శృంగవృక్షం సేవా సమితి నిరంతర పోరాటం?
గోల్ మాల్ గోవిందాల భరతం పట్టేది ఎప్పుడు?
“మా గ్రామంకోసం సేకరిస్తున్న స్థల సేకరణ నిధులు పక్కాగా పక్కదారిన పడుతున్నాయి? నిరుపేదలందరికీ పక్కాఇళ్ల నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం సేకరిస్తున్న భూములు నివాసయోగ్యంగా లేవు. ఇది మా గ్రామ ప్రజలకు అనువైనవి కాదు. గోతులు, గుట్టలతో ఉన్న భూములను, ఎందుకు పనికిరాని భూములను లక్షలకు లక్షలు పోసి ఎక్కువ ధరకి కొనడం దేనికి? ఈ లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి”. అంటూ శృంగవృక్షం (Srungavruksham) సేవ సమితి పట్టువీడని విక్రమార్కుడిలా తన నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నది.
శృంగవృక్షం ఎక్కడ ఉంది?
శృంగవృక్షం అనేది చిన్న కుగ్రామం. ఇది తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం (Thondangi Mandalam)లో ఉంది. అన్నవరం (Annavaram) నుండి ఒంటిమామిడి (Ontimamidi) వెళ్లే రహదారిలో ఉంది. ఆ కుగ్రామంలో ఉన్న ప్రజలు అందరు రాజకీయ పార్టీల తొత్తులై ఉన్నారు. ఏమైనా అవినీతి జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా నోరెత్తలేని స్థితిలో ఉన్నారు. అటువంటి నిర్లిప్తతలోంచి పుట్టినదే శృంగవృక్షం సేవ సమితి. దాన్ని నడుపుతున్నవారు రాజకీయ నాయకులు కాదు. సంఘ సంస్కర్తలు అసలే కాదు. అక్కడ, ఇక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు చేసికొంటున్న సామాన్య ఉద్యోగులు.
ప్రభుత్వంలో ఉన్న కొంతమంది స్థానిక నాయకులకి కంటిలో నలుసుగా ఆ శృంగవృక్షం సేవ సమితి నేడు తయారు అయ్యింది. దానికి లీడ్ చేస్తున్న వారిలో ఒకరైన బస్సా శ్రీనివాసరావు (Bassa Srinivasa Rao) అంటే స్థానిక నాయకులకు గుస్సా.
జగన్ ప్రభుత్వం (Jagan Government) పేదలకు పక్కా ఇల్లు (Pakka illu) అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసికొని చేస్తున్నది. కానీ స్థానిక నాయకులు మాత్రం పైసలు కోసం మాత్రమే చేస్తున్నారా అనే ఆరోపణలు ప్రజల్లో వస్తున్నాయి. ఆ ఆరోపణల దొంతరలు నుండి పుట్టినదే శృంగవృక్షం సేవా సమితి చేస్తున్న నేటి పోరాటం.
గంగమ్మ మెట్ట!
శృంగవృక్షం గ్రామానికి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పనికి రాని గోతులను, గుట్టలను (నాలుగు ఎకరాలు) ఎక్కువ ధరకి కొన్నారు. అయితే ఆ గంగమ్మ మెట్ట (Gangamma metta) ప్రాంతంలో ప్రభుత్వం భూమి 10 ఎకరాలు ఉంది. కానీ అందులో 5 ఎకరాలు తీసికొన్నారు. గోతులు, గుట్టలతో కూడిన 4 ఎకరాల గుట్టలను, గోతులను ప్రవేట్ వ్యక్తుల నుండి ఎక్కువ ధరకి కొనుగోలు చేశారు. మిగిలిన 5 ప్రభుత్వం భూమిని కూడా తీసికొని ఉండి ఉంటే, ఇలా కొనాలిసిన అవసరం ఉండేది కాదు. అని సేవా సమితి ఆరోపణలు చేస్తున్నది. అలా కొన్న భూమి కూడా నివాసయోగ్యం కాదు. పనికి రాని పొలాన్ని లక్షలకు లక్షలు పోసి కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని సాగు చేయడానికే మరికొన్ని లక్షలు పోయాలి. రోడ్లు లేవు. కరెంటు లైన్ లేదు. అక్కడ చిన్న స్థలం ఇస్తే ఎలా ఉండాలి. ఇలాంటి స్థానాల్లో ఇల్లు ఇచ్చినా గాని. కొన్ని రోజుల తరువాత వాటిని వారు ఆ భూస్వాములకు అమ్మేసి పోయే అవకాశం ఉంది.
అటువంటి నివాస యోగ్యం కానీ ఆ స్థలం మాకొద్దు. మాకు వేరే ప్రాంతంలో ఇవ్వండి. ప్రభుతం ఇచ్చేదే సుమారు 75 గజాలు. గుట్టల్లో, గోతుల్లో, దేనికి చెందని అడవిలాంటి ప్రదేశంలో ఆ సెంటున్నార ఇస్తే, పేద ప్రజలు ఎలా ఉండగలరు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. స్థలం నిర్ణయించడంలో, కొనుగోలులో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే. వాటిపై విచారణ జరిపించాలి అంటూ శృంగవృక్షాం సేవా సమితి తమ నిరంతర పోరాటం కొనసాగిస్తున్నది.
రెవెన్యూ అధికారులకు పిర్యాదు
స్థానిక నాయకులకు, స్థానిక మండల రెవిన్యూ అధికారులకు (Revenue Department) ఈ సేవా సమితి పీర్యాదులు చేస్తూనే ఉన్నది. అలానే స్థానిక ఎమ్మెల్యేకి, స్థానిక ఎంపీకి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్’కి కూడా శృంగవృక్షం సేవా సమితి పిర్యాదు చేస్తూనే ఉన్నది.
అయితే సమస్యకి పరిస్కారం దొరకలేదు గాని. జిల్లా కలెక్టర్ (District Collector) ఆదేశం మేరకు స్థానిక మండల రెవిన్యూ అధికారి (MRO) స్పందించారు. గాని ఈ సమస్య పరిస్కారానికి నేటికీ ఎటువంటి చర్యలు ప్రారంభించనే లేదు. కాలాతీతం అవుతున్నది. ఈ అధికారులు స్పంధించేది ఎప్పడు? సమసకి పరిస్కారం చూపేది ఎప్పడు? అంటూ శృంగవృక్షం సేవా సమితి ఆవేదన చెందుతున్నది. ఆరోపణలు చేస్తున్నది.
వివరణకు ప్రయత్నం?
గంగమ్మ మెట్ట ప్రాంతంలో ఇస్తాను అంటున్న ఆ స్థానాలు నివాసయోగ్యం కాదు. వాటిని వేరే ప్రదేశానికి మార్చాలి. ఒకవేళ ఇచ్చినా గాని వాటిని నివాస యోగ్యం చేసి ఇవ్వాలి అని శృంగవృక్షం సేవా సమితి అంటున్నది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాని సంప్రదించడానికి మా Akshara Satyam మరొక్క సారి ప్రయత్నం చేస్తుంది. వారు, స్థానిక రెవెన్యూ అధికారులు ఏమైనా వివరణ ఇచ్చినట్లు అయితే వారి వివరణతో, వారు చూపే పరిస్కారం మీముందు ఉంచడానికి మరోసారి ప్రయత్నం చేస్తుంది. శృంగవృక్షం సేవా సమితి చేస్తున్నవి ఆరోపణలా లేక నిజమేనా? దీనిపై ప్రభుత్వం ఏదైనా వివరణ ఇచ్చినట్లు అయితే ఆ వివరణని కూడా మీ ముందుకు తీసికొస్తాం.
ఈ సమస్య ఏదో ఒక్క శృంగవృక్షం గ్రామానికే చెందినది అనుకోరాదు. చాలా గ్రామాలలో ఇదే రకమైన సమస్య ఉండి ఉండవచ్చు అని ప్రభుత్వం తెలిసికోవాలి. అవకతవకలు ఏమైనా ఉంటే చర్యలు తీసికోవాలి. నివాసయోగ్యమైన ప్రాంతంలోని మాత్రమే స్థలసేకరణ జరగాలి అనే నిబంధన పెడితే బాగుంటుందేమో? లేకపోతే ప్రభుత్వ ప్రతిష్టతకే మబ్బులు కమ్మవచ్చు. రేపటి ఎన్నికలలో ఆ మబ్బులు ఇచ్చే తీర్పు ప్రభుత్వాలకు వ్యతిరేకంగాను ఉంటే ఉండవచ్చు. పునరాలోచించండి.
–Akshara Satyam