చెత్త పన్నుకంటే కారు చౌకైన సినిమా టిక్కెట్లను
చూసి నవ్వాలా లేక చెత్తకంటే చులకనైన
సినిమా టీకెట్ రేట్లపై కూడా స్పందిచలేని సినిమా హీరోలను
చూసి నవ్వుకోవాలా అని చెప్పుకొందాం అంటే దండన భయం
సినిమా పోస్టరులు (Cinema Posters) తింటూ ఆవులు (Cows) –
తగ్గిన టిక్కెట్లు తింటూ జీవులు
బతకగలరా? శివా (Siva) అని చెప్పుకోవాలి అంటే దండన భయం
నిత్యావసరాల (Essentials) రేట్ల (Rates) ఆకాశాన
అవసరం లేని సినిమా రేట్లు (Cinema Rates) మాత్రం పాతాళన
మీకిది తగదు…
భరించడానికి భారంగా ఉందని
చెప్పుకొందాం అంటే దండన భయం (Fear)?
పేదోడి కోసం సినిమా రేట్లు తగ్గించాం అంటారు
అదే పేదోడి నుండి వారి తాత ఇంటికి వేలకి వేలు కట్టమంటారు
మీరు తగ్గించరు గాని సినిమావాళ్లు మాత్రం తగ్గించాలి అంటారు
ఈ ధర్మం ఏ సిరాతో రాసారు అని అడగాలంటే దండన భయం?
గూడు (House) కట్టుకొందాము అంటే
సిమెంటు (Cement) మొదలు అన్నీ ప్రియం
గాదెల్లో బియ్యం ఉండవు
షాపుల్లో ఉన్న బియ్యం కొందాం అంటే
ఆకాశాన్ని అంటే బియ్యపు ధరలు
తిండి లేక పోయినా సినిమా చూస్తూ బతికేయాలా
అని చెప్పుకొందాం అంటే దండన భయం?
పప్పులు (Pulses), అప్పులు (Loans), నూనెలు (Oils)
అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి
కానీ అవసరం లేని సినిమా రేట్లు చెత్త కంటే చౌకగా ఉన్నాయి
తగ్గిన సినిమా టిక్కెట్లతో పప్పు వండుకోవాలా
లేక కడుపు మాడ్చుకొని చావాలా
అని చెప్పుకొందాం అంటే దండన భయం?
గ్రామ వాలంటీర్ (Volunteer) మొదలు కొని
ఏలినవారి సలహాదారుల (Advisors) జీతాలు అన్నీ ఆకాశాన
కానీ సినిమా టిక్కెట్ల రేట్లు మాత్రం పాతాళన
మందు రేట్లు కాక రేపుతున్నాయి
కానీ సినిమా రేట్లు మాత్రం కన్నీరు తెప్పిస్తున్నాయి
అని చెప్పుకొందాం అంటే దండన భయం?
పేదోడి (Poor people) వాడే అవసరాల ధరలు తగ్గించలేని అమాత్య పరివారం,
తగ్గిన సినిమా టిక్కెట్లును కొని బతికేయమంటున్నారు?
సినిమా టిక్కెట్లతో ఎలా బతక గలం అని
మా గళం విప్పాలంటే దండన భయం?
కోడిపందాలపై (Kodi Pandalu) ఉత్తరాలు (Letters) రాసేవారేగాని
పెరిగిన ధరలపై, పేదోళ్ల కష్టాలపై మాట్లాడే
నాయకులే (Leaders) కరువయ్యారు అని చెప్పుకొందాం అంటే దండన భయం.
చెత్త పన్ను(Chetha pannu) కంటే కారు చౌకైన సినిమా టిక్కెట్లను
చూసి నవ్వాలా లేక చెత్తకంటే చులకనైన
సినిమా టీకెట్ రేట్లపై కూడా స్పందిచలేని సినిమా హీరోలను
చూసి నవ్వుకోవాలా అని చెప్పుకొందాం అంటే దండన భయం
సినిమా టిక్కెట్లుతో కడుపు నింపుకోవాలా?
సినిమా టిక్కెట్లతో గూడు కట్టుకోవాలా?
సినిమా టిక్కెట్లతో జీవనం సాగించాలా
పేదోడి బతుకు సినిమా మయం చేశారు కదరా
అని చెప్పుకొందాం అంటే దండన భయం?
ఆలోచించండి… తగ్గిన సినిమా ధరలను మెచ్చికొంటూ… నిత్యావసరాల ధరలపై స్పందించలేని ప్రతీ ఒక్కరు తమకు తాము ప్రశ్నించుకోండి? (Its Akshara Satyam)