Konasema fireKonasema fire

పచ్చటి కోనసీమ (Konaseema) కులాల కార్చిచ్చుతో భగ్గుమంటున్నది. కోనసీమ జిల్లాకు (Konaseema District) అంబెడ్కర్ (Ambedkar) పేరు పెట్టడంపై కోనసీమ జిల్లా యావత్తు భగ్గుమంటున్నది. దీనికి ప్రతిపక్షాలు (Opposition Parties) కారణం అని అధికార పక్షం (Ruling Party) అంటుంటాగా, రాష్ట్ర ప్రభుత్వమే (State Government) చిచ్చు పెట్టింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలు కూడా ప్రభత్వ చేతకాని తనం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

జిల్లా పేరుపై అన్ని ఆందోళనలూ సద్దుమణిగి ప్రశాంతత నెలకొన్న వేళ.. ఊహించని రీతిలో తీసుకున్న నిర్ణయం గొడవలకు ఆజ్యం పోసింది ఎవరో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. కోనసీమలో మంగళవారం జరిగిన ముట్టడి రణరంగం కావడానికి సర్కారే కారణమన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

జిల్లాల విభజన సమయంలోనే కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని పార్టీలకు అతీతంగా ఆందోళనలు జరిగాయి. దళిత సంఘాలు (Dalit Sanghalu) కూడా ఉద్యమం చేపట్టాయి. కానీ ఆంధ్ర ప్రభుత్వం పట్టించు కోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆందోళనలు సద్దుమణిగాయి అని అందరూ భావించారు.

కానీ ఊహించని విధంగా ఈ నెల 18న ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా పేరును అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చింది. కోనసీమ జిల్లాగా మాత్రమే పేరు కొనసాగించాలంటూ ఉద్యమానికి సిద్ధమైంది. ఇదే సమయంలో అయినవిల్లి మండలం శానపల్లి లంకగ్రామంలో స్థానిక ప్రజలు, కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేయడం కలకలం రేపింది. 20వ తేదీన కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ జేఏసీ నేతలు అమలాపురం కలెక్టరేట్‌ (Amalapuram Collectarate) ముట్టడికి పిలుపునిచ్చారు.

అమలాపురం యువకుడు అన్యం సాయి అనే యువకుడు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి సాయి వైసీపీ క్రియాశీల కార్యకర్త. మంత్రి విశ్వరూ్‌పకు అనుచరుడు కూడా. ఆయనకు మంత్రి పదవి వచ్చినప్పుడు అభినందనలు తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు అనే ఆరోపణలు ఉన్నాయి.

దీని వెనుక ఎవరు ఉన్నారు? బాధ్యులు ఎవరు? వివిధ వ్యక్తులు, పార్టీల మీద వస్తున్న ఆరోపణలు నిజమేనా అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే ప్రభుత్వం సీబీఐతో విచారణ చూపిస్తే నిజా నిజాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది అని ప్రజలు కోరుకొంటున్నారు.

జనసేన పార్టీ బలం -బలహీనతలు
సూటిగా సుత్తి లేకుండా