Pantham Nanaji press meet Sep 22Pantham Nanaji press meet Sep 22

ప్రజా క్షేత్రంలో తిరిగితే అసలు విషయం తెలుస్తుంది
గంజాయి రవాణా చేస్తున్నవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్’ని విమర్శిస్తున్నారు
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
మీడియా సమావేశంలో మాట్లాడిన పంతం నానాజీ, ముత్తా శశిధర్

వాస్తవాలు తెలుసుకోకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం ఏసీ గదుల్లో కూర్చుని పవన్ కళ్యాణ్’ని (Pawan Kalyan) విమర్శ చేయడం జరగదు. గుడ్డిగా విమర్శిస్తే వైసీపీ మంత్రులకు (YCP Ministers) ప్రజలే బుద్ధి చెబుతారని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ సభ్యులు పంతం నానాజీ (Pantham Nanaji), ముత్తా శశిధర్ (Mutha shasidhar) అన్నారు.

కాకినాడలో సోమవారం ఇరువురు నేతలు విలేకరుల సమావేశం (Press meet) నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఏ సీ సభ్యులు నానాజీ మాట్లాడుతూ “జనసేన పార్టీ మండపేటలో నిర్వహించిన కౌలు రైతుల భరోసా యాత్ర (Kaulu Rythu Barosa Yatra) సక్సెస్ అయ్యిది. అలానే భీమవరంలో నిర్వహించిన జనవాణి (Janavani) కార్యక్రమం కూడా విజయవంతం అయ్యింది. మరోపక్క రోడ్ల దుస్థితిపై చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్’కు (Digital Campaign) కూడా విశేష స్పందన వచ్చింది. దీనితో వైసీపీ నేతలకు (YCP Leaders) కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీంతో వైసీపీ (YCP) నేతలకు పూర్తి స్థాయిలో మతి భ్రమించినట్లు ఉంది. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక విధానపరమైన సమాధానం చెప్పలేక సకల శాఖ మంత్రి  రాసి ఇచ్చిన స్క్రిప్టునే (Script) చదువుతున్నారు అని నానాజీ విమర్శించారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు (East Godavari District) చెందిన మంత్రి దాడిశెట్టి రాజా (Dadisetty Raja) కూడా జనసేన (Janasena) మీద ఆరోపణలు చేయడం చూస్తుంటే సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. గంజాయి (Ganja) అక్రమ రవాణా, దొంగ బంగారం (Gold Smuggling) వ్యాపారం లాంటి వాటిపై ఎన్నో ఆరోపణలు ఉన్న దాడిశెట్టి రాజా తన నోటికి పని చెబితే, ప్రజలు తమ చేతికి పని చెబుతారు. విమర్శ చేసేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడడం మంత్రులు నేర్చుకోవాలి. అలా కాకుంటే మాజీ మంత్రులు పేర్ని నాని, కన్నబాబులకు పట్టిన గతే మీకు పడుతుంది. కచ్చితంగా దానికి శిక్ష ప్రజాక్షేత్రంలో అనుభవిస్తారు అని అన్నారు.

మీరు రూ.2205 కోట్లు రోడ్ల మీద ఖర్చు చేస్తే, ఎక్కడ చేశారో లెక్క చెప్పండి. రోడ్స్ కోసం ఇన్ని నిధులు ఖర్చు చేసి ఉంటే, రోడ్లు ఇంత దారుణంగా ఎందుకు ఉన్నాయి..? అలాకాకుండా రోడ్ల పేరు చెప్పి ఆ డబ్బులను ఎవరి జోబులోనైనా వేసుకుంటున్నారా అని అనుమానం మాకు వస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ వస్తున్నారు అని తెలిస్తే చాలు… అప్పటికి అప్పుడు కాంట్రాక్టర్లను పిలిచి వారికీ అడిగినంత ఇచ్చేసి రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు అని నానాజీ ఆరోపించారు.

వైసీపీ ఓ బ్రోకర్ పార్టీ (Broker Party)

పవన్ కళ్యాణ్’ని విమర్శిస్తున్న రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తన పరిధిలోని రోడ్లు, భవనాల శాఖ లెక్కలు బయట పెట్టండి. అన్నీ విషయాలు ప్రజలకు తెలుస్తాయి. కన్న తండ్రి చనిపోతే, అధికారం కోసం మీ అధినేత ఏమి చేసాడో, ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి మాకు సంస్కారం ఉంది.. కాబట్టి మేము ఆయనను ఏమి అనలేకపోతున్నాం.. మీది ఓ బ్రోకర్ పార్టీ.. జైలు పార్టీ (Jailu Party) అని ప్రజలు అనుకొంటున్నారు అని నానాజీ అన్నారు.

ఓట్ల కోసమే మీ రాజకీయాలు

పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ మాట్లాడుతూ “కోనసీమకి అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema Ambedkar district) అనే పేరు పెట్టాలని మొట్టమొదట తీర్మానం చేసింది జనసేన పార్టీ. కులాల కుంపట్లు రాజేసి, అగ్గి రాజేయాలని చూశారు. అది చుట్టూ తిరిగి వైసీపీకి (YCP) చుట్టుకోవడంతో ఏం చేయాలో అర్థం కాక విచిత్రమైన ప్రేలాపనలు ఎక్కువయ్యాయి. రోడ్లు మీదకు రాకుండా విమానాల్లో తిరుగుతూ, అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని నిద్ర లేపాలని #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాం. దానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడం చూసి మంత్రులు కారు కూతలు కూస్తున్నారు. మేం కూడా మీ కంటే అసభ్యంగా మాటలు అనగలం కాని సభ్యత, సంస్కారం అడ్డు వస్తున్నాయి అని శశిధర్ ఆరోపించారు.

గంజాయి అడ్డాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంజాయికి అడ్డాగా మారింది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే దానిని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ (Visakha Agency) ప్రాంతాల నుంచి భారీగా గంజాయి తూర్పుగోదావరి జిల్లాకు తీసికొస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు దర్జాగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. దీనివల్ల యువత భవిష్యత్తు పాడైపోతోంది. గంజాయి మత్తులో యువతను చైతన్యరాహిత్యం చేసి , ఈ ప్రభుత్వం పక్కా పథకం ప్రకారం రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోంది అని శశిధర్ ఆరోపించారు.

నాడు వైసీపీ పారిపోతే… నేడు విపక్ష బాధ్యతను జనసేన నిర్వర్తించింది

తెలుగు దేశాన్ని (Telugudesam) కూడా మేం ఆనాడు రోడ్ల కోసం నిలదీసిన సంగతి మీకు తెలియదా? అప్పట్లో ఈ సమస్య ఉన్నా, పోరాడింది జనసేన పార్టీ మాత్రమే. నాడు విపక్షంలో ఉన్న వైసీపీ (YCP) అప్పట్లో పారిపోతే, నేడు విపక్ష బాధ్యతలను జనసేన పార్టీ తీసుకుంది. 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికినప్పటికీ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రశ్నించిన దమ్ము జనసేన పార్టీకి ఉంది అని శశిధర్ అన్నారు.

ఈ ప్రభుత్వం దళితుల (Dalit) ఓట్ల కోసం అంబేద్కర్ (Ambedkar) స్మృతి వనం కడతాం… దళితులకు కొండంత అండగా ఉంటాం అని చెప్పారు.. అది ఏమైందో తెలీదు. పవన్ కళ్యాణ్’పై మానసిక దాడులు చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆపకపోతే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారు. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు కనీసం రోడ్డు మీద కూడా తిరగకుండా ప్రజలే చేసుకొంటారు అని శశిధర్ ఆరోపించారు.

ఈ సమావేశంలో కరెడ్ల గోవింద్, తాటికాయల వీరబాబు, బండారు మురళి, పుల్ల శ్రీరాములు, బండారు మణికంఠ, తలాటం దుర్గ బాబు, కర్ని శ్రీనివాస్, కిషోర్, శరత్, గణేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ పాలకులకు కంటి, వినికిడి పరీక్షలు చేయించాలి!
పేకాట మంత్రికి జోకర్లు తప్ప ఇంకేం గుర్తుకు రావు

Spread the love