ఆంధ్ర ప్రదేశ్ పరిషత్ (Andhra Pradesh) ఎన్నిలపై ఏపీ హైకోర్టు (AP High Court)సంచలన తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను (Election Notification) రద్దు చేస్తూ నేడు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు (supreme court) మార్గదర్శకాలను అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ లేదని కోర్టు ఆక్షేపించింది. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ పాటించలేదని తన తీర్పులో చెప్పింది. తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) ఈ ఏడాది ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 7న పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించ లేదంటూ వర్ల రామయ్య సహా జనసేన, భాజపా నేతలు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సింగిల్ జడ్జి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం (State Government) డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేశామని, కచ్చితంగా 4 వారాల పరిమితి లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది డివిజన్ బెంచ్ ముందు వాదనలు వినిపించారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఇరు పక్షాల తరఫున పలు మార్లు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో విచారణను పూర్తిచేసిన ఉన్నత న్యాయస్థానం తాజాగా ఎన్నికలు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.