Chiru with GarikapatiChiru with Garikapati

సరస్వతీ పుత్రులమి అనే గర్వం గరికను కూడా గడ్డిని చేసింది?
మెగా అభిమానులకు చిరు సందేశం

అర అక్షరం తెలుసున్న అక్షర సత్యం (Akshara Satyam) లాంటోళ్ళనే ఆహ్వానించి
చేతులేత్తి నమస్కరించి ఆదరించి సాదరంగా గౌరవించి పంపడం తెలిసున్నవాడు మన కొణెదల శివ శంకర ప్రసాద్ (Konidela Siva Shankar Prasad) ఉరఫ్ ధర్మరాజు (Dharma Raju). సామాన్యులనుండి సరస్వతీ పుత్రులు వరకు గౌరవించడం మాత్రమే తెలిసున్నవాడు ఈ అంజనీ పుత్రుడు (Anjani Putrudu).

మైక్’లో అవమాన పరచినాగాని మనస్సులో ఏమీ పెట్టుకోకుండా నమస్కరించి చిరునవ్వుతో పక్కనే కూర్చొన్న సామాన్యుడు. అందుకే అసామాన్యుడు అయ్యాడు ఈ కొణెదల శివ శంకర ప్రసాద్. ఉందుకే అయన చిరంజీవి (Chiranjeevi).

గరికపాటి (Garikapari) లాంటి ఘనాపాటి, బహు శతావధాని, నిజమైన సరస్వతి పుత్రులకు (Saraswathi Putrudu) అయితే పాదాభివందనం చేసే ఉదాత్తుడు ఈ చిరు. అందుకే అయన అజాత శత్రువు. ఎప్పటికీ అయన అజాత శత్రువే. (చిరుకి శత్రువులు లేకపోవచ్చు. కానీ అవినీతిపరులు, గర్విష్ఠులు అందరూ  ఆయన్ని శత్రువుగానే భావిస్తారు).

అహంకారులపై నిత్య విజేత ఈ కలియుగ ధర్మరాజు. అందుకే మన చిరు జీవి ఆలయశిఖరాన్ని స్వయంకృషితో (Swayamkrushi) అధిరోహించారు. ఆ శిఖరంపై ఉండి నేటికీ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మేమూ ఆలయ శిఖరాన్ని అధిరోహించామోయ్ అనే అహంకారంతో ఉన్న వారు గడ్డి పరకాలా అలయ్ బలయ్’లో అహంకారంతో విర్రవీగుతున్నారు. తాము అధిరోహించిన శిఖరం నుండి జారిపోతున్నారు.

స్వయంకృషితో పునాదిరాళ్లను వేసుకొంటూ,
ప్రాణం ఖరీదు తెలిసికొని సామాన్యుని
ఆ ప్రాణం కాపాడడానికి చిరంజీవి రక్త నిధి,
చిరంజీవి ఆక్సీజన్ బ్యాంకు, చిరంజీవి కంటి బ్యాంకు
లాంటి సేవ కార్యక్రమాలతో ఆలయ శిఖరాన్ని అధిరోహించినవాడు
మన ఆపత్భాంధవుడు. గాడ్ ఫాదర్, నిత్య విజేత, కలియుగ కర్ణుడు. అతడే మన చిరంజీవి.

టాగోర్ (Tagore) లాంటి నిత్య కృషీవలుడు చిరు అంటే నిత్యం ప్రజలపై బ్రతికే అవినీతి పుత్రులకు, అశుద్ధాన్ని ప్రచారం చేసి బ్రతికే కిరసనాయిలు కిట్టు గాళ్ళకి, వెన్నుపోటు బాబులకు మాత్రమే అసూయ, ద్వేషం ఉంటాయి అనుకొన్నాం.

కానీ కానీ కానీ

సరస్వతి మాత పుత్రులకు కూడా అజాతశత్రువు అంటే ఇంత అసూయ, అహంకారమా అనే కథనాలను విని భరించలేక పోతున్నాం. అలానే గరికపాటికి వ్యతిరేకంగా ప్రతిస్పందించి ప్రతి విమర్శ చేయలేక పోతున్నాం. ఎందుకంటే అయన మాకు గురుతుల్యులు. మన సరస్వతి మాత ప్రియ పుత్రులు. ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం. రెచ్చగొట్టే మీడియాని పట్టించు కోవడం మానేద్దాం.

గరికపాటి నేడు గడ్డి పూచలా మాట్లాడి ఉండవచ్చు. కానీ అయన నిన్నటి వరకు గరికనే. గణేశుని సన్నిధిలో నిత్యం ఉండే ఘనాపాటి మన ఈ గరికపాటి. అయన కోపాన్ని సహనంతో గౌరవిద్దాం. అప్పుడే ఆయనలో మార్పు సాధ్యమవుతుంది.

పూజ్య గురుదేవులు మాట్లాడిన మాటల్లో తప్పులు అన్నాయో లేదో తెలిసికొని స్పందించే అవకాశం ఆయనకే వదిలేద్దాం. మెగా అభిమానులుగా మీరు ప్రతిస్పంచి మన అజాత శత్రువు అన్నయ్య మనస్సుని నొప్పించవద్దు.

ఇది ఒక అభిమాని ఆవేదనే కావచ్చు. కానీ సహనానికి ఇదే హేతువు.

ఆలోచించండి… సహనం చిరు జీవిని కూడా చిరంజీవిని చేస్తుంది. అహంకారం గరికను కూడా గడ్డి పరకగా మర్చి మాడి మసి చేస్తుంది అనే “అక్షర సత్యాన్ని” ఆ సరస్వతి పుత్రులు గరికపాటి గారికి చెప్పే అంతటి పెద్దవాడిని కాదు. (It’s from Akshara Satyam)

గాడ్ ఫాదర్ నట విశ్వరూపానికి ప్రేక్షకలోకం ఫిదా: పబ్లిక్ టాక్