Register EarlyRegister Early

రాజకీయ కుట్రలపై శాంతి సందేశం

రాష్ట్ర ప్రజలారా, మరీ ముఖ్యంగా జనసైనికులారా (Janasainiks) గమనిస్తూన్నారా తోడుదొంగల భాగస్వాములు చేస్తూన్న రాజకీయ హడావిడి, గందరగోళం, కంగాళీ బూతు పురాణం? దీనికి అంతటికీ గల అంతర్గత ఎజెండా ఏమిటో ఎప్పుడైనా ఉహించారా?

మొన్ననే రెండు విడతగా మరలా రెండు కార్పోరేషన్, 11 మునిసిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే పథకం ప్రకారంగా చేస్తూన్న రాజకీయ హడావిడి అని భావించాలేమో.

సమస్యలపై చర్చలు ఎందుకు లేవు అంటే?

రాష్ట్రంలో మత్తుమందుల విషయం, హేటిరో సంస్థలో దోరికిన అక్రమ సంపద, పోలవరం నిర్మాణం, రాష్ట్రం అప్పులపైన చర్చ లేదు. అలానే థరల పెరుగుదల వలన మథ్యతరగతి ఎదుర్కోంటున్న సమస్యలపై చర్చలు లేవు. అలానే రాష్ట్ర రోడ్లు పరిస్థితి లాంటి సమస్యలు అన్ని పక్కకుపోయాయి.

పనికిమాలిన బూతు పంచాంగం, దాడులు పైన దృష్టి మరలేలా ఆ రెండు తోడుదొంగల భాగస్వామ్య పార్టీలు పకడ్బందీగా చర్యలు తీసుకుంటూన్నాయి. అందులో భాగంగానే బందులు, నిరసనలు, దీక్షలు లాంటి పనికిమాలిన విషయాల మీద హడావిడిగా పోలీసు కేసులు అంటూ హంగామా మొదలు పెట్టారు.

వీరిద్దరి దృష్టి ప్రజల దృష్టిని సమస్యలు పైనుండి మరలించటమే. ఉంటే నువ్వు, లేకపోతే నేను ఉండాలి అనే పరస్పర అవగాహనతో మరలా బయటకు వచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈసారి బలంగా, దాదాపు అన్ని స్థానాలలో జనసైనికులు పోటీ చేయబోతున్నారు. నిజంగా అదే జరిగితే ఒక రకమైన సంకేతం ప్రజలలోకి వెళ్ళుతుంది.

ఈ విషయంలోనే జనసేన పార్టీని 2019 ఎన్నికలలో ప్రజలు ఆదరించలేదు. అదేమిటంటే నాడు ప్రజలకు జనసేన పార్టీ ఏంత వరకు నిలబడుతుంది, కలబడుతుంది అనే దాని పైన పూర్తిగా నమ్మకం కలగలేదు. ఈ రెండు తోడుదొంగల భాగస్వాములు చేసిన విషప్రచారం వలన జనసేనపై ప్రజలకు నమ్మకం కలుగలేదు. ఇప్పుడు అటువంటి ముద్ర, మరక జనసేనపై పోయింది.

వాస్తవాలు గమనించటం మొదలుపెట్టారా?

ప్రజలు వాస్తవాలు గమనించటం మొదలుపెట్టారు. దాని పరిణామాలు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ముఖ్యంగా గమనించి జనసేనాని ఆదరించటం మొదలు పెట్టారు. ఇటువంటి పరిణామాలు కట్టడి చేయాలనే కుట్ర, కుతంత్రం ఆ రెండు పార్టీలు చేస్తున్నాయి. మరలా రాష్ట్ర రాజకీయాలు ఈ తోడుదొంగల భాగస్వాములు పార్టీల మథ్యనే చర్చలు తిరిగేలా ప్రణాళిక రచిస్తున్నారు. తద్వారా ప్రజల మైండ్ సెట్ ఆ రెండు పార్టీలకు అనుకూలంగా మరల్చటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకే నేడు రాజకీయాలు (Politics) పూర్తిగా తమ రెండు పార్టీ మథ్యనే ఉండాలనే రాజకీయ కుట్రపూరిత విథానాలు చూస్తున్నారు. తద్వారా మరలా కృశించిపోతున్న పచ్చ పార్టీకి (Pacha Party) జవసత్వాలు ఇవ్వటం ద్వారా… పాలక పార్టీ ఓట్లు చీలిక ప్రయత్నాలు చేయటంతో తమ గెలుపు తేలిక చేసుకోవాలి అనేది అంతర్గత భావన. ప్రజలు ఎట్టి పరిస్థితిలో కూడా జనసేన (Janasena) వైపు చూడకూడదనే కుట్ర పూరిత యావ వీరిద్దరిలో కనబడుతుంది. దీనిని జనసైనికులు నిశితంగా గమనించండి. వీరిరువురి ట్రాప్ లో పడకుండా, పూర్తిగా రాబోయే ఎన్నికల పైన దృష్టి పెట్టటం ద్వారా, ప్రజలందరికీ ఒక స్పష్టమైన సందేశం వెళ్ళాలి.

జనసేన విజయం సాధించాలి అంటే?

అదేమిటంటే జనసేన పార్టీ (Janasena Party) ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తూంది. అందుకే జనసేన పార్టీ ఎన్నికలలో నిలబడి, కలబడుతుంది. ఇది ప్రజల కోసం అనేది స్పష్టంగా, విస్పష్టంగా ప్రజలకు తెలియాలి. ఇటువంటి సంకేతం, సందేశం ఒక్క సారి ప్రజల లోకి వెళ్ళితే చాలు. 2024 సాథారణ ఎన్నికలలో జనసేన విజయం అప్రతిహతంగా ఉంటుంది. అది జరగకూడదనే, ఈ రెండు తోడుదొంగల భాగస్వామ్య పార్టీలు కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారు. తద్వారా ప్రజల దృష్టి మరల్చటానికి ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తూన్నారు.

జనసేన పట్ల సానుకూల స్పందన

ఇది వాస్తవం. దీనిని జనసైనికులు (Janasainiks) జాగ్రత్తగా గమనించాలి . జనసేనుని (Janasenudu) రాజమండ్రి (Rajahmundry) యాత్ర తరువాత అన్ని వర్గాల ప్రజల నుంచి జనసేన పట్ల సానుకూల స్పందన వస్తున్నది. జనసేనానికి వస్తూన్న అదరణ చూసి, అలానే ఈ మారుతున్న దృక్పథం గమనించన ఆ రెండు పార్టీలు అసూయతో కుట్రలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయాలు ఎల్లప్పుడూ మనిద్దరి మథ్యనే ఉండాలనే అవగాహనతో రాజకీయ కుట్రలు చేస్తున్నారు. కుట్రపూరితంగా, నేర్పుగా ప్రజల దృష్టి మరల్చటానికి ఆ రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూన్నారు. జనసైనికులారా ఇది గమనించగలరు. మీ ఓటుని రిజిస్టర్ చేసికోండి. దాన్ని కాపాడుకోండి. తస్మాతు జాగ్రత్త.

శాంతిప్రసాద్ సింగళూరి (Shanti Prasad Singaluri), అడ్వకేట్, జనసేన లీగల్

Spread the love