Pawan and ModiPawan and Modi

జనసేన (Janasena), బీజేపీల (BJP) మధ్య పొత్తు (Alliance) బీటలు వారుతున్నాయి అన్నట్లుగా కుల మీడియా (Kula Media) విష ప్రచారాన్ని (Visha Pracharam) మొదలు పెట్టింది. దీనిపై జనసైనికులు (Janasainiks) అప్రమత్తమై ఉండాలి. నీలి (Neeli Media), పచ్చ మీడియాని (Pacha Media) మించిన విష ప్రచారాన్ని కొన్ని తటస్థ ఛానళ్ళు (Channels) అని చెప్పుకొనేవి కూడా చేస్తున్నాయి. తటస్థు ఛానెళ్లు అనే ముసుగులో ఉన్న ఛానెళ్లు జనసేన పార్టీపైన (Janasena Party) డిబెట్లు రూపంలో విషం చల్లడం మొల్లమొల్లగా మొదలు పెట్టారు.

అదేమిటంటే? జనసేన (Janasena) భవిష్యత్తులో తెదేపాతో (TDP) కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నది అనే ప్రచారాన్ని చేస్తున్నాయి. అందుకే జనసేన భాజపాతో (BJP) కలసి ఎటువంటి రాజకీయ కార్యచరణ ఉమ్మడిగా (Common agenda) చేయడం లేదు అనే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. జనసేన సోంతగా ఎదగటానికే ప్రాథాన్యం ఇస్తుందనే వాఖ్యలు, వాఖ్యానాలు, విష చర్చలు నర్మగర్భంగా చేస్తున్నారు. విశ్లేషకులు (Analysts) అనే పచ్చ మీడియా (Paccha Media) సానుకూలురతో కొన్ని ఛానెళ్లు (Channels) ప్రచారానికి పూనుకొంటున్నాయి. పాలక పార్టీల (Ruling Parties) మీడియాకి డప్పు కొంటున్నాయి. అయితే ఇటువంటి ఛానళ్ళు ఎక్కువగా యూట్యూబ్ (Youtube) ద్వారా మాత్రమే ప్రసారం అవుతున్నాయి. అందుకే అత్యథిక ప్రజలకు ఈ విషయాలన్నీ ఇంకా పూర్తిగా అవగాహన కావటం లేదు.

నేను ఒక విషయం మాత్రం సుస్పష్టం గా చెప్పదలచుకున్నాను. పాము చిన్నదైనా, పెద్ద కర్రతో కోట్టాలనే పెద్దలు చెప్పే మాట ఖచ్చితంగా పాటించాలి. ఇటువంటి దిక్కుమాలిన ప్రచారం విషయంలో కూడా జనసైనికులు (Janasainiks) అప్రమత్తంగా ఉండాలి.

బీజేపీతో పొత్తు ఖాయం?

ఇక్కడ ఒక విషయం గమనించాలి. జనసేన పార్టీ (Janasena Party), రాష్ట్ర భాజపాతో (BJP) 2024 ఎన్నికలలో పోత్తుతో (Political Alliance) మాత్రమే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అంటే, నిత్యం ఉదయం లేవగానే ఇరువురు మిత్ర పక్షాలు కలిసి కాఫీ (Coffee), టిఫిన్ (Tiffin) చేయడం కాదు. ఉమ్మడిగా అడుగులు వేస్తూ, రాజకీయ కార్యచరణ చేస్తూ, రాత్రి భోజనం కలసి చేయడం కాదు. అలానే ఆ తరువాత శుభరాత్రి అని చెప్పుకొని, రాత్రికి విశ్రమించి, మరలా ఉదయం కాగానే అదే రకమైన కార్యచరణ చేయటం కోసం కాదు అనే విషయం ఇటువంటి దిక్కుమాలిన ఛానళ్ళు అర్ధం చేసుకోవాలి.

ఇక్కడ జరిగిన ఒప్పందం (Agreement) ఎన్నికలలో పోత్తు గురించి మాత్రమే తప్పితే, ప్రతీ రోజు కలసి ఉమ్మడిగా ప్రణాళికలు వేసుకోని రాజకీయ కార్యక్రమాలు, ఉద్యమాలు చేయటం కోసం కాదు అని పచ్చ మీడియా నీలి మీడియాలకు కూడా తెలుసు. కానీ వీరి పొత్తుని విచ్చిన్నం చేయడం కోసం మాత్రమే విష ప్రచారం చేస్తున్నారు.

స్వయంగా ఎదుగుల – ఉమ్మడిగా పోరాటం?

జనసేన పార్టీ జనసేనగా (Janasena) ప్రజాక్షేత్రంలో స్వయంగా ఎదుగుతుంది. రాష్ట్ర భాజపా కూడా తనంతట తానుగా స్వయంగా ఎదుగుతుంది. ఈరకంగా రెండు మిత్ర పక్షాలు తమ తమ వ్యక్తిగత బలాన్ని పెంచుకొంటాయి. ఇలా పెంచుకోవటం వలన రెండు పార్టీలకు ప్రజాదరణ పెరుగుతుంది. తద్వారా పెరిగిన బలాబలాలతో ఉమ్మడి ప్రణాళిక ద్వారా పోత్తు రాజకీయాలతో ఎన్నికలకు వెళ్ళటం జరుగుతుంది. ఇది ఉభయ పార్టీలకు మంచి జరిగే పరిణామం.

అలా కాకుండా నిత్యం ఒకరితో మరోకరు అనే కార్యచరణ వలన ఏవరి బలం ఏంత, ఏవరికి ఎక్కడ బలహీనత ఉన్నది అనే విషయం తెలియకుండా పోతుంది. స్వీయ ఎదుగుదల-ఉమ్మడి పోరాటం వల్ల ఇరు పార్టీలు తమ తమ వ్యక్తిగత బలాన్ని, బలహీనతలు కూడా అవగతం చేసికోవడానికి అవకాశం ఉంటుంది. వాటికి అనుగుణంగా ప్రణాళికలు రచించి, స్వీయ ఎదుగుదల లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉండవచ్చు. తద్వారా ఏర్పడిన బలంతో ఉమ్మడిగా ఎన్నికలలో పోటీ చేయటం జరుగుతుంది.

జనసేన-బీజేపీలు వ్యూహంతో అడుగులు?

ఇది ఒక బలమైన వ్యూహం (Strategy). అయితే ఈ వ్యూహరచన అర్ధం చేసుకోలేక, ఇటువంటి దిక్కుమాలిన ఛానళ్ళు దిక్కుమాలిన డిబెట్లు (Debates) పెడుతున్నాయి. డిబేట్లు పెట్టి విడివిడిగా ఉన్న పరిస్థితులను గుదగుచ్చి, దానికి తమలో ఉన్న వికారం జోడించి కళాత్మకతతో విషప్రచారం మొల్లమొల్లగా జనాలకు నూరిపోయటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది అంతా నీలి, పచ్చ మీడియాల అండతోనే మొదలు పెట్టారు.

ఈ పచ్చ, నీలి మీడియాలు ఇటువంటి విషప్రచారం ఇప్పటి నుంచే చేస్తే, తటస్థలు, సామాన్య ప్రజలు మెల్లి మెల్లిగా నమ్మించవచ్చు అనేదే వీరి ప్రధాన ఉద్హేశం. ఇదే ప్రథాన కారణం. పైగా సదరు నీలి, పచ్చ ఛానళ్ళు ఇప్పటి నుంచే ఇటువంటి ప్రచారం చేస్తే, ఎన్నికలు సమయం నాటికీ ప్రజల మెదళ్ళను విష పూరితం చేయవచ్చు అనేదే వీరి కుట్ర. సామాన్యులకు వాస్తవాలు అర్ధం కాకుండా డైవర్సిన్ దేబాట్లను ఈ కుల ఛానెళ్లలో చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో ప్రజలను నమ్మించినట్లుగా అప్పటికప్పుడు నమ్మించడం కష్టం అనే అలోచనతోనే ఈరకమైన కుట్రలు ఇప్పటినుండే చేస్తున్నారు. అందుకే తాము నేరుగా చేయకుండా మిగిలిన ఛానళ్ళు ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఉన్న యాంకర్లను (Anchors) అంతర్గతంగా ప్రలోభాలకు గురి చేసి, తమ విషపు డిబెట్లు ద్వారా మెల్లమెల్లగా జనసేన-బీజేపీల పొత్తుపై (Janasena-BJP alliance) ప్రజల్లోకి విషం ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి కుల మీడియా, వాటి అనుబంధ మీడియాల్లో వస్తున్న విషపు డిబేట్లపై జనసైనికులు అప్రమత్తంగా ఉండడం ఎతైన అవసరం.

— Shanti Prasad Singaluri), న్యాయవాది, జనసేన లీగల్

గంజాయి అక్రమ రవాణాపై దృష్టి