జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్’ని (Pawan Kalyan) అంత మొందించడానికి రు. 250 కోట్లు (250 Crores Deal) భారీ సుపారి చేతులు మారినట్లు మీడియాలో వార్త హల్చల్ చేస్తున్నది. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలకు ఆధారాలు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది అంటూ వార్తా కధనాలు వెలువడుతున్నాయి. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఫోన్ సంభాషణలు రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి అనే వార్త మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ సర్క్యూలేట్ అవుతున్నది.
ఇందులో కొంతమొత్తం విదేశాలలో చెల్లించే విధంగా ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు. దీనిపై కేంద్ర నిఘా వర్గాలు లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది అని అంటున్నారు. ఈ డీల్ వెనుక ఆలోచన ఎవరిది…? డీల్ ను అమలు చేస్తున్నది ఎవరు…? సుపారిగా అడ్వాన్స్ ఎంత ఇచ్చారు…? ఎవరికి ఇచ్చారు…? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు…? కుట్రను ఏవిధంగా అమలు చేయాలనుకుంటున్నారు…? అన్న విషయాలపై కేంద్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి అనే వార్త సోషల్ మీడియాలోనూ, వివిధ చానెల్స్’లోను ప్రచారం అవుతున్నది. నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ఆగస్టు 19 న కడప జిల్లా సిద్ధ వటంలో జరిగిన రైతు భరోసా సభలో కూడా కిరాయి హంతకులు సంచారం ఉన్నట్లు గుర్తించారు అని అంటున్నారు. సిద్ధవటం వెళుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్’లోకి గుర్తు తెలియని వాహనం ప్రవేశించటానికి ప్రయత్నం చేసింది. కాన్వాయ్ లోని రక్షణ సిబ్బంది అప్రమత్తమై హెచ్చరించడంతో వాహనం లోని వారు తమ వాహనాన్ని దారి మళ్లించుకున్నారు అనే వార్తలు గుప్పు మంటున్నాయి.
అయితే అక్కడ తమ పథకం అమలు చేయటానికి సాహసించలేదు. ఇక విశాఖ పట్నంలో మూడు రోజులపాటు జరిగిన సంఘటనలను అందరూ ప్రత్యక్షంగా చూశారు. అలజడి రేపి అంతమొందించడం లక్ష్యం గా పెట్టుకున్నట్లు తెలిసింది అని జనసేన వర్గాలు అంటున్నాయి.
పవన్ కళ్యాణ్’కి ఫోన్ బెదిరింపులు
2014 ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి ఒక వర్గం పవన్ కళ్యాణ్ పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. అప్పటినుంచి పవన్ కళ్యాణ్’కి ఫోన్ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి పై వ్యక్తిగతంగా దాడి చేస్తామని, పిల్లలనూ వదిలి పెట్టబోమని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే తగినంత జాగ్రత్తలతో ఆయన అప్రమత్తంగానే ఉంటున్నారు అని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు తేలాల్సివుంది.
విశాఖ నగరం, అమరావతిలో కిరాయి హంతకులు ఆశ్రయం పొందుతున్నట్లు నిఘావర్గాలు వద్ద సమాచారం ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎప్పుడు పర్యటించినా వారి పథకం అమలు చేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కుట్రకు 2019 ఎన్నికలకు ముందే బీజాలు పడ్డాయి. వచ్చే ఎన్నికల లోపు ఎప్పుడైనా సరే కుట్రను అమలు చేసే ప్రమాదం ఉందనే సమాచారం అందింది అని జనసేన పార్టీ చెబుతున్నది.
కేంద్ర నిఘా వర్గాలు నుండి సమాచారం అందింది అనే దానిపై కేంద్ర ప్రభుత్వంలోని హోం శాఖ ఎటువంటి స్పష్టత నిస్తుందో తెలియాల్సి ఉంది.
సోమవారం రాత్రి పవన్ కళ్యాణ్ ఇంటివద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దౌర్జన్యం చేసి, బూతులు తిట్టిన దుండగులు వచ్చిన కారు ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యన్నారాయణ రెడ్డిది కావటం గమనార్హం. ఇది ఎంతవరకు వాస్తవమో విచారణలో తెలియాల్సిన ఉంది.
ఇది ఇలా ఉండగా జనసేనాని పవన్ కళ్యాణ్ భద్రత కోసం పవన్ వ్యకిగత భద్రతా సిబ్బందిని మరింతపెంచటంపై జనసేనపార్టీ నాయకత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది.