Media 2Media 2

బడుగుల ఆవేదనను వినిపించే ఛానల్ కావాలి అనే నినాదం ఇటీవల సోషల్ మీడియా (Social Media) లో ప్రస్ఫుటంగా వినిపిస్తున్నది. చిన్న చిన్న గోంతుకలు ఒక్కటై, ఐక్యంతో ఒక బలమైన గోంతుకగా గళమెత్తుతున్నది. ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం మరియు వాంఛనీయం. ఇందుకు కోన్ని ప్రథాన కారణాలు మన చరిత్ర నుంచి తీసికొని ఉదహరిస్తాను.

రంగా అణచివేతలపై కుల మీడియా?

వంగవీటి రంగాని (Vangaveeti Ranga) ఏనాడూ మానవతావాదిగా, బడుగు,బలహీన వర్గాల పెన్నిథిగా ఈ కుల మీడియా చూపలేదు. కానీ రంగాని ఒక రౌఢీ, గుండా, కిరాతకుడిగా నాటి పచ్చ మీడియా (Media) చిత్రీకరణ చేసింది. అయినప్పటికీ అదే రంగా వెంట కోట్ల మంది అనుసరించటం మొదలు పెట్టారు. కారణం అయన బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడటమే. అతనిని మొట్టమొదటిగా గుర్తించి, గౌరవించింది కాపులు (Kapulu) కాదు. విజయవాడ (Vijayawada) మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఉండే బడుగు, బలహీనులు.  మరియు సత్యనారాయణపురంలో ఉన్న బ్రాహ్మణులు అనే విషయాన్ని మాత్రం సుస్పష్టంగా చెప్పగలను.

ఆ తరువాత మాత్రమే కాపు (Kapu) జాతి అతనిని అనుసరించటం చేసింది. అయని నిస్వార్థ సేవ చూసి ఓర్వలేక అతనిని సంఘ విద్రోహ శక్తిగా ఈ మీడియా చూపింది. వాస్తవానికి వంగవీటి రంగా రాజకీయంగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు అతీతంగా ఎదుగుతున్న నేత. కానీ  తమకు భవిష్యత్తులో రాజకీయంగా కంటగింపుగా మారతాడు రంగా మారతాడు అని కొందరు పాలకులు భావించారు. మరియు ముఖ్యమంత్రి పీఠం అథిరోహణకు రంగా అడ్డం వస్తాడని నాడు కొందరు పెద్దలు భావించారు. అందుకే నాడు అతనిని హత్య చేయటం జరిగింది. అందులో పచ్చ పార్టీ నాయకులది ప్రముఖ పాత్ర ఉండవచ్చు. అయితే కొందరి కాంగ్రెసు నేతల చీకటి పాత్ర కూడా ఉండవచ్చు. ఈయన హత్యకు కుట్ర పన్నిన చీకటి దోస్తులు వారు తరువాత కాలంలో రాష్ట్రంలో ముఖ్య పదవులను అధిరోహించారు.

రంగా మరణం విషాదంలో జాతి యావత్తు ఉంది. అలాంటప్పుడు పచ్చమీడియా (Pacha Media) వండివార్చిన కథనాలతో ఈ వర్గం వారిని, మిగిలిన వర్గాల వారికి విజయవంతంగా దూరం చేయటం జరిగింది. ఇక్కడ మరోక విషయం ఏమిటంటే రంగా మరణం వలన అథికారంలోకి వచ్చిన కాంగ్రెసు పార్టీ కూడా రంగా గారికి సముచిత స్థానం ఇవ్వలేదు. నాడు వాస్తవాలు ఏమిటో చెప్పటానికి స్వతంత్ర, తటస్థ గొంతు అయిన మీడియా లేకపోవటం కూడా దీనికి ఒక కారణం. దానితో ఏకపక్షంగా వండివార్చిన కథనాలు ద్వారా ఒక జాతిని పూర్తిగా ఇతరులతో దూరం జరిపారు.

రంగా మరణాంతరం?

తదనంతర కాలంలో ముఖ్యమంత్రులైన ఆ చీకటి మిత్రులు కాపులను లోబరుచుకోవడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే కాపులకు రిజర్వేషన్లు (Kapu Reservations) అనే మాయమాటలతో ఈ జాతి మొత్తాన్ని జోకొట్టడం మొదలు పెట్టారు. సహజంగా అథిక జనాభా ఉన్న కాపులు పేదరికానికి దగ్గరగా ఉన్నారు. అందుకే వీరి మాయమాటలను అమాయకంగా నమ్మటం చేశారు. అదే తమవాడు ముఖ్యమంత్రి అయితే తమ స్థితిగతులు ఏలా అందరితో పాటు మారతాయో అనే నిజాన్ని వీరు నాడు ఊహించలేదు. వీరికి అటువంటి అవగాహన రాకుండా తాయిలాలు, రిజర్వేషన్లు అనే మత్తులో కాపు తదితర కులాలను జోకోట్టారు.

ప్రజారాజ్యం పతనంలో కులమీడియా?

చిరంజీవి 2009లో ప్రజారాజ్యం (Praja Rajyam) అనే పార్టీ పెట్టి బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది. సమసమాజం వైపు రాష్ట్రం అడుగులు వేయాలని చిరంజీవి ఆశించారు. అందుకే ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే నినాదంతో ప్రజారాజ్యం ముందుకు వచ్చింది.

రాజశేఖరరెడ్డి (Rajashekhar Reddy) చేతిలో పచ్చ వర్గం విలవిల లాడుతూ, బతుకు అశలేదనుకోని ఒక పాలక వర్గం వారు ప్రజారాజ్యం పార్టీలో చేరడం జరిగింది. అందుకే ఇంద్రుడు, చంద్రుడు అని చిరంజీవిని పచ్చ మీడియా పొగడం చేసింది. వర్గాల వారిగా ఓట్లు చీలిక వస్తే, తమ పచ్చ పార్టీకి భవిష్యత్తు మెరుగవుతుందని పచ్చ మీడియా భావించింది. వెను వెంటనే చిరంజీవి పైన కులముద్ర వేయడం పచ్చ మీడియా మొదలు పెట్టింది.

ప్రజారాజ్యం పార్టీ టికెట్లు సినిమా టిక్కెట్లు మాదిరిగా అమ్ముకొంటున్నది అన్న దుష్ప్రచారం ఈ కుల మీడియాలో మొదలు పెట్టారు. దీనిని మొట్టమొదటిగా నమ్మిన అమాయక జాతి కాపుజాతి అని చెప్పక తప్పదు. చివరకు మదగజాల్లాంటి కాంగ్రెసు, తెదేపా మథ్యన పోరాడి 18 స్థానాలలో ప్రజారాజ్యం గెలుపొందింది. అయినాగాని చిరంజీవి పైన “జెండా పీకెద్దాం లాంటి” వండివార్చిన కథనాలతో ఈ కుల మీడియా విషప్రచారం చేసింది. చిరంజీవిని అణగారిన వర్గాల ముందు దోషిగా నిలబెట్టారు.

సదరు అమాయకపు కాపులు ఇప్పటికీ చిరంజీవి (Chiranjeevi) టిక్కెట్లు అమ్ముకున్నాడు అనే బానిస మనస్తత్వం నుంచి బయటపడక పోవటం నిదర్శనం. సోమ్ములు తీసికొని వ్యాపారస్తులకు తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఇచ్చారు అనే ఆరోపణలు వచ్చినా గాని ఈ కుల నాయకులు అడగరు. మరొక నీలి మీడియా అభిమాన పార్టీపై కూడా ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. ఈ దొడ్డల నాయకుడు గత ఎన్నికలలో ఎమ్మెల్యే కనీసం 10 కోట్లు ఇవ్వాలి, ఎంపీ కనీసం 50 కోట్లు ఇవ్వాలి అనే షరతుతో టిక్కెట్లు పంపకం చేసాడని అని మీడియా సాక్షిగానే ఆరోపణలు వచ్చాయి. ఇది తెలిసినాగాని ఈ కుల నాయకులూ వీరిని ప్రశ్నించడం లేదు.

వాళ్ళు తీసికొంటే విరాళాలు-చిరు అయితే అమ్ముకోవడమా?

ఆ రెండు పాలక పార్టీల వారు పార్టీ విరాళాల కోసం తీసుకున్నామని చెబితే, క్యాబేజీ పుష్పాలు చెవులలో పెట్టుకోని మరీ నమ్మారు. కానీ అదే చిరంజీవి ఉన్న వారి దగ్గర తీసుకోని, లేని వారికి ఎన్నికలలో ఖర్చు కోసం పంచటానికి తీసికొని ఉండవచ్చు. అనే అనే కనీస సృహ, జ్ఞానం లేకుండా కూడా వీరికి లేకుండా పోయింది. ఇప్పటికీ అటువంటి సృహ, జ్ఞానం వీరికి రావటం లేదు. నాడు 294 సీట్లలో 104 సీట్లు బడుగు, బలహీన వర్గాలకు ప్రజారాజ్యం ఇచ్చింది. వారి ఎన్నికలు ఖర్చు కోసం, థనం ఉన్న వారి దగ్గర పార్టీ విరాళాలు రూపంలో వసూలు చేస్తే, దానిని అయన సోంతం కోసం తీసుకున్నాడనే కుల మీడియా ప్రచారం చేసింది. ఆ ప్రభావంతో, ఉన్మాదులైన ఈ జాతి జనులు చిరంజీవికి ఆరోజున అండగా నిలబడలేదు.

ఏ ఇతర వర్గాల వారు అనలేని మాటలను, కాపు కాసేవారే చిరంజీవిపై అథికంగా ప్రచారం చేశారు. స్వతహాగా చిరంజీవి తనకు వచ్చిన భాథను, అవమానాలను స్వయంగా భరిస్తాడు తప్పితే, ఇతరులతో పంచుకోవడం చేయడు. చివరకు చిరంజీవి తన వర్గం వారు కానీ, ఇతర బడుగు బలహీన వర్గాల వారు కానీ రాజకీయంగా ఆదరించడం చేయలేదు.

పిర్పీ విలీనానికి కారణం?

నాడు జగన్ రెడ్డి (Jagan Reddy) తన వ్యక్తిగత లక్ష్యంతో కాంగ్రెసు పార్టీని అతలాకుతలం చేయడం మొదలు పెట్టారు. మరోకవైపు కేసిఅర్ తెలంగాణా ఉద్యమంతో రాష్ట్ర విభజనకు పట్టు బట్టారు. చంద్రబాబు గోడ మీది పిల్లి లాగ రెండు కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటం ఆడడం మొదలు పెట్టారు. నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర విభజన జరగదు అనే భావనతో ప్రజారాజ్యాన్ని కాంగ్రెసు పార్టీ (congress Party) లో విలీనం చేసిన అమాయకుడు చిరంజీవి.

కనీసం అటువంటి సమయంలో కూడా తనతో ఉన్న వారికి ఉన్నత పదవులు, తనకు కీలక కేంద్ర మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. అయినా అంతర్గతంగా అణగారిన వర్గాలకు మంచి చేయమని కోరుతూ, మిగిలిన విషయాలో బేషరుతుగా తన పార్టీని విలీనం చేశాడు. పార్టీ విలీనం చేసిన కోన్ని నెలల తరువాత రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆ తరువాత మరికొన్ని నెలల తరువాత ఒక అనామక కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా ఏమీ మాట్లాడటం చేయలేదు మన అమాయక చిరంజీవి. కారణం చిరంజీవి నిస్వార్థజీవి. ఇది మాలాంటి దగ్గరగా ఉండి చూసిన వారికి మాత్రమే తెలుసు.

పిర్పీ విలీనానికి పవన్ వ్యతిరేకత?

ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రథానమైన, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని విభేదించాడు, వ్యతిరేకించాడు. కానీ విలీనం సంపూర్ణం అవటంతో, తండ్రి తరువాత తండ్రి లాంటి దైవసమానుడైన చిరంజీవితో పవన్ కళ్యాణ్ దూరంగా జరిగిపోయాడు. మెగా కుటుంబంతో చాన్నాళ్ల పాటు సంబంధాలు కూడా కళ్యాణ్ బాబు పెట్టుకోలేదు. ఈ విషయం ఈతరం వారందరికీ తెలిసిన నగ్నసత్యం.

కానీ ఇటువంటి విషయాలను ఏ పచ్చ మీడియా, నీలి మీడియా ప్రచారం చేయదు. పైగా ప్రజారాజ్యం పార్టీ పెట్టక మునుపు చిరంజీవి గారి కుటుంబంలో మహిళల పట్ల నాడు పచ్చ మీడియా చేసిన దాష్టికం వర్ణణాతీతం. దీని నంతటిని అనగా పచ్చ మీడియా, పచ్చ పార్టీ, నీలి మీడియా ద్వారా నాడు జరిగిన విషప్రచారం పంటి బిగువునా భరించిన వాడు చిరంజీవి. కానీ సోంత జాతి జనులు అయన వెనుక అండగా నిలబడలేదు. రాజకీయంగా ఆదరించలేదు. పైగా ఈ జాతి వారే చిరంజీవిని రాజకీయంగా బదనాం చేయటంలో ప్రముఖ పాత్ర పోషించారు. దానిని అత్యథిక జాతి జనులు అమాయకంగా విశ్వసించారు. కారణం నాడు వాస్తవాలు ఏమిటో చెప్పటానికి మనకు ఒక సోంత మీడియా లేకపోవటమే.

అణగారిన వర్గాలపై నీలిమీడియా ప్రభావం?

నాడు కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేసిన ఉద్యమంలో చంద్రబాబు చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలు, దమనకాండను ఏ పచ్చ మీడియా చూపలేదు. నీలి మీడియా కూడా తూతూ మంత్రంగా చూపించింది.గాని తిప్పికొట్టలేదు. నాడు కాపు వర్గానికి చెందిన వ్యక్తి యొక్క నెంబరు.1 ఛానల్ మాత్రమే లైవ్ ప్రసారం చేయగలిగింది. అందుకే నాటి ప్రభుత్వ దాష్టికాలు ప్రజలకు కొంతవరకు అయినా తెలిసాయి. ఆ ఒక్క ఛానల్త లేక పోయి ఉంది ఉంటె పచ్చ, నీలి మీడియా వీటిని కూడా తోక్కేసేవారు. కాపులను ఒక అసాంఘిక శక్తులుగా చిత్రించేవారు.

చివరకు ఈ ముద్రగడ వలన లాభం పోందినది యుశ్రారైకాపా మాత్రమే. కానీ యుశ్రారైకాపా అథికారంలోకి వచ్చిన తరువాత కాపులకు ఏటేటా నిథుల విడుదల విషయంలో చేస్తూన్న మోసాలను అదే పెద్దాయన ప్రశ్నించక పోవటం పెద్ద ప్రశ్నగా మారిపోయింది. పైగా అవేశంతో కోందరు కాపు యువత చేసిన సోషల్ మీడియా ద్వారా పోస్టులు చూసి మనస్తాపంతో ఇకనుంచి ఏమీ చేయను అని కాపు పెద్దాయన అన్నారు. దాన్నే అమాయకంగా కాపు జాతి జనులు నమ్మారు. ఇప్పటికీ నమ్ముతున్నారు. యుశ్రారైకాపా కూడా అవసరం తీరిపోయింది అని పక్కన పడేశారు.

ఈ నిజా నిజాలు సమాజానికి తెలియాలి అంటే ఒక ఛానల్ని కావాలి. నిజాన్ని నిజాయితీగా, నిర్భయంగా చూపే ఒక స్వతంత్ర, తటస్థ భావజాలం కలిగిన ఛానల్ అవసరం ఎంతైనా ఉంది అనటానికి నేను ఏమాత్రం సందేహించను.

పవన్ కళ్యాణ్ ప్రవేశంపై కుల మీడియా?

ఇకపోతే నాటి ప్రజారాజ్యం వైఫల్యం తరువాత కూడా అవమానభారం శిలువ మాదిరిగా మోస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ముందుకు వచ్చారు. సమాజంలో మార్పు కోసం, బడుగ బలహీన వర్గాల సాథికారికత కోసం థనస్వామ్యం లేని ప్రజాస్వామ్యం కోసం జనసేన పార్టీతో వచ్చారు. సామాన్య ప్రజలు కూడా ఎన్నికలలో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా మారటం కోసం కళ్యాణ్ఒ బాబు క్కడుగా పిడికేడు మందితో జనసేన
పార్టీని స్థాపించారు.

పవన్ కళ్యాణ్ అలోచనలు, అదర్శాలు నేటికీ ఈ జాతి జనులు అనగా కాపు, బడుగు బలహీన వర్గాల వారు అర్ధం చేసుకోవటం లేదు. 2014 ఎన్నికలు సమయంలో స్వయంగా పోటీ చేయకుండా మోడీతో పోత్తు పెట్టుకొన్నారు. భాజపా తెదేపాతో నాడు పోత్తులో అథికారికంగా ఉండటం వలన, తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా మోడీ కోరిక మేరకు తెదేపా గెలుపుకు పవన్ కళ్యాణ్ సహయం చేశారు. కానీ అదే తెదేపా పవన్ కళ్యాణ్ గారిని ఏరకంగా అయన తల్లిని, కుటుంబ సభ్యులుపైన చేసిన విషప్రచారం అందరికీ తెలిసినదే.

పవన్ కళ్యాణ్’పై కమ్మని దొడ్డల మీడియా?

కానీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి అంత అమాయకుడు కాదు. సోషల్ మీడియా ద్వారా అతను పెట్టిన ఒకే ఒక్క పోస్టు ద్వారా జనసైనికులు అపూర్వంగా స్పందించటంతో నాటి పచ్చ మీడియా ఛానళ్ళు తోక ముడిచాయి. పవన్ కళ్యాణ్ గారు మొండివాడు, అత్యంత పట్టుదల కలవాడు. కాబట్టి 2019 ఎన్నికలలో తమ వర్గం ఆయన వెంట లేదు. అనూహ్యంగా పరాజయం పాలైనారు. అయినా అన్నిటినీ హలాహలం మాదిరిగా కళ్యాణ్ది బాబు గమింగుకుని ఎదురొడ్డి నిలబడ్డాడు, కలబడ్డాడు.

అయితే ఇప్పుడు కూడా పచ్చ, నీలి మీడియాలు చేసిన విషప్రచారాలను నమ్మి ఈ కాపు జాతి జనులు తమ భవిష్యత్తుకు తామే “శిలువ” వేసుకున్నారు. కానీ అతనితో నిజాయితీగా, నిస్వార్థంగా 2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది రాజకీయంగా అడుగులు వేసి, ఓట్లు వేశారు. ఒక అడుగు బలంగా పడింది, కాకపోతే నాటి ప్రజారాజ్యం నిందను, జాతిజనుల అమాయకత్వాన్ని నిశ్శబ్దంగా భరించాడు. అయినా ఏమాత్రం కుంగిపోలేదు, నిరాశపడలేదు, బెదరలేదు.

పవన్ కళ్యాణ్ ఓటమితో పడి లేచారు?

పైగా ఓడిన మరుక్షణం నుంచి అథికార పార్టీ పైన దృష్టి పెట్టి 100 రోజులు పాలన నుంచి ప్రజాసమస్యల పైన గళం ఎత్తి, పోరాటం మొదలు పెట్టారు. భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నంలో కవాతు చేశారు. సుగాలీ ప్రీతి కోసం కర్నూలులో కవాతు చేయటం ప్రముఖంగా చెప్పవచ్చు. ఇక అమరావతి రైతుల పక్షాన నిస్వార్థంగా, నిజాయితీగా నిలబడ్డారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఈసారి నీలి పార్టీ అతిప్రతివతలతో నీచమైన రాజకీయాలకు తెరతీసింది.

నేడు పచ్చ మీడియా ద్వారా మరలా పవన్ కళ్యాణ్ గారు తమతో కలుస్తారు అంటూ విషప్రచారం మొదలు పెట్టారు. దీనికి కోందరు జనసైనికులు ముసుగులో ఉన్న తెదేపా పాలేగాళ్ళు వంత పాడుతున్నారు. యుశ్రారైకాపా పాలే కాపులు దానిని బూచిగా చూపుతూ, సర్వ జనులను నమ్మించడానికి కుట్రలు పన్నుతున్నారు.

కాపులు, బడుగు బలహీన వర్గాలకు పప్పు బెల్లాలు తాయిలాలుగా చూపిస్తున్నారు. అలా ప్రతీ రోజు వారి ప్లేట్లలో వారే బిర్యానీ ఏలా తింటున్నారు అనే వాస్తవాలు ఇకనైనా సర్వులకు తెలియాల్సిన సమయం ఆసన్నమైంది. వీటిని విపులంగా, వివరంగా, విశ్లేషణాత్మకంగా, సహేతుకంగా, థర్మబథ్థంగా, న్యాయబథ్థంగా వాస్తవాలు వాస్తవాలుగా చూపించే నికార్సయిన  ఒక స్వతంత్ర, తటస్థ ఛానల్ అవసరం ఏంతైనా ఉన్నది.

ఇక్కడ ఒక్క విషయం మాత్రం సుస్పష్టంగా చెప్పదలచుకున్నాను. సదరు ఛానల్ జనసేన పార్టీ ఎదుగుదల కోసమే కాదు. అణగారిన వర్గాల కన్నీటిగాధలను చెప్పేదిగా ఉంటుంది. వాస్తవాలు వాస్తవాలుగా చూపితే, చెబితే ప్రజలు వారంతట వారే ఎటువంటి విషప్రచారానికి ప్రభావితం కాకుండా, స్వీయనిర్ణయం తీసుకోగలుగుతారు. తమకు ఎవరు మంచి చేయగలరు. సక్రమమైన పాలన, అభివృద్ధి ఎవరు ఇవ్వగలరని తెలిసికోగలుగుతారు.

అందుకే ఈ పిపీలికాల పీలిక స్వరంతో నేను సైతం స్వరం కలుపుతున్నాను. మరి మీరో?

శింగలూరి శాంతి ప్రసాదు(Shanti  Prasad Singaluri) న్యాయవాది, జనసేన లీగల్

Spread the love
One thought on “బడుగుల ఆవేదనను వినిపించే ఛానల్ కావాలి: శాంతి సందేశం”
  1. నేను సైతం ? i am cameramen and content presenter, voice over artist

Comments are closed.