తిరుమల (Tirumala) కొండపైకి భజన బృందాలను ఎందుకు అనుమతించడం లేదని భజన కళాకారులు (Bhajana Kalakarulu) ఆవేదన వ్యక్తం చేసారు. తిరుమల కొండపై హరినామ సంకీర్తన భజన బృందాలను అనుమతించడం లేదు. టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి తీసికొంటున్న ఇటువంటి వైఖరి వల్ల వేలాది మంది భజన కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని జానపద వృత్తి కళాకారుల సంఘం ప్రతినిధులు నాదెండ్ల మనోహర్ వద్ద వాపోయారు.
శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ ఛైర్మన్ (PAC Chairmen) నాదెండ్ల మనోహర్’ని (Nadendla Manohar) కలిసి తమ బాధలను చెప్పుకొన్నారు. ఈ మేరకు ఒక వినతి పత్రం అందించారు. నలభై ఏళ్లుగా ఉన్న సంప్రదాయాన్ని టీటీడీ కాలరాయాలని చూస్తోందని ఆరోపించారు. తిరుమల కొండపై ఏడాదికి 4320 భజన బృందాలు హరినామ సంకీర్తనలో ఉండేవి. ఇప్పుడు కొండపైన ఆ సంప్రదాయాన్ని ఆపేశారు అని భజన కళాకారులు తెలిపారు. ఈ సమస్యను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దృష్టికి తీసుకువెళ్లాలని భజన కళాకారులు నాదెండ్లను మనోహర్’ని కోరారు.