Nadendla Manohar at GudivadaNadendla Manohar at Gudivada

ప్రజా ప్రతినిధులది అత్యంత హేయమైన సంస్కృతి
రోడ్డు, ఉపాధి, మెరుగైన సేవలు లేక ప్రజలు అల్లాడుతున్నారు
బూతు పురాణం కట్టిపెట్టి అభివృద్దిపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని రైతులు అత్యంత దీనమైన స్థితిలో ఉన్నారు
జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షం వహిస్తుంది
గుడివాడ విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్

ప్రజలకు ఉపయోగపడని బూతుల సంస్కృతి (Vulgar Language) వల్ల ప్రజల కష్టాలు, బాధలు తీరవు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఎదుటివారిపై మానసిక దాడి చేసేందుకు ఎమ్మెల్యేలను (MLAs) ప్రజలు ఎన్నుకోవడం లేదు. ముఖ్యమంత్రి (Chief Minister) ప్రాపకం కోసమో.. రాజకీయ కక్షతోనో బూతులు మాట్లాడితే ప్రజలు హర్షించరు.  జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ (Political affairs Committee) చైర్మెన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వైసీపీ నాయకులపై తీవ్రంగా స్పందించారు. పార్టీ ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీల కార్యకర్తల కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా (accident Insurance) చెక్కులను అందించారు. ఇవి ఇచ్చేందుకు ఉమ్మడి కృష్ణాజిల్లా (Krishna District), గుడివాడ (Gudivada) విచ్చేసిన నాదెండ్ల మనోహర్ మంగళవారం రాత్రి విలేకరుల (Press meet) సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కృష్ణా జిల్లా పేరు చెబితే ఎందరో కవులు, మరెందరో రచయితలు, ఇంకెందరో మహానుభావులు టక్కున గుర్తుకొస్తారు. ఇక్కడి ప్రజల భాష, సంస్కృతి ఎంతో ఆదర్శంగా ఉంటుంది. గతంలో రాజకీయ నాయకులు (Political  Leaders) సైతం అంతే హుందాగా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు (Peoples Representatives) మాత్రం బూతులతో ఇతరులను ఇష్టానుసారం తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనివల్ల ప్రజల సమస్యలు ఏ మాత్రం తీరవు.

మీకు వ్యక్తిగత కారణాలు, ఇతర రాజకీయ అంశాలు ఉంటే దాన్ని వేరే విధంగా వ్యక్తపరిచేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. సాధారణ ప్రజలు సైతం వినలేని భాషను ఉపయోగిస్తూ రాజకీయ విమర్శలు అనుకోవడం మీకే సిగ్గుచేటు అని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేసారు.

జనసేన (Janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గుడివాడలో (Gudivada) గతంలో పర్యటించినప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయో ప్రస్తుతం కూడా అలాగే కనిపిస్తున్నాయి. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ క్యాంపెయిన్ (Digital Campaign) కు ఈ ప్రాంతం నుంచి మంచి స్పందన వచ్చింది. ఎక్కడికి వెళ్లినా గోతులు పడిన రోడ్లు స్వాగతం పలుకుతున్నాయి. గుడివాడ నియోజకవర్గ ప్రజలకు పైవంతెన సమస్య ఉంది. అలాగే ఇక్కడి యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంగా మహిళలు సైతం ఇక్కడ కనీస పరిశ్రమలు (Industries) వస్తే తమకు ఉపాధి (Employment) కలుగుతుందని సూచించడం అబ్బురపరిచింది. ఇక్కడి ప్రజలకు తమకు ఏం కావాలో అవగాహన ఉంది.

ఉపాధి లభించడం లేదని వాపోతున్నారు

కేవలం తమ పిల్లలను ఇంటర్ వరకు చదివించి మాన్పించేస్తున్నామని, వారు ఉన్నత చదువులు (Higher Education) చదివినా సరే ఇక్కడ ఉపాధి లభించడం లేదని వాపోతున్నారు. దీనిపైన స్థానిక శాసనసభ్యులకు ఏమాత్రం శ్రద్ధ లేదు. ఎప్పుడు చూసినా బూతులు, అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఫేమస్ కావడానికి చూస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర శభాష్ అనిపించు కోవడానికి మాత్రమే ప్రాధాన్య మిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రజల కోసం నిత్యం పోరాడేందుకు వారి సమస్యలు తీర్చేందుకు జనసేన పార్టీ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది. సంక్షేమమే జనసేన విధానం అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

కొందరికేనా సంక్షేమం?

సంక్షేమ ప్రభుత్వం (welfare Government) అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం (YCP Government) సంక్షేమ పథకాల (welfare Schemes) అమలులోనూ వక్రబుద్ధిని చాటుతోంది. తమ అనుకునే వారికి ఒకలా, ఇతర పార్టీ సానుభూతి పరులకు మరోలా సంక్షేమాన్ని అమలు చేస్తోంది. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త భార్యకు సైతం వితంతు ఫించను ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. మరోపక్క రాష్ట్రంలో రైతులు వేదనతో ఉన్నారు. వారికి అవసరమైన ఏ సహాయం ప్రభుత్వం నుంచి అందడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాల (Rythu Barosa Centers) సైతం అత్యంత దీనంగా కనిపిస్తున్నాయి. వాటి పని తీరు మరి తీసికట్టుగా తయారైంది. కేవలం రైతు భరోసా కేంద్రాల కోసం రూ.6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. ఈ ఖర్చుపెట్టిన ప్రభుత్వం తర్వాత రైతులకు వాటి వల్ల అందుతున్న ప్రయోజనం ఏమిటి అన్నది మాత్రం పట్టించుకోవడం లేదు. గడిచిన మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏకంగా మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత బాధాకరం.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోనే (Pulivendula) 46 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం కలచివేసింది. వారిని ఆదుకునే విషయంలోనూ, ఆత్మహత్యలను నివారించే విషయంలోనూ ప్రభుత్వ స్పందన శూన్యం (Zero). జనసేన పార్టీ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా ఎన్నో బతుకు వెతలు మాకు కనిపించాయి. క్షేత్రస్థాయిలో రైతు పడుతున్న ఆవేదన కళ్ళకు కట్టింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే రైతులు ఆగ్రహం చవిచూడక తప్పదు.

ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి

కచ్చితంగా ప్రతి ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు జనసేన కచ్చితంగా కృషి చేస్తుంది. ప్రభుత్వానికి ప్రజల వేదన వినిపించేలా ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను వారి ముందు ఉంచుతాం. జనసేన చేపట్టిన జనవాణి (Janavani) కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి మంచి స్పందన వచ్చింది. వాటిని ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వ శాఖలకు పంపి పరిష్కారమయ్యే ఏర్పాట్లు చేస్తున్నాం. స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చిన రెండు వేల అర్జీలపై ప్రత్యేకంగా ఉత్తరాలు రాసి వాటిని పరిష్కరించేలా చూడాలని కోరారు. మొదటి నుంచి జనసేన పార్టీ ప్రజాపక్షమే. వారి కోసం నిత్యం ఆలోచించే పార్టీ జనసేన పార్టీ” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్… కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నేతలు బండి రామకృష్ణ… పాలంకి సారథి బాబు, పాలంకి మోహన్ బాబు, బి.వి.రావు, సందు పవన్ తదితరులు పాల్గొన్నారు.

అడ్డుకోవడానికి “సై”… ఆదుకోవడానికి “నై”