AP High CourtAP High Court

హైకోర్టులో AP ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు

చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలకు పార్టీ రంగులు (Party Colors) తొలగిస్తున్నట్లు ఏపీ (AP) తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh) హైకోర్టుకు (High Court) దాఖలు చేసిన ప్రమాణపత్రంలో (Affidavit) తెలియ జేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికీ పార్టీ రంగులు వేయబోమంటూ కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పంచాయతీరాజ్‌ (Panchayat raj) ముఖ్య కార్యదర్శి (Secretary) జి.కె.ద్వివేది ఈ మేరకు ప్రమాణపత్రం దాఖలు చేశారు. పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. నేడు ప్రభుత్వం ప్రమాణ పత్రం ఈ మేరకు దాఖలు చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్‌ జస్టిస్‌ సంస్థ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు హైకోర్టులో పిల్‌ వేశారు.

Spread the love