నాన్నారు! నాన్నారు! మనం నెలలు తరబడి
ప్రణాళికాబద్ధంగా పవనేశ్వరుడి పేరు లేకుండా, ఫోటో లేకుండా
చివరకు మనకి వూతం ఇచ్చిన భోళాశంకరుడికి జై కొట్టేవారే
సభలో లేకుండా ఉండేటట్లు పాచికలు వేసి,
అమ్మానావతి అంటే మనం మనం- మనం అంటే అమ్మనావతి
అన్నట్లు ఏర్పాట్లు చేస్తే
ఇదేమిటి నాన్నారు! ఒక చిన్న చాక్లెట్ తో మొత్తం సీన్ అంతా మారిపోయింది.
అదేమిటి నాన్నారు! ఆ శంకరులను ఇద్దరిని కలవకుండా ఉండడం కోసం మనం వాళ్ళను దూరంగా కూర్చోపెడితే, మళ్ళీ వాళ్ళు ఎలా కలిసారు?
అంతా పవనేశ్వరుడు, ఆ పావనేశ్వరుడుకి చాక్లెట్ ఇచ్చిన
అనికేత్ గురించే మాట్లాడుకొంటున్నారు? నా గొడవ మరిచిపోయినట్లు
చేసింది ఆ చిన్న చాక్లెట్. మనం ఆ చాక్లెట్ ను కూడా అణచివేయ లేమా నాన్నారు?
ఇంతకీ తప్పు ఎక్కడ జరిగింది నాన్నారు? ఎంతకష్టపడ్డా నాకు క్రెడిట్ ఎందుకు రావడం లేదు నాన్నారు?
ఓ తండ్రి సమాధానం…
అరే కన్నా! నువ్వు నేను అధికారంలో ఉండడానికి,
మన పార్టీ నేటికీ ఇంకా బతికి ఉండడానికి కారణం ఆ పవనేశ్వరుడు, ఆ అనికేత్ నే రా నాయనా.
మన అమ్మనావతికి నేటి నిధుల వరదకు కారణం ఆ పవనేశ్వరుడే అనేది మరవకు. ఆ భోళాశంకరుడు మనతో లేకపోతే మరల మనకి ముంతెడు బూడిద, చెంబుడు నీళ్లు మాత్రమే దక్కేవి రా నాన్నా
ప్రతీ విషయానికి నువ్వు గాబరా పడకు. నన్ను కష్టాల్లో తొయ్యకు.
అయినా ఆ భోళాశంకరుడికి చాక్లెట్ మనకి మాత్రం అమ్మనావతి. అర్ధం అయ్యిందా నాన్నా. నువ్వు శాంతంగా ఉండూ.
సమకాలీన రాజకీయాలపై ఊహించి రాసిందే తప్ప ఎవ్వరినీ ఉద్దేశించి కాదు అని గమనించండి. ఆలోచించండి (Its from Akshara Satyam)