AP High CourtAP High Court

సినిమా టికెట్‌ రేట్లు (Cinema Ticket Rates) విషయంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో (AP High Court) ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నెం.35ను ఉన్నత న్యాయస్థానం (High Court) రద్దు చేసింది. పాత విధానంలోనే సినెమా టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు అవకాశం కల్పించింది. టికెట్‌ రేట్లను ఏపీ ప్రభుత్వం  (AP Government) తగ్గిస్తూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ థియేటర్‌ యజమానులు (Theaters owners) హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్‌ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఈ విషయంపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. టికెట్‌ రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి థియేటర్‌ యజమానులు తీసుకొచ్చారు. పిటిషనర్‌ తరపు న్యాయవాదులు చేసిన వాదనలతో రాష్ట్ర హైకోర్టు ఏకీభవించింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను సస్పెండ్‌ చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో చూడాలి.

విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వైసీపీదే
వైసీపీపై విరుచుకుపడ్డ జనసేనాని

Spread the love