిరామ జోగయ్య ఘాటైన లేఖ