ఏపీ ప్రభుత్వానికి (AP Government) ఎన్‌హెచ్ఆర్‌సీ (NHRC) సమన్లు (summons) జారీచేసింది. జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు (DGP) కమీషన్ సమన్లు జారీ చేసింది. ఎంపీ రఘు రామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju) అరెస్టుపై నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి గతంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ప్రభుత్వం స్పందించక పోవడంతో కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎందుకు నివేదిక పంపించడంలో జాప్యం జరుగుతుందని ప్రశ్నించింది. నేడు కండిషనల్ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తున్నది. నివేదికను ఆగస్టు 9లోపు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఒక వేళా గడువులోగా నివేదిక ఇవ్వకపోతే, వ్యక్తిగతంగా ఆగస్టు 16న హాజరు కావాల్సి వస్తుందని హెచ్చరించింది.