జంగారెడ్డిగూడెం: అనన్య చిత్రం (Ananya Movie) విజయవం కావాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ (Kotagiri Sridhar), ఎమ్మెల్యే ఎలీజా (MLA Eleja) ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం లో శనివారం జరుగుతున్న అనన్య చిత్రం షూటింగ్ లో ఎంపీ శ్రీధర్, ఎలీజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి స్వామి ఆలయం వద్ద హీరోయిన్ చందన, విలన్ రాజేష్’లపై చిత్రీకరించిన సన్నీ వేశానికి ఎంపీ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత బుద్దాల సత్య నారాయణ, డైరెక్టర్ బి. ప్రసాద్ రాజు సినిమా విశేషాలు ఎంపీ ఎమ్మెల్యేలకు తెలిపారు. చిత్రం విజయవంతం కావాలని, మరిన్ని సినిమాలు మన ప్రాంతంలో నిర్మాణం చేయాలని ఎంపీ, ఎమ్మెల్యేలు అన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాల్జి, సర్పంచ్లు గుబ్బల సత్యవేణి, యరమాల సత్యవతి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, వైఎస్సార్సీపీ నాయకులు మండవల్లి సోంబాబు మాజీ ఎంపీటీసీసభ్యులు సత్రం లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ నాయకులు మోటేపల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు