Guljarilal NandaGuljarilal Nanda

భారత మాజీ ప్రధాని జీవిత గాధ

ఇంటి అద్దె కట్టలేక నడిరోడ్డుపై సామాన్లతో విసిరి వేయబడ్డ ఆ వ్యక్తి మన దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా (Prime Minister) చేసిన మహనీయుడు అంటే మీరు నమ్మగలరా?

ఎవరికైనా ఒక పదవి అనుకోకుండా వస్తే ఆ పదవిని ఎలా స్థిరపరచుకోవాలా అని ప్రజా ప్రతినిధులు ఆలోచించే కాలం ఇది. అటువంటి కాలంలో రెండుసార్లు ఆపద్దర్మ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ పెద్దలు ఎవరిని ఆ స్థానంలో కూర్చోపెట్టాలనుకుంటే వారికి ప్రధాని బాధ్యతలు అప్పగించి… తనకు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలుచేసిన ఏకైక వ్యక్తి మన గుల్జారీలాల్ నందా (Gulzarilal Nanda).

శ్రీ గుల్జారీలాల్ నందా ఎవరు?

చైనా దాడి తర్వాత భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) ఆరోగ్యం క్షీణించి మరణించినప్పుడు తాత్కాలిక ప్రధానిగా గుల్జారీలాల్ నందా పనిచేశారు. తిరిగి పాకిస్తాన్తో యుద్ధం ముగిసి, శాంతి ఒప్పందం మీద సంతకం చేసిన మరుసటి రోజే అనూహ్య పరిస్థితిలో లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు. అప్పుడు తిరిగి ఆపద్ధర్మ ప్రధానిగా నందా 14 రోజులు ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేశారు.

అంతేకాక కేంద్రంలో కీలక శాఖలయిన విదేశాంగ, అంతర్గత వ్యవహారాలను నిర్వ హించిన గుల్జారీలాల్ నందాకి చివరికి సొంత ఇల్లుగాని, కారు గాని లేదు. ఒకసారి మంత్రి వర్గంలో నుండి నందా తప్పుకున్న తరువాత తిరిగి రాజకీయాల జోలికి వెళ్ళలేదు.

తాను నమ్మిన గాంధీ (Gandhi) సిద్ధాంతాలకు అనుగుణంగా తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకత్వం అందించారు.

సామాన్య జీవితాన్ని కొనసాగించిన నందా!

అత్యంత సామాన్య జీవితం కొనసాగించిన అతికొద్దిమందిలో గుల్జారీలాల్ నందా ఒకరు.

నేడు పాకిస్తాన్లో ఉన్న సియల్ కోటలో జూలై 4, 1898లో ఒక పంజాబీ కుటుంబంలో గుల్జార్ లాల్ నందా జన్మించారు.

లాక్, అమృత్సర్, ఆగ్రా, అలాబాద్లలో చదువుకుని 1921 నాటికే బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయ్యారు.

ఆయనకిష్టమైన అంశం కార్మికులు, వారి ఆర్థిక సంక్షేమం

గాంధీజీ ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం (Non Cooperation Movement) పిలుపునందుకుని ఉద్యోగం వదిలి కార్మిక రంగంలో నాయకుడిగా ఎదిగారు.

కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చురుకైన నాయకుడిగా గుల్జారీలాల్ నందా పనిచేశారు. 1937లో బొంబాయి (Mumbai) ప్రభుత్వంలో కార్మికమంత్రిగా (Labor minister) పనిచేసి కార్మికులకు మేలుచేసే లేబర్ డిస్ప్యూట్ బిల్ తీసుకువచ్చారు.

కాంగ్రెస్ పార్టీ కార్మికసంఘం ఐ.ఎన్.టి.యు.సి.కి ఆయన అధ్యక్షుడుగా వ్యవహరించారు.

స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా పని చేశారు.
ఆ తర్వాత ప్రణాళికా శాఖ మంత్రిగా పనిచేశారు.

కేంద్రంలో విద్యుత్ నీటిపారుదల హోంశాఖలతోపాటు కీలకమైన విదేశాంగ శాఖను నిర్వహించిన చరిత్ర ఆయనది.

జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాల్లో పనిచేసిన ఘనత గుల్జారీలాల్ నందా సొంతం.

1952 నుండి 1962 ఎన్నికల వరకు ఆయన బొంబాయి, గుజరాత్’లోని సబర్ కాంత నియోజకవర్గాల నుండి ప్రాతినిథ్యం వహించారు.

1967 తర్వాత రాజకీయాలకు దూరంగా జరిగిన నందా!

ఆయనకు ముగ్గురు కొడుకులు, రాజకీయాలకు దూరంగా వారిని పెంచారు.

పిల్లలకు భారం అవటంకాని, వారిమీద ఆర్థికంగా ఆధారపడటం కాని గుల్జారీలాల్ నందాకి ఇష్టంలేదు. అలాగని ఆయనకంటూ మరో ఆదాయం లేదు.

పార్లమెంట్ సభ్యులకు, మంత్రులకు పెన్షన్లు ఇవ్వటం ఇటీవలి కాలంలో మొదలైంది.
అంతకుముందు ప్రజాప్రతినిధులు ప్రజాసేసకులుగా త్యాగాలు చేస్తూ జీవించేవారు.

అందుకే గుల్జారీలాల్ అపార్ట్మెంట్ భార్యతో సహా ఏకాకిగా మిగిలిపోయారు.

అప్పుచేయట మనేది నందా వ్యక్తిగత సిద్ధాంతాలకు వ్యతిరేకం.

ఇంటి అద్దె చెల్లించేందుకు డబ్బులుండేవికావు. దినవారీ ఖర్చులకు చేతిలో రూపాయి ఉండేది కాదు.

స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చే పింఛను?

అటువంటి సమయంలో గుల్జారీలాల్ నందా మిత్రుడు ఒకరు స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చే పింఛను విషయం తెలుసుకుని ఆ విషయం నందాకి చెప్పాడు. కాని పింఛను ఆశించి పోరాటంలో పాల్గొనలేదని నందా తిరస్కరించారు.

అయితే ఆయన మిత్రులు చాలామంది కలిసి నందాచేత బలవంతంగా సంతకం పెట్టించి ఆ పింఛను దరఖాస్తును ప్రభుత్వానికి సమర్పించారు.

ఇదంతా పూర్తయ్యేసరికి ఆయనకు దాదాపుగా 85 ఏళ్ళు వచ్చాయి. కాలంతోపాటే గుల్జారీలాల్ని రాజకీయ నాయకులు మరచిపోయారు. దేశానికీ అయన సేవలు కూడా మరిచిపోయారు.

కార్మికరంగంలోకి కొత్త నాయకులొచ్చారు. ఐ.ఎస్.టి.యు.సి.లో ప్రారంభం నుండి పనిచేసిన నందా గురించి ఆ సంఘ సభ్యులకే తెలియని పరిస్థితి ఏర్పడింది అని అంటుంటారు.

చివరికి నందా జీవితం ప్రభుత్వం నుండి వచ్చే నెలవారీ రూ. 500 పెన్షన్ మీద ఆధారపడింది.

ఆరోగ్య సమస్యలు అంతగా లేవు, నియమబద్ధ జీవితం కాబట్టి ఆరోగ్యంతో జీవించారు.
అపార్ట్మెంట్లో ఒక్కడే బ్రతుకుతుండేవారు.

తాను అద్దెకిచ్చిన ఇంట్లో ఉంటున్న సన్నని వ్యక్తి ఒకనాడు కేంద్రంలో మంత్రి అనిగాని, దేశానికి ఆపద్దర్మ ప్రధానిగా పనిచేశాడనిగాని ఇంటిఓనరికి  కూడా తెలియదు

అద్దెకుండే సాదాసీదా మధ్యతరగతి వారితో వ్యవహరించినట్టే నందాతో వ్యవహరించేవాడు.

అద్దె సరిగా కట్టటంలేదని ఇంటి యజమాని అరిచేవాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని బెదిరించేవాడు.

అన్నింటినీ నందా మౌనంగా భరించారే కాని తన గత హోదా గురించి. మాటమాత్రం చెప్పలేదు. మీ అద్దె అణా సైపలతో తప్పకుండా చెల్లిస్తానని చేతులెత్తి దండం పెట్టేవారంతే మన నందా జీ.

డబ్బు ఏమాత్రం వెసులు బాటు అయినా ముందుగా ఇంటి ఓనర్’కి కట్టేవారు. సరే కదా అని ఇంటి ఓనర్ పూరుకున్నాడు.

నందాజీ చివరి రోజులు…

ఒకసారి వరసగా కొన్ని నెలలు అద్దె కట్టకపోవటంతో ఇంటి యజమానికి కోపమొచ్చి అద్దెకింద ఇంట్లోని వస్తువులు తీసుకుందామని వెళ్లారు. అలా వెళితే అక్కడ కనిపించింది ఒక పాతపరుపు, చాప, కొన్ని వంటపాత్రలు తప్పించి మరేమీ లేవు.

అవి చూసి ఓనర్’కి ఈయన ఇక అద్దెకట్టలేడని అర్థమైంది. అంతే ఇంటిలోని సామానుని బయటకు నిసిరివేసి, నందాని కూడా బయట రోడ్డుమీద నిలబెట్టాడు. చుట్టూ సామానుతో మధ్యలో నిలుచున్న బక్కపల్చని వ్యక్తి ఎవరో పత్రికా ఫోటోగ్రాఫర్కి తెలియదు.

ఐనా ఆ దృశ్యం బాగుందని క్లిక్ చేసి ఎడిటర్కి చూపించినప్పుడుగాని ఆ వ్యక్తి గుల్జారీలాల్ నందా అని తెలియలేదు.

ఆ వార్త సంచలనమైంది. ప్రభుత్వం మేల్కొన్నది. అప్పుడు ఆయన వయసు 94 ఏళ్ళు.

ఆ సమయంలో కూడా ప్రభుత్వ సహాయాన్ని సవినయంగా తిరస్కరించారు.

ఆ సంఘటనతో ప్రజలకు గుల్జారీలాల్ బ్రతికేవున్నారన్న విషయం తెలిసింది.

అటువంటి నిజాయితీ గలిగిన నాయకుడు ఒకరు దేశంలో జనించి వున్నాడని తెలిసింది.

అలా తన చివరి రోజుల వరకు గాంధేయమార్గంలోనే జీవించిన గుల్జారీలాల్ నందా జనవరి 15, 1998లో ఢిల్లీలో మరణించారు.

ఆయన మరణానికి ఒక సంవత్సరం ముందు గుల్జారీలాల్ నందాని భారతరత్న (Bharat Ratna) బిరుదుతో సత్కరించింది భారత ప్రభుత్వం.

Source : జనవరి 15 న ఆయన వర్ధంతి సందర్భంగా గుల్జారీలాల్ నందాజీకి నివాళులర్పిస్తూ… సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టు ఆధారంగా….

స్వామివారికి ఘనంగా పంచామృత అభిషేకం

Spread the love
2 thought on “ఇంటిఅద్దె కూడా కట్టుకోలేని స్థితిలో గుల్జారీలాల్ నందా?”

Comments are closed.