Nadendla with Pawan and BabuNadendla with Pawan and Babu

జనసేన-తెలుగుదేశం (Janasena-Telugudesam alliance) కూటమిలో చంద్రబాబు (Chandra Babu), జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు సమప్రతిపాదికన ముఖ్యమంత్రులు (AP Chief Minister) అవుతారని ఎన్నికల ముందే ప్రకటించాలని చేగొండి హరిరామ జగయ్య (Harirama Jogaiah) డిమాండ్ చేసారు. పొత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పక పోతే ఓటు ట్రాన్స్ఫర్ పూర్తిగా జరగదు. అని జోగయ్య తన విశేషణాత్మక లేఖలో పేర్కొన్నారు. 90 శాతం ఉన్న అణగారిన వర్గాల నుండి ఓటు ట్రాన్స్ఫర్ జరిగి, వైసీపీ ఓటమి చెందాలంటే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సమ ప్రాతిపదికన ముఖ్యమంత్రి అవుతారని విస్పష్ట ప్రకటన త్వరలో ఉండాలని హరిరామ జోగయ్య తన లేఖలో స్పష్టం చేసారు.

హరిరామ జోగయ్య, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు లేఖ సారాంశం

“జనసేన, తెలుగుదేశం కూటమి రాబోయే ఎన్నికలలో వై.ఎస్.ఆర్ పార్టీని ఓడించటమే ఏకైక లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రకటించుకుంటూపోతున్నారు. కానీ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతున్నది అనే ప్రశ్నకు మాత్రం ఎవరకు తోచినట్లుగా వారు మాట్లాడుతూ ప్రజానీకాన్ని అయోమయంలో పడవేస్తున్న మాట అక్షరాలా నిజం. తెలుగుదేశం నేత చంద్రబాబు నోటి నుంచి వచ్చినా, ఆయన కుమారుడు లోకేష్ నోటి నుండి వచ్చినా “రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని మాత్రమే చెబుతున్నారు. అలానే బాబే ముఖ్యమంత్రి అని” లోకేష్ “నేను ముఖ్యమంత్రి అయిం తర్వాత” అంటూ చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా ఉచ్చరిస్తూ వస్తున్నారు.

బాబు ఇంతకీ ముఖ్యమంత్రి ఎవరు?

“ముఖ్య మంత్రి ఎవరనేది ఎన్నికలయిం తర్వాతనే నిర్ణయించుకుంటామని” ఒకసారి, “తెలుగుదేశానికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టటానికి జనసేన సిద్ధంగా లేదని, ప్రజలు కోరుకుంటే తానే ముఖ్యమంత్రి అవుతానని” మరోసారి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ వివిధ సభల్లో ప్రకటిస్తూ వస్తున్నారు.

ఇంతకీ ముఖ్యమంత్రి ఎవరు అనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య స్పష్టత అంటూ ఉందా లేక ఎవరి స్వంత అభిప్రాయాలు వారు ప్రకటించుకుంటూ పోతున్నారా అనేది సందేహమే. జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయటానికి పూనుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి ఎవరనే చిక్కుముడి విడనంత వరకు ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. అలానే క్షేత్ర స్ధాయిలో స్పష్టత యివ్వనంత వరకు ప్రజలు పొత్తుని స్వాగతించినట్లు భావించటానికి వీల్లేదు.

2019 ఎన్నికలలో ఒంటరిగా పోయి 40 శాతం ఓట్లు సంపాదించుకున్న తెలుగుదేశం 23 సీట్లు మాత్రమే దక్కించుకోగల్గింది. జనసేన 6.9 శాతం ఓట్లు మాత్రమే సంపాదించుకుని 1 సీటుకు పరిమితమయింది. ఈ రెండు పార్టీలు ఒంటరిగా పోకుండా 2019లో కలిసి ప్రయాణం చేసి ఉంటే 61 సీట్లు దక్కించుకుని ఉండేవని లెఖ్ఖలు చెబుతున్నాయి. అంటే జనసేనకు పడే ఓట్లు తక్కువయినా తెలుగుదేశానికి పడిన ఓట్లు ఎక్కువయినా రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తేనే ఓట్ల సంఖ్య బహుళంగా పెరుగుతుంది. అప్పుడే వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లకు గండి పడుతుంది. అప్పుడే 50 శాతానికి మించి సీట్లు సంపాదించుకుని అధికారం దక్కించుకోవటానికి జనసేన-టీడీపీలకు దారి సుగుమం అవుతుందనేది” నిస్సందేహం.

తెలుగుదేశం ఒంటరిగా వెళ్ళినా టీడీపీ ఓటమి చెందుతుంది. అలానే జనసేన ఒంటరిగా వెళ్ళినా విజయం సాధించటం కల్ల అనే చెప్పాలి. 2019 గతే మరోసారి పడ్తుందని చెప్పాల్సి ఉంది. అయితే అనుభవజ్ఞుడైన చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం కార్యకర్తలు, నీతివంతమైన పరిపాలన అందచేయగల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు కోరుకుంటున్న మాట నిజం. తమ నాయకుడు రాజ్యాధికారం చేబట్టటం ద్వారానే 80 శాతం జనాభా ఉండి తరతరాలుగా బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్న భానిసత్వం నుండి బయట పడగలరని అని ఆశపడ్తున్న కాపు సామాజిక వర్గం కోరికలో తప్పేమి లేదని అనాలి.

జనసైనికుల ఆశలను జనసేనాని గౌరవించాలి

అయితే సేనాని ద్వారా సాధించదలిచే అధికారం కోసం జన సైనికులందరూ సేనానికి అండగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. అలాగే జన సైనికులు ఆకాంక్షను కూడ సేనాని గౌరవించాల్సి ఉంది. ఏది ఏమైనా అటు తెలుగుదేశం కార్యకర్తలు, ఇటు జన సైనికులు సంతృప్తి చెందినపుడు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఓట్లు ట్రాన్స్ఫర్ సవ్యంగా అయి తెలుగుదేశం జనసేన కూటమి నెగ్గి బయటపడటానికి అవకాశం కల్గుతుంది అని చెప్పటం అతిశయోక్తి అనిపించుకోదు.

ఇందుకుగాను చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లలో ఏ ఒక్కరో మాత్రమే 5 సం॥రాల కాలం ముఖ్యమంత్రి పదవి చేపట్టటానికి స్వస్తి పలకాలి. చెరో 2 1/2 సం॥రాల కాలం ముఖ్యమంత్రి పదవి అధిష్టించటానికి చెరిసగం మంత్రి పదవులు జనసేనకు 60 తక్కువ కాకుండా అసెంబ్లీ సీట్లు పంచుకోటానికి సిద్ధపడటం తక్షణ అవసరం. తదనుగుణంగా ఈ క్రింది ప్రతిపాదనను పరిశీలించటం మంచిది.

పొత్తుకు మధ్యే మార్గం

మొదటి 2 1/2 సం||రాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డరు, రెవెన్యూ, హోమ్, పోర్టుఫోలియోలతో సహ ముఖ్యమంత్రి (Co-Chief Minister)గా ఉండాలి తర్వాత 2 1/2 సం॥రాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా లోకేష్న సహ ముఖ్యమంత్రిగా చేయటం ఉత్తమమం. దీన్నే ప్రజలు ఉభయ పార్టీల అభిమానులు కోరుకొంటున్నారు.

ఈ ప్రపోజల్ అటు తెలుగుదేశం కార్యకర్తలు, ఇటు జన సైనికులు సంతృప్తి చెంది, ఎన్నికలు సవ్యంగా జరిగిది వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి చెందడం తధ్యం. అలానే వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటకించిన సంక్షేమ పథకాలకు మించిన పధకాలను కూడా ఈ కూటమి ప్రటకించాలి. అప్పుడే జనసేన తెలుగుదేశం కూటమి వైస్సార్ కాంగ్రెస్ పార్టీని సులువుగా ఓడించగలిగి విజయ దుందుభి మోగించటం ఖాయంగా చెప్పవచ్చు.

ప్రజలు ఏమి కోరుకొంటున్నారు

ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. నెగ్గటం కష్టం అంటూ, సర్వేలు చెబుతున్నాయని అంటూ 40 నుండి 50 మంది వరకు శాసనసభ ఇంచార్జిలను వైసీపీ మారుస్తున్నది. ఇంచార్జిలను మార్చి కొత్తవారికి ఇంచార్జిలను నియమించే దుస్థితికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చినది. ఈ సందర్భంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఉన్న ఒకే ఒక సమస్యను ఎన్నికల ముందే (ముఖ్యమంత్రి) పరిష్కరించుకుని స్పష్టతతో ముందుకు సాగాలి. తద్వారా ఉభయ పార్టీల భవిష్యత్ బాగుండాలని కోరుకునే ఉభయ పార్టీల అభిమానుల, అలానే మార్పు కొనుకొనే ప్రజల అభిలాష, ఆకాంక్ష.

–చేగొండి హరి రామ జోగయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు రాజకీయ విశ్లేషకుడు

వైసీపీ సర్కార్ లో పంచాయతీలు నిర్వీర్యం: నాదెండ్ల ఘాటైన వ్యాఖ్యలు