AP New cabinetAP New cabinet

జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కొత్త మంత్రివర్గ (New Cabinet) ప్రమాణ స్వీకార కార్యక్రమం (Swearing in ceremony) సోమవారం ఉదయం పూర్తి అయ్యింది. కొత్త మంత్రులచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Bishwabhushan Harichandan) ప్రమాణం చేయించారు. అక్షరమాల క్రమంలో ముందుగా అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

అనంతరం అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌, వేణుగోపాల్‌కృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరు జయరామ్, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి ప్రమాణస్వీకారం చేశారు. 

అనంతరం ఉషశ్రీచరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, రాజన్న దొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడుదల రజని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారోత్సవానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.

కొత్త మంత్రులు వారికి కేటాయించిన శాఖల వివరాలు

అంబటి రాంబాబు : జలవనరుల శాఖ

ఆంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)

ఆదిమూలపు సురేష్ ‌: మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌

బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ

బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)

బుగ్గన రాజేంద్రనాథ్‌ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖలు

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ

దాడిశెట్టి రాజా (రామలింగేశ్వర రావు) : రోడ్లు, భవనాల శాఖ

ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌

గుడివాడ అమర్‌నాథ్‌ : పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ

గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్‌ శాఖ, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖ
జోగి రమేష్‌ : గృహనిర్మాణ శాఖ

కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ

కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ

కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)

నారాయణ స్వామి : ఎక్సైజ్‌ శాఖ (డిప్యూటీ సీఎం)

ఉషాశ్రీ చరణ్‌ : స్త్రీ శిశు సంక్షేమ శాఖ

మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ

పినిపే విశ్వరూప్‌ : రవాణా శాఖ

రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)

ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ

తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ

విడదల రజిని : ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖలు

ఏపీ నూతన కాబినెట్ తుది జాబితా విడుదల

Spread the love