Janavani Vijayawada 2Janavani Vijayawada 2

సామాన్యుల ఆవేదనలు వింటూ.. ఆక్రందనలు ఆలకిస్తూ..
ఓపికగా అర్జీలు స్వీకరించిన జనసేన అధ్యక్షులు
అధికార పార్టీ దాష్టికాలపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
రెండవ విడత జనవాణిలో 539 అర్జీలు
మీడియా సమావేశం తర్వాత కూడా సమస్యల స్వీకరణ
9 గంటల పాటు సాగిన జనవాణి – జనసేన భరోసా

జోరు వానలోనూ సమస్యలతో క్యూ కట్టిన జనంతో 9 గంటలపాటు జనసేన జనవాణి (Janasena Janavani) కార్యక్రమం జరిగింది. నిన్నటి రెండవ విడత జనసేన జనవాణి కార్యక్రమంలో 539 అర్జీలు వచ్చినట్లు జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు.

జనవాణి –జనసేన భరోసా కార్యక్రమం రెండో విడత పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ చెంతకు వచ్చిన సమస్యల అర్జీల చిట్టా ఇది…

పాదయాత్రలో పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు.. మధ్యవర్తుల్ని తొలగిస్తామన్నారు.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడచింది. ఇచ్చిన హామీ ఊసేలేదు.. 23 వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విన్నపం..

దివ్యాంగులకు న్యాయం చేస్తారని వైసీపీకి ఓటు వేశాను.. నాతోపాటు మరో 300 మందితో ఓటు వేయించి తప్పు చేశాం.. ఈ ప్రభుత్వం దివ్యాంగుల్ని ఘోరంగా మోసం చేసింది.. ఓ దివ్యాంగుడి ఆవేదన..

20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నివాసం ఉంటున్నాం.. అధికార పార్టీ ఎంపీటీసీ మా ఇంటిని కబ్జా చేసి మమ్మల్ని బలవంతంగా ఇంటి నుంచి గెంటేశాడు.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వృద్దురాలి ఆక్రందన..

ఈ ప్రభుత్వం మోసం చేసింది.. టిడ్కో ఇళ్లు ఇవ్వడం లేదు.. తాగునీటి సమస్య.. సాగునీటి సమస్య.. అక్రమ మైనింగ్ సమస్య.. ఆక్రమణల సమస్య…

ప్రతి సామాన్యుడి సమస్యను సావధానంగా వింటూ.. వారి ఆక్రందనలను ఆలకిస్తూ.. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని భరోసా కల్పిస్తూ తొమ్మిది గంటల పాటు నిలువుకాళ్ల మీద జనవాణి – జనసేన భరోసా కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగించారు. వరుసగా రెండో వారం విజయవాడలోని, మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన జనవాణి కార్యక్రమానికి జోరు వానలోనూ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 539కి పైగా అర్జీలు నేరుగా  పవన్ కళ్యాణ్’కి (Pawan Kalyan) అందచేశారు అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

వైసీపీకి ఓటేసిన పాపం అనుభవిస్తున్నాం

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు నెల్లూరు, చిత్తూరు, విశాఖ తదితర జిల్లాల నుంచి కూడా సమస్యలు విన్నవించుకునేందుకు పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చారు. రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా (Outsourcing employees) సేవలు అందిస్తున్న తమను ఈ ప్రభుత్వం ఎలా మోసగించిందో వివరించేందుకు జనవాణి – జనసేన భరోసా (Janasena Barosa) కార్యక్రమానికి వచ్చారు. మధ్యవర్తుల మాయతో నష్టపోతున్న విషయాన్ని, సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదన్న విషయాలను  పవన్ కళ్యాణ్ గారి కి అర్జీ ద్వారా తెలియపరిచారు. తమకు అండగా ఉండాలని కోరారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన  కోకి రాజశేఖరరెడ్డి అనే దివ్యాంగుడికి రేషన్ తీసివేసిన విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తనలాంటి వారు ఎంతో మంది ఉన్న విషయాన్ని విరించిన అతను దివ్యాంగుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలతో కూడిన అర్జీని జనసేనాని అందచేశాడు.

కబ్జాలు.. రైతుల కడగండ్లపై విన్నపాలు

అనంతరం చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం, కరకంబాడి, తారకరామనగర్ కు చెందిన శ్రీమతి ఎస్.అనిత అనే మహిళ స్థానిక వైసీపీ ఎంపీటీసీ తమ ఇంటిని కబ్జా చేసి ఇంటి నుంచి వృద్దురాలైన తల్లిని తరిమివేసిన విషయాన్ని జనవాణి కార్యక్రమంలో చెప్పుకున్నారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలకు సంబంధించిన వినతులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. కరోనా కష్టకాలంలో ఫీజు రీఎంబర్స్ మెంటు నిలిపివేయడం వల్ల పడుతున్న విషయాన్ని పలువురు విద్యార్ధులు చెప్పుకున్నారు. వైసీపీ నేతల అండతో ప్రకాశం జిల్లాలో శనగ రైతుల్ని కోట్లాది రూపాయిలు ముంచిన వ్యాపారి నుంచి తమకు రావాల్సిన మొత్తం ఇప్పించి న్యాయం చేయాలంటూ మహిళా కౌలు రైతులు కన్నీటితో పవన్ కళ్యాణ్’కి విన్నవించుకున్నారు.

పెన్షన్ అడిగితే నాటకాలాడుతున్నారంటున్నారు

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెన్షన్లు (Pensions) రాక ఇబ్బందిపడుతున్న దివ్యాంగులు, వృద్దులు పెద్ద సంఖ్యలో జనవాణి కేంద్రానికి తరలివచ్చారు. దివ్యాంగులను నాటకాలు ఆడుతున్నారని సచివాలయం సిబ్బంది అవహేళన చేస్తున్న పరిస్థితులను, బెదిరింపులకు దిగుతున్న పరిస్థితులను పవన్ కళ్యాణ్’కి చెప్పుకున్నారు.

రాజధాని ప్రాంత కౌలు రైతులు (Rajadhani Farmers), పంటల బీమా అందడం లేదని పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. స్మశానాలు (Burial gournds) లేక పడుతున్న ఇబ్బందులు, స్మశానాల కబ్జాలతో పడుతున్న ఇబ్బందులు తాగునీటి సమస్యలు, సాగునీటి సమస్యలు, గ్రామాల్లో దయనీయ స్థితిలో ఉన్న రహదారుల సమస్యలు, మాదిగల లిడ్ క్యాప్ సమస్యలు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఇసుక దోపిడి, పారిశ్రామిక కాలుష్యంతో (Industrial Pollution) పాడుతున్న ఇబ్బందులు, టిడ్కో గృహాలుకు సంబంధించిన సమస్యలు ప్రధానమైనవి వచ్చిన అర్జీలలో ఉన్నాయి.

ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. బుడగ బేడ జంగాలు తెలంగాణలో అధికంగా ఉండే కులానికి ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు రద్దు చేసిన విషయాన్ని ఆ వర్గం ప్రజలు జనసేనాని పవన్కళ్యాణ్లీ౪’కి చెప్పుకున్నారు. భూ నిర్వాసితులు పరిహారం అందడం లేదంటూ అన్ని జిల్లాల నుంచి బాధితులు జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి తరలివచ్చి ఫిర్యాదు చేశారు. గర్భిణులు కూడా తమ సమస్యలను జనసేన అధ్యక్షులకు విన్నవించుకొన్నారు.

బాధితులకు జనసేనాని భరోసా

చేనేత కార్మికుల సమస్యలు, పవర్ లూమ్స్ వాడకం తర్వాత కరెంటు బిల్లు నెపంతో ప్రభుత్వ పథకాలు (Government Schemes) ఎత్తివేస్తున్న అంశాలను పవన్ కళ్యాణ్ ‘కి వివరించారు. ఆక్వా రైతులు (Aqua farmers) విద్యుత్ సబ్సిడీ (electricity subsidy) ఎగవేతల మీద అర్జీలు వచ్చాయి. కొన్ని వ్యక్తిగత సహాయాలు కోరుతూ కూడా వినతులు వచ్చాయి. ప్రతి సమస్యను సావధానంగా విన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

జనవాణి కార్యక్రమానికి వచ్చిన ప్రతి సమస్యపైనా తక్షణ స్పందన

జనవాణి కార్యక్రమానికి వచ్చిన ప్రతి సమస్యపైనా తక్షణ స్పందన కోసం సంబంధిత శాఖలకు పార్టీ తరఫున వినతిపత్రాలు సమర్పిస్తామని జనసేనాని హామీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమాన్ని ముగించాల్సి ఉండగా సమస్యలతో వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో వేచి ఉండడంతో మీడియా సమావేశం (Press meet) తర్వాత కూడా కార్యక్రమాన్ని కొనసాగించారు.

మరో నాలుగు గంటల పాటు అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు  చిలకం మధుసూదన్ రెడ్డి,  పెదపూడి విజయ్ కుమార్,  బోనబోయిన శ్రీనివాస యాదవ్, విజయవాడ నగర అధ్యక్షులు  పోతిన వెంకట మహేష్, గుంటూరు జిల్లా అధ్యక్షులు  గాదె వెంకటేశ్వరరావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం ఛైర్మన్  కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్  ఇవన సాంబశివ ప్రతాప్, మాజీ ఐఏఎస్ అధికారి, పార్టీ నేత  డి. వరప్రసాద్, చేనేత వికాస విభాగం ఛైర్మన్  చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు  అమ్మిశెట్టి వాసు,  బేతపూడి విజయశేఖర్, కప్పెర కొటేశ్వరరావు,  సుంకర సాయిబాబు, శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి పోతిరెడ్డి అనిత,  బండారు రవికాంత్,  అక్కల గాంధీ తదితరులు పాల్గొన్నారు.

విజయమ్మ రాజీనామా