Tadisina dhanyamTadisina dhanyam

తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి…
కౌలు రైతులను ఆదుకోవాలి…
జనసేన పి.ఏ.సి.ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రైతులు (Rythus) రోడ్ల మీద ధాన్యం (Paddy) ఆరబోస్తే రూ.5 లక్షలు జరిమానా (Fine) విధిస్తామని ఈ ప్రభుత్వం (Government) బెదిరించడం దురదృష్టకరం అని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆవేదన వ్యక్తం చేసారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూన్నది. అన్నంపెట్టే రైతులను వేధింపులకు గురి చేస్తున్నారు అని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ (Political affairs Committee) ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు.

రైతుల నుంచి తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలనీ, కౌలు రైతులకు పరిహారం (Compensation) ఇచ్చి ఆదుకోవాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాల మీద జనసేన పార్టీ (Janasena Party) రైతుల పక్షాన మాట్లాడుతుందని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడూ రైతులకు అండగా నిలబడతారని తెలిపారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ రైతుల (Farmers) పక్షాన పోరాడుతున్న విషయాన్ని అయన గుర్తు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా (East Godavari District), మండపేట నియోజకవర్గం (Mandapeta Constituency) ఇప్పనపాడు గ్రామంలో కళ్లాల వద్ద రైతులతో నాదెండ్ల మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని (Wet Paddy) పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను నాదెండ్లకు వివరించారు. పంటలకు 100 శాతం నష్టం జరిగిందని… ధాన్యం కొనమని అడిగితే రైతు భరోసా (Rythu barosa) కేంద్రాలకు తీసుకురమ్మంటున్నారనీ… వాటికీ ఎన్నో రూల్స్ చెబుతున్నారు అన్నారు.

ఒక్కో రైతు దగ్గర కేవలం 25 క్వింటాళ్లు మించి కొనుగోలు చేసేది లేదు అని ప్రభుత్వం ప్రకటించడం తమకు ఇబ్బందిగా మారిందని రైతులు తెలిపారు. పంటలు కొనేవారు లేకపోవడంతో తదుపరి పంటకు పెట్టుబడి ఎలా వస్తుందని వాపోయారు. ఎకరాకి రూ. 30 వేలు ఖర్చు చేస్తే, ఇప్పుడు 10 బస్తాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. చేతికి వచ్చిన పంట పోయిందనీ, కూలీ కూడా గిట్టడం లేదనీ రైతులు తెలిపారు. మొత్తం మొలకలు వచ్చేశాయని చెప్పారు.

పరిహారం ఎంత ఇస్తారో తెలియదు

తమ గ్రామంలో 400 ఎకరాల వరి పండించే పొలం ఉంది. అధికారులు వచ్చి సర్వే చేసి వెళ్లారు. పరిహారం ఎంత ఇస్తారో తెలియదు అని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క పంటా సరిగా రాలేదని చెప్పారు. క్రాఫ్ ఇన్సురెన్స్ (Crop Insurance) రావడం లేదా అని నాదెండ్ల మనోహర్ రైతులను అడిగారు. గత ఏడాది నష్టపోయిన పంటలకు కూడా ఇప్పటికీ పరిహారం అందలేదని రైతులు చెప్పారు. జనసేన పార్టీ రైతులకు అండగా నిలబడి న్యాయం జరిగేలా చూడాలని రైతులు నాదెండ్లను కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  కందుల దుర్గేష్ (Kandula Durgesh), మండపేట ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ (Vegulla Leela Krishna), పీఏసీ సభ్యులు (PAC member) ముత్తా శశిధర్ (Mutha Shasidhar), పితాని బాలకృష్ణ (Pithani Bala Krishna), పంతం నానాజీ (Pantham Nanaji) లతోపాటు నియోజకవర్గాల ఇంచార్జులు, పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు అంటూ జనసేన పార్టీ విడుదల చేసిన ఒక లేఖలో తెలిపారు.

రైతాంగం ప్రయోజనాలకి విరుద్ధంగా వైసీపీ భారీ కుట్ర?