Mumbai CycloneMumbai Cyclone

ముమ్మరంగా సహాయక చర్యలు

తుఫాన్ భీభత్సం ముంబైని (Mumbai) వణికిస్తున్నది. భారతదేశ (India) పశ్చిమ తీరంలో తౌక్టే తుపాను (Cyclone) బీభత్సం సృష్టిస్తోంది. భయంకరంగా మారిన ఈ తుపాను ప్రస్తుతం గుజరాత్‌ (Gujarat) వైపు వేగంగా పయనిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ముంబయిలో సముద్రం (Sea) అల్లకల్లోలంగా మారింది. తుపాను ధాటికి బాంబే హై ప్రాంతంలో తీరానికి నిలిపి ఉన్న రెండు బార్జ్‌ల యాంకర్‌లు తొలగిపోయినట్లు సమాచారం. దీని వల్ల అవి అలల ధాటికి కొట్టుకుపోతున్నాయి. వీటిల్లో 410 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తున్నది. అప్రమత్తమైన నేవీ సిబ్బంది వారిని రక్షించడం కోసం తక్షణ సహాయకచర్యలు చేపట్టారు.

దీని ప్రభావంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు ముంబయి నగరాన్ని వణికిస్తున్నాయి. సముద్ర అలలు పెద్ద ఎత్తున దూసుకొస్తున్నాయి.

ధర్మ సందేహాలు

ధర్మ సందేహాలు